భారత ఎన్నికల సంఘం
azadi ka amrit mahotsav g20-india-2023

ఉజ్బెకిస్థాన్‌ లో జరుగుతున్న ముందస్తు అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ పరిశీలిస్తున్న భారత ఎన్నికల కమిషనర్,డాక్టర్ అనూప్ చంద్ర పాండే


ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆమోదించిన కొత్త రాజ్యాంగం కింద ఉజ్బెకిస్థాన్‌ లో జరుగుతున్న ఎన్నికల ఆసక్తిగా పరిశీలిస్తున్న ప్రపంచ దేశాలు

Posted On: 08 JUL 2023 6:09PM by PIB Hyderabad

ఉజ్బెకిస్తాన్ కేంద్ర ఎన్నికల సంఘం ఆహ్వానం మేరకు భారత ఎన్నికల కమిషనర్,డాక్టర్  అనుప్ చంద్ర పాండే నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన బృందం ఉజ్బెకిస్థాన్‌ లో పర్యటిస్తోంది. రేపు( 2023 జూలై 9)  న  జరగనున్న ఉజ్బెకిస్థాన్‌  అధ్యక్ష ఎన్నికల నిర్వహణను  ముగ్గురు సభ్యుల ప్రతినిధి బృందం పరిశీలిస్తుంది. ప్రస్తుత అధ్యక్షుడితో సహా నలుగురు  అభ్యర్థులు పోటీలో ఉన్నారు.  ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇటీవల జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ఉజ్బెకిస్తాన్‌లో అమలు లోకి వచ్చిన నూతన  రాజ్యాంగం కింద ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రపంచ దేశాలు ఉజ్బెకిస్థాన్‌ ఎన్నికలను ఆసక్తిగా పరిశీలిస్తున్నాయి. 

అంతకుముందు ఎన్నికల సహకారంపై  ఉజ్బెకిస్థాన్ చైర్మన్,సీఈసీ తో  డాక్టర్ అనూప్ చంద్ర పాండే 2023 జూలై 6న  చర్చలు జరిపారు. . భారతదేశంలో ఇటీవల జరిగిన ఎన్నికల నిర్వహణ, ఇరు దేశాల మధ్య ఎన్నికల సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి వివిధ మార్గాల గురించి డాక్టర్ పాండే చర్చలు జరిపారు. ఎన్నికల సహకారం, శిక్షణ, సామర్థ్య నిర్మాణం అంశాలకు సంబంధించి రెండు దేశాలు అవగాహన ఒప్పందంపై సంతకాలు  చేశాయి.దీని ప్రకారం   ఉజ్బెకిస్తాన్ ఎన్నికల అధికారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడానికి భారత ఎన్నికల సంఘం అంగీకరించింది.ఎన్నికల సమయంలో  భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తున్నఎన్నికల సందర్శకుల కార్యక్రమంలో ఉజ్బెకిస్తాన్ దేశానికి చెందిన ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఐటీఈసీ కార్యక్రమం కింద భారత ఎన్నికల సంఘం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 

ఉజ్బెకిస్తాన్ చట్టాల ప్రకారం దేశవ్యాప్త నియోజకవర్గం నుంచి ఏడేళ్ల కాలానికి అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఎన్నికల నిర్వహణ మూడు అంచెల స్థాయిలో జరుగుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం, 14 జిల్లా ఎన్నికల కమీషన్లు, 10,760 ప్రాంతీయ ఎన్నికల కమిషన్ లతో కూడిన మూడు అంచెల  స్థాయిలో ఎన్నికలు నిర్వహిస్తారు. .ఉజ్బెకిస్తాన్‌లో దాదాపు 20 మిలియన్ల ఓటర్లు ఉన్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో గరిష్టంగా 3000 మంది ఓటర్లు ఉంటారు. ఎన్నికల్లో ఓటు వేయడానికి 22 మిలియన్లకు పైగా అర్హత కలిగిన ఓటర్లు పేర్లు  నమోదు చేసుకున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం  ఉజ్బెకిస్తాన్.ఎన్నికల సంఘం  దేశంలో 10,000 పోలింగ్కేంద్రాలు, విదేశాలలో నివసిస్తున్న ఉజ్బెకిస్తాన్ ప్రజల కోసం  విదేశాలలో 55 కేంద్రాలు ఏర్పాటు చేసింది. . ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు  ఆ దేశ చరిత్రలో మైలురాయిగా ఉంటాయని భావిస్తున్నారు.

ఎన్నికల కమిషనర్ డాక్టర్ అనుప్ చంద్ర పాండే నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందంలో  డిప్యూటీ ఎలక్షన్ కమీషనర్‌లు శ్రీ హిర్దేష్ కుమార్ ,శ్రీ ఆర్కే గుప్తా సభ్యులుగా ఉన్నారు. భారత ప్రతినిధి బృందం కూడా 7వ , 14వ జిల్లా ఎన్నికల కమీషన్‌లను సందర్శించి ఎన్నికల నిర్వహణ, విధానాలు, ఉజ్బెకిస్తాన్.ఎన్నికల సంఘం చేసిన ఏర్పాట్లను పరిశీలించింది.  .

 భారత ఎన్నికలపై తాష్కెంట్‌లో ఉన్న ప్రవాస భారతీయ ప్రతినిధులతో డాక్టర్ పాండే సమావేశం అవుతారు.

 

***



(Release ID: 1938362) Visitor Counter : 148