మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
జీవవైవిధ్య పరిరక్షణ కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశం ప్రత్యేకమైన సంపూర్ణ విధానాన్ని రూపొందించి అమలు చేస్తోంది... శ్రీ భూపేందర్ యాదవ్
ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యానికి ప్రాధాన్యతనిస్తూ ఇటీవల ప్రారంభించిన గ్రీన్ క్రెడిట్ విధానంలో పరిశ్రమలు చురుగ్గా పాల్గొని సహకరించాలి.. శ్రీ యాదవ్ పిలుపు
प्रविष्टि तिथि:
06 JUL 2023 8:47PM by PIB Hyderabad
జీవవైవిధ్య పరిరక్షణ కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశం ప్రత్యేకమైన సంపూర్ణ విధానాన్ని రూపొందించి అమలు చేస్తున్నదని కేంద్ర పర్యావరణ, అటవీ వాతావరణ మార్పు, కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి. శ్రీ భూపేందర్ యాదవ్ తెలిపారు.
ఈరోజు గుజరాత్‌లోని ద్వారక రుక్మిణి దేవాలయం దగ్గర జరిగిన హర్యలీ మహోత్సవ్‌లో మంత్రి పాల్గొన్నారు. పర్యావరణం, పర్యావరణంపై ఆధారపడి జీవిస్తున్న జీవరాసుల మధ్య సమతుల్యత అవసరమని శ్రీ యాదవ్ అన్నారు. జీవ వైవిధ్య పరిరక్షణ ప్రాధాన్యతను ప్రపంచ దేశాల దృష్టికి తీసుకుని వెళ్ళడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం మిషన్ లైఫ్ ప్రాజెక్టు ను ప్రారంభించిందన్నారు.
పర్యావరణ వ్యవస్థ ఆహార గొలుసును పరిరక్షణ, వేటాడి జీవించే వన్య ప్రాణుల సంరక్షణ కోసం పర్యావరణ సమతుల్యత పాటించాలని శ్రీ భూపేందర్ యాదవ్ అన్నారు. దీనికోసం ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్ట్ డాల్ఫిన్ , ప్రాజెక్ట్ లయన్ ప్రాముఖ్యతను ఆయన వివరించారు. సముద్ర పర్యావరణ వ్యవస్థ పరిరక్షణ అంశంలో మడ అడవుల పర్యావరణ వ్యవస్థలు,డాల్ఫిన్ కీలకంగా ఉంటాయన్నారు.
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమంలో పాల్గోవాలని సంబంధిత వర్గాలకు మంత్రి పిలుపు ఇచ్చారు. ఇటీవల ప్రభుత్వం ప్రారంభించిన గ్రీన్ క్రెడిట్ సిస్టమ్‌కు పరిశ్రమలు చురుకుగా సహకరించాలని శ్రీ యాదవ్ పిలుపునిచ్చారు. కర్బన ఉద్గారాలు తగ్గించడం, పచ్చదనం అభివృద్ధి కార్యక్రమంలో పరిశ్రమలు పాల్గొని సహకారం అందించాలని ఆయన కోరారు.పర్యావరణ పరిరక్షణలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం సమర్థవంతమైన సాధనమని ఆయన అన్నారు. మడ అడవుల పరిరక్షణకు పీపీపీ విధానంలో గుజరాత్ సాధించిన అభివృద్ధి పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. గుర్తించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అయితే, ఇప్పటికే శిథిలావస్థలో ఉన్న చారిత్రక మడ ప్రాంతాలను గుర్తించి పునరుద్ధరించేందుకు కృషి చేయాల్సి ఉందని ఆయన తెలిపారు.
మడ అడవుల విస్తీర్ణాన్ని 30% పెంచడడానికి జరుగుతున్న కార్యక్రమాలకు సహకరించాలని శ్రీ భూపేందర్ యాదవ్ కోరారు.మడ అడవుల సంరక్షణలో స్వయం సహాయక బృందాల సహకారంతో మడ మొక్కల పెంపకం చేపట్టడం,, జీవనోపాధి కల్పించడం, , పర్యావరణ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం, అమలు చేస్తున్న కార్యక్రమాలకు ప్రచారం కల్పించడం ద్వారా లక్ష్య సాధనకు కృషి జరగాలని మంత్రి సూచించారు.
మడ అడవుల పరిరక్షణ కోసం ఇటీవల ప్రారంభించిన మిషితి కార్యక్రమం వివరాలు వివరించిన మంత్రి భారతదేశం మడ అడవుల కూటమిలో సభ్యత్వం కలిగివుందని తెలిపారు. భారతదేశంలో గుర్తించిన 500 రకాల మడ అడవుల వివరాలతో బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒక నివేదిక ప్రచురించిందని మంత్రి తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు మొక్కలు నాటి మడ మొక్కల పెంపకం ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో భాగంగా అటవీ శాఖ, ఎంపిక చేసిన ప్రముఖ కంపెనీల మధ్య మిషితి (మంగ్రోవ్ ఇనిషియేటివ్ ఫర్ ది షోర్‌లైన్ హాబిటాట్ మరియు టాంజిబుల్ ఇన్‌కమ్) కింద అవగాహన ఒప్పందాలు కూడా జరిగాయి. మడ అడవుల సంరక్షణ, పరిరక్షణ కోసం విశేష కృషి చేసిన ‘వారిని కార్యక్రమంలో సత్కరించారు.
కార్యక్రమంలో గుజరాత్ ప్రభుత్వ పర్యాటక, సాంస్కృతిక కార్యకలాపాలు, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి శ్రీ ములుభాయ్ బేరా, జామ్‌నగర్ పార్లమెంట్ సభ్యుల సుశ్రీ పూనంబెన్ మేడమ్, ద్వారక పార్లమెంట్ సభ్యులు శ్రీ ఉదయ్ కంగధ్, రాజ్‌కోట్ శాసనసభ సభ్యుడు శ్రీ చంద్ర పాల్గొన్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్స్ శ్రీ ప్రకాష్ గోయల్, గుజరాత్ ప్రభుత్వ ఉన్నతాధికారులు శ్రీ ఎస్.కె. చతుర్వేది, శ్రీ యు.డి. . సింగ్ కేంద్ర ప్రభుత్వం, గుజరాత్ ప్రభుత్వం అటవీశాఖ ఉన్నతాధికారులు, ఎన్ సిసి , స్కౌట్స్; శారదాపీఠం నుండి పండితులు , ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ, ఇండియన్ కాస్ట్ గార్డ్ ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(रिलीज़ आईडी: 1937863)
आगंतुक पटल : 244