కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ఇంటర్నెట్ శక్తిని తెలిపేలా 'భారత్ ఇంటర్నెట్ ఉత్సవ్'
Posted On:
07 JUL 2023 5:50PM by PIB Hyderabad
అనుసంధానత, జ్ఞానాన్ని పంచుకోవడం, సామాజిక-ఆర్థిక అభివృద్ధికి ఇంటర్నెట్ ఒక అనివార్య సాధనంగా ఉద్భవించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీఓటీ) దేశంలోని వివిధ ప్రాంతాలలో, ముఖ్యంగా రిమోట్ మరియు వాణిజ్య పరంగా లాభసాటిలేని ప్రాంతాలలో పౌరులకు యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యుఎస్ఓఎఫ్) ద్వారా సరసమైన మరియు అధిక-నాణ్యత ఇంటర్నెట్ ఉండేలా అనేక చర్యలు తీసుకుంది. వివిధ విధానపరమైన, నిర్మాణాత్మక మరియు చట్టపరమైన సంస్కరణలు జరిగాయి. దీని ఫలితంగా 2.7 లక్షలకు పైగా 5జీ సైట్లు తొమ్మిది నెలల్లో ఇన్స్టాల్ చేయబడ్డాయి. దాదాపు నిమిషానికి ఒక సైట్ చొప్పున, ఇన్స్టాల్ చేయబడ్డాయి. భారతదేశాన్ని ప్రపంచంలోని మొదటి మూడు 5జీ పర్యావరణ వ్యవస్థలలో ఒకటిగా చేసింది. సరసమైన ఇంటర్నెట్ యాక్సెస్ను ప్రారంభించడం ద్వారా డేటా ధర దాదాపు రూ.10/జీబీకి తగ్గించబడింది. మానవ కథలు, ప్రజలు డిజిటల్ సాంకేతికతను స్వీకరించడానికి, వారి జీవితాల్లో ఇలాంటి పరివర్తనలను కోరుకునేలా ఇతరులను ప్రేరేపించడానికి మరియు శక్తివంతం చేసే శక్తిని కలిగి ఉంటాయి. మన దేశంలోని వివిధ ప్రాంతాలలో నివసిస్తున్న వారి జీవితాలను ఇంటర్నెట్ మెరుగుపరిచిన అద్భుతమైన మార్గాలను ఇటువంటి కథలు మనకు చూపుతాయి. ఇంటర్నెట్ యొక్క పరివర్తనాత్మక పాత్రను స్వీకరించడానికి, డీఓటీ, మై గవ్ (MYGOV) సహకారంతో, “భారత్ ఇంటర్నెట్ ఉత్సవ్”ను జరుపుకుంటుంది. దీనిలో పౌరులు తమ వీడియోలను 2 నిమిషాల వరకు పంచుకోవచ్చు. దీనిలో ఏదైనా సోషల్ మీడియా హ్యాండిల్లలో ఇంటర్నెట్ ప్రజల జీవితాలను ఎలా మార్చింది BharatInternetUtsav లేదా డ్రైవ్ లింక్లో అప్లోడ్ చేయవచ్చు. అదే లింక్ను మై గవ్ (MYGOV) https://innovateindia.mygov.in/bharat-internet-utsav/లో సమర్పించవచ్చు. ఉత్తమ కథలకు రూ. 15,000 వరకు బహుమతులు అందజేయబడతాయి. పోటీ MYGOVలో 07.07.2023 నుండి 21.08.2023 వరకు నిర్వహించబడుతుంది. వేగవంతమైన సమ్మిళిత సామాజిక-ఆర్థిక అభివృద్ధి కోసం ఎప్పుడైనా, ఎక్కడైనా సురక్షితమైన, విశ్వసనీయమైన, సరసమైన మరియు అధిక-నాణ్యత కలిగిన కన్వర్జ్డ్ టెలికమ్యూనికేషన్ సేవలను నిర్ధారించడానికి లెలికాం శాఖ అవిశ్రాంతంగా పనిచేస్తోంది. #భారత్ఇంటర్నెట్ ఉత్సవ్ని అందరం ఏకమై కలిసి జరుపుకుందాం.
******
(Release ID: 1938115)
Visitor Counter : 192