మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2021-22 సంవత్సరానికి సంబంధించి రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల పనితీరు గ్రేడింగ్ ఇండెక్స్ 2.0 నివేదిక విడుదలచేసిన విద్యా మంత్రిత్వ శాఖ ఏకరీతిలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పనితీరు బేరీజు వేసిన విద్యా మంత్రిత్వ శాఖ

Posted On: 07 JUL 2023 4:49PM by PIB Hyderabad

దాదాపు 14.9 లక్షల పాఠశాలలు, 95 లక్షల మంది ఉపాధ్యాయులు విభిన్న సామాజిక-ఆర్థిక 

నేపథ్యం నుంచి వచ్చిన దాదాపు 26.5 కోట్ల మంది విద్యార్థులు కలిగి ఉన్న భారతీయ విద్యా వ్యవస్థ ప్రపంచంలోనే అతి పెద్ద విద్యా వ్యవస్థగా గుర్తింపు పొందింది. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో పాఠశాల విద్య పనితీరును . పాఠశాల విద్య ,అక్షరాస్యత విభాగం, విద్యా మంత్రిత్వ శాఖ మదింపు వేస్తున్నాయి. దీనికోసం  పనితీరు గ్రేడింగ్ ఇండెక్స్ (పిజిఐ)ను ప్రభుత్వం రూపొందించింది,రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో పాఠశాల విద్య  పనితీరును పిజిఐ విశ్లేషించి  విద్యా వ్యవస్థ పనితీరును అంచనా వేస్తుంది.  మొట్టమొదటి సారిగా పిజిఐ 2017-18 సంవత్సరంలో ఆయ్యింది.  2020-21 సంవత్సరం వరకు పిజిఐ నివేదికలు విడుదలఅయ్యాయి. 

పిజిఐ కోసం నిర్దేశించిన  అనేక సూచికలు పరిస్థితికి అనుగుణంగా లేవని గుర్తించారు. అంతేకాకుండా నాణ్యతా ప్రమాణాలకు కాకుండా పరిపాలన అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ  పిజిఐ నివేదికలు రూపొందాయి.  పిజిఐ ని మరింత పటిష్టంగా, సమర్థంగా అమలు చేయడానికి, జాతీయ విద్యా విధానం 2020 లక్ష్యాలు సాధించడానికి, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించడానికి గతంలో రూపొందించిన సూచికలను సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్పులు  చేర్పులు చేసిన తర్వాత  పిజిఐ ని  పిజిఐ 2.0గా అమలు ప్రభుత్వం నిర్ణయించింది.  పీజీఐ నివేదిక సిద్ధం చేయడానికి అవసరమైన సమాచారాన్ని యూడీఐఎస్ఈ + నుంచి తీసుకుని, జిల్లా ప్రాతిపదికన గ్రేడ్‌లు ఇవ్వడం జరిగింది. 

73 సూచికలు ఆధారంగా   పీజీఐ నివేదిక సిద్ధమైంది. డిజిటల్ కార్యక్రమాలు  ఉపాధ్యాయ విద్యతో పాటు గుణాత్మక అంచనాపై  పీజీఐ  ప్రాధాన్యత ఇచ్చింది. తాజా  పీజీఐ నివేదికలో పొందుపరిచిన వివరాలను మునుపటి  పీజీఐ ఇచ్చిన  గ్రేడ్‌లు/స్థాయిలతో పోల్చదగినవి కావు.

73 సూచికల ఆధారంగా రూపొందించిన  పీజీఐ 1000 మార్కులు కలిగి ఉంటుంది. సూచికలను తుది  ఫలితాలు, పరిపాలన వ్యవస్థ తరగతులుగా  విభజించారు. రెండు తరగతులను తిరిగి  6 రంగాలుగా విభజించారు.  తుది సాధన ఫలితాలు, అందుబాటు, మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు, సమానత్వం, పరిపాలన విధానం ఉపాధ్యాయులకు  శిక్షణ అంశాల ప్రాతిపదికన పీజీఐ సిద్దమయ్యింది. 

2021-22 సంవత్సరం కోసం  నిర్వహించిన  పీజీఐ 2.0  లో   రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలను పది గ్రేడ్‌లుగా వర్గీకరించారు.  అత్యధికంగా సాధించగల గ్రేడ్ దక్ష,  మొత్తం 1000 పాయింట్లలలో 940 పాయింట్లు కంటే ఎక్కువ సాధించే రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు గ్రేడ్ దక్ష లో చేరుస్తారు.  . అత్యల్ప గ్రేడ్ ఆకాంక్షి i-3. గరిష్టంగా 460 పాయింట్లు పొందే రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ఆకాంక్షి i-3 లో ఉంటాయి. సమున్నత విద్యా విధానం అమలు చేసేలా చూసేందుకు అన్ని మార్గాలు, కోణాలను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు అనుసరించేలా చేయాలన్న లక్ష్యంతో పీజీఐ 2.0  అమలు జరుగుతుంది. జాతీయ విద్యా విధానం అమలు లోకి వచ్చిన తర్వాత అందిన అభిప్రాయాలు, విద్యా విధానం అమలు జరుగుతున్న తీరును పరిశీలించిన తర్వాత  పీజీఐ 2.0  లో పొందుపరిచిన సూచికలు విధాన కార్యక్రమాలు సిద్ధం అయ్యాయి. విద్య వ్యవస్థ అమలులో రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పీజీఐ 2.0   సహాయపడుతుంది.  తదనుగుణంగా పాఠశాల విద్యా వ్యవస్థ ప్రతి స్థాయిలో పటిష్టంగా అమలు జరిగేలా చూసేందుకు అవసరమైన చర్యలను రూపొందించేందుకు పీజీఐ 2.0 ఉపయోగపడుతుంది.  

 

2021-22 పీజీఐ 2.0    నివేదికను https://www.education.gov.in/statistics-new?shs_term_node_tid_depth=391&Apply=Applyలో చూడవచ్చు. 

 

***


(Release ID: 1938073) Visitor Counter : 218


Read this release in: Tamil , English , Urdu , Hindi