జౌళి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పీఎల్‌ఐ పథకం దరఖాస్తుదార్లతో మాట్లాడేందుకు మొదటి 'వీక్లీ ఓపెన్ హౌస్ ఫోరం' నిర్వహించిన భారత జౌళి మంత్రిత్వ శాఖ


ప్రతి శుక్రవారం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు వీక్లీ ఓపెన్ హౌస్ ఫోరం నిర్వహించనున్న మంత్రిత్వ శాఖ

నాడు పోస్టు చేయడమైనది: 07 JUL 2023 7:48PM by PIB Hyderabad

భారత జౌళి మంత్రిత్వ శాఖ, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మొదటి 'వీక్లీ ఓపెన్ హౌస్ ఫోరం'ను ఇవాళ నిర్వహించింది. 'వస్త్ర పరిశ్రమ కోసం ఉత్పత్తి అనుసంధానిత రాయితీ (పీఎల్‌ఐ)' పథకం అందుకుంటున్న సంస్థల ప్రతినిధులతో మాట్లాడింది. పథకం అమల్లో ఏవైనా సమస్యలు ఉంటే తెలుసుకోవడానికి, పరిష్కరించడానికి ఈ కార్యక్రమం నిర్వహించింది. వీక్లీ ఓపెన్ హౌస్ ఫోరంను ఇకపై ప్రతి శుక్రవారం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన వెబ్ లింకును, పీఎల్‌ఐ పథకంలో పాల్గొంటున్న అన్ని సంస్థలకు ప్రతి గురువారం సాయంత్రం పంపుతారు.

లక్ష్యిత పెట్టుబడిని వేగవంతం చేయడానికి, ఉత్పత్తిని ప్రారంభించడానికి, ప్రోత్సాహకాలు అందుకోవడానికి సకాలంలో టర్నోవర్‌ సాధించేలా చేయడానికి సంబంధిత సంస్థలకు వీక్లీ ఓపెన్ హౌస్ ఫోరం సాయపడుతుంది.

 

***


(రిలీజ్ ఐడి: 1938112) సందర్శకుల సూచీ సంఖ్య : : 176
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी