వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2023–24 సంవత్సరానికి రిటైలర్లు, ప్రాసెసర్లు, ట్రేడర్లు గోధుమ, బియ్యం కొనుగోలుకు వీలుగా జూలై 12, 2023. తేదీన 3వ వారపు ఈ – వేలం నిర్వహణ .


మూడవ ఈ –వేలంలో 482 డిపోల నుంచి 4.29 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు, 254 డిపోల నుంచి 3.95 లక్షల టన్నుల బియ్యం విక్రయానికి సిద్ధం.

Posted On: 07 JUL 2023 8:32PM by PIB Hyderabad

బియ్యం, గోధుమలు, గోధుమ పిండి ధరలను మార్కెట్లో తగ్గించేందుకు ప్రభుత్వం జోక్యం చేసుకునే విధానంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వారపు ఈ– వేలం ప్రక్రియ కింద , రిటైలర్లు, ప్రాసెసర్లు, ట్రేడర్లకు
గోధుము, బియ్యాన్ని అమ్మనుంది.  ఈ ఈ–వేలం ను 2023 జూలై 12 వ తేదీన నిర్వహించనున్నారు.  482 డిపోలనుంచి 4.29 లక్షల మెట్రిక్ టన్నుల గోధుము, 254 డిపోల నుంచి 3.95 లక్షల మెట్రిక్
టన్నుల బియ్యంను దేశవ్యాప్తంగా గల వివిధ డిపోలనుంచి వేలానికి పెట్టనున్నారు.


ఇందుకు సంబంధించిన టెండర్ నోటీసులను ఎం జంక్షన్ సర్వీసెస్ లిమిటెడ్ వెబ్ సైట్ https://www.valuejunction.in/fci/లో అప్లోడ్ చేశారు. ఆసక్తిగల పార్టీలు తమ పేర్లను నమోదు చేసుకుని ఇకముందు జరగబోయే ఈ వేలంలలో పాల్గొనవచ్చు.
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా –ఎఫ్.సి.ఐ  చిన్న, మధ్యతరహా వాడకందారులను వారపు ఈ –వేలంలలో పాల్గొనేందుకు ప్రోత్సహిస్తోంది. దీనివల్ల ప్రభుత్వం విడుదలచేసే నిల్వలు సమాజంలో విస్తృత ప్రజానీకానికి చేరడానికి వీలు కలుగుతుంది.
2023 జూలై 5 వ తేదీన నిర్వహించిన ఈ వేలం లో మొత్తం 4.07 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను 526 డిపోల నుంచి, 3.88 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎఫ్.సి.ఐకి చెందిన 23 రీజియన్లలోని 251
డిపోల నుంచి అమ్మకానికి పెట్టారు. 1.29 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను 1337 మంది వేలం పాటదారులకు విక్రయించగా, 170 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని వేలం ద్వారా 5 గురికి  విక్రయించారు.
ఎఫ్.ఎ.క్యు గోధుమలకు  భారిత సగటు విక్రయ ధర క్వింటాలుకు రూ  య2154 కాగా రిజర్వు ధర దేశవ్యాప్ంతగా క్వింటాలుకు  రూ 2150. అలాగే యుఆర్ఎస్ గోధుమలకు భారిత సగటు విక్రయధర క్వింటాలుకు రూ 2132.40 గా ఉంది. రిజర్వుధర  క్వింటాలుకు రూ 2125.

భారిత సగటు విక్రయధర బియ్యానికి క్వింటాలుకు రూ 3175.35 గా ఉండగా, రిజర్వు ధర దేశవ్యాప్తంగా రూ 3173 గా ఉంది.
బిడ్డర్లు తమ వద్ద ఉన్న స్టాక్ కు సంబంధించిన వివరాలను భారత ప్రభుత్వానికి చెందిన గోధుమల స్టాక్ నిర్వహణ పోర్టల్ లో తప్పనిసరిగా పొందుపరచాలి. అలా పొందుపరచిన వారినే  గోధుమల ఈ వేలంలో పాల్గొనేందుకు అనుమతిస్తారు.
ప్రస్తుత ఈ వేలం  ప్రక్రియలో , రిటైల్ ధర తగ్గింపును గరిష్ఠంగా ఒక కొనుగోలు దారుకు వంద టన్నుల వరకు అనుమతించనున్నారు.
చిన్న, మధ్యతరహా వేలం దారులైన కొనుగోలు దారులను ప్రోత్సహించేందుకు, వేలంలో ఎక్కువ మంది పాల్గొనేలా చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా ఎక్కువ మంది తాము ఎంపిక చేసుకున్న డిపో నుంచి
వేలంలో పాల్గొనడానికి వీలు ఉంటుంది.

***


(Release ID: 1938113) Visitor Counter : 162


Read this release in: English , Urdu , Hindi