వ్యవసాయ మంత్రిత్వ శాఖ

జాతీయ ప్రాముఖ్యత వేదిక మార్కెట్ యార్డ్‌పై నిపుణుల కమిటీ నివేదిక

Posted On: 05 JUL 2023 2:32PM by PIB Hyderabad

వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీలను (ఏపిఎంసిలు) బలోపేతం చేసే ఆలోచనలకు భారత ప్రభుత్వం  ఎల్లప్పుడూ మద్దతు ఇస్తోంది. అలాగే రైతులకు అందించే మౌలిక సదుపాయాలు మరియు సేవలను మెరుగుపరచడం ద్వారా కొత్త ఎడ్జ్ డిజిటల్ టెక్నాలజీల రాకతో వాటిని మరింత పారదర్శకంగా మరియు పోటీగా మార్చడానికి ప్రయత్నిస్తోంది.

 
ఏప్రిల్ 2016లో ఇ-నామ్ (నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్) ప్రారంభించబడినప్పటి నుండి చాలా అభివృద్ధి జరిగింది. ఇప్పటివరకు, 23 రాష్ట్రాలు మరియు 04 కేంద్రపాలితప్రాంతాల్లోని 1361 మార్కెట్‌లు ఇ-నామ్‌ ప్లాట్‌ఫారమ్‌కు అనుసంధానించబడ్డాయి. 03 జూలై 2023 నాటికి 1.75 కోట్ల మంది రైతులు మరియు 2.45 లక్షల మంది వ్యాపారులు ఇ-నామ్‌ పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు. అలాగే 7.97 కోట్ల మెట్రిక్ టన్నుల & 25.82 కోట్ల సంఖ్యలు (వెదురు, తమలపాకులు, కొబ్బరి, నిమ్మ & స్వీట్ కార్న్) మొత్తం విలువ సుమారు రూ.2.79 లక్షల కోట్ల వ్యాపారం ఇ-నామ్ ప్లాట్‌ఫారమ్‌లో నమోదైంది.
 
ఇ-నామ్ సాధన వ్యవసాయ మార్కెటింగ్ రంగంలో మార్గనిర్దేశం చేసింది. 1361 నియంత్రిత మార్కెట్లు ఇ-నామ్ ప్లాట్‌ఫారమ్‌లో భాగమయింది. వివిధ మార్కెట్ల మధ్య పోటీతో రైతలు మంచి ధరను పొందేందుకు మరియు మరీ ముఖ్యంగా అంతర్ రాష్ట్ర వాణిజ్యంలో ఇ-నామ్‌ చాలా అవసరం అని భావించబడింది. అంతర్ మార్కెట్లు మరియు అంతర్-రాష్ట్ర వాణిజ్యం కోసం పారదర్శక ధరలను కనుగొనే విధానంతో నాణ్యత ఆధారిత వ్యాపారాన్ని ప్రోత్సహించడం ద్వారా భారతదేశం అంతటా సమర్థవంతమైన మరియు అవాంతరాలు లేని మార్కెటింగ్ వ్యవస్థ ద్వారా రైతుల మిగులు ఉత్పత్తులకు పెద్ద పరిధిని సృష్టించడానికి మరింత సమిష్టి జోక్యం అవసరం.
 
విధాన సంస్కరణల దశను తదుపరి స్థాయికి తీసుకువెళ్లడం మరియు తుది వినియోగదారు ధరలో ఉత్పత్తిదారుల వాటాను పెంపొందించే లక్ష్యంతో భారత ప్రభుత్వం 21 ఏప్రిల్ 2023న ఇంటర్-మండిని ప్రోత్సహించడానికి ఒక ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. మార్కెట్ యార్డ్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ (ఎంఎన్‌ఐ)  భావన  అమలు ద్వారా అంతర్ రాష్ట్ర వాణిజ్యం ఈ నిపుణుల కమిటీకి ఉత్తరప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, తెలంగాణ, ఒడిశా & బీహార్ రాష్ట్రాల అగ్రి మార్కెటింగ్ బోర్డుల సభ్యులతో కర్ణాటక ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి (వ్యవసాయం) డాక్టర్ మనోజ్ రాజన్ అధ్యక్షత వహించారు. రాష్ట్ర ప్రతినిధితో పాటు, డైరెక్టర్ (వ్యవసాయ మార్కెటింగ్),డిఏ&ఎఫ్‌డబ్ల్యూ, భారతప్రభుత్వం, డిప్యూటీ ఏఎంఏ,డిఎంఐ,ఎస్‌ఎఫ్‌ఏసి నుండి ప్రతినిధిలతో పాటు ఇ-నామ్‌ కోసం వ్యూహాత్మక భాగస్వామి కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.ఎంఎన్‌ఐ అమలు కోసం ఫ్రేమ్‌వర్క్‌ను సిఫార్సు చేసే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించారు.
 
4 జూలై, 2023న నిపుణుల కమిటీ చైర్‌పర్సన్ ఎంఎన్‌ఐ ప్లాట్‌ఫారమ్‌పై నిపుణుల కమిటీ నివేదికను సమర్పించారు.ఎంఎన్‌ఐ-పి ప్లాట్‌ఫారమ్, లీగల్ ఫ్రేమ్‌వర్క్ & ఇంటర్-స్టేట్ రెసిప్రోసిటీ ఆఫ్ లైసెన్స్ మరియు మూవ్‌మెంట్, వివాద పరిష్కార విధానం, రోల్‌అవుట్ స్ట్రాటజీ మొదలైన వాటి అమలు ఫ్రేమ్‌వర్క్‌ను పైన పేర్కొన్న కమిటీ సిఫార్సు చేసింది. ఈ ప్లాట్‌ఫారమ్ పాల్గొనే రాష్ట్రాల రైతులకు తమ మిగులు ఉత్పత్తులను తమ రాష్ట్ర సరిహద్దులు దాటి విక్రయించడానికి అవకాశం కల్పిస్తుంది.ఈ ప్లాట్‌ఫారమ్ వ్యవసాయ విలువ గొలుసులోని వివిధ విభాగాల నైపుణ్యాన్ని ప్రభావితం చేసే డిజిటల్ పర్యావరణ వ్యవస్థలను రూపొందించడానికి వీలు కల్పిస్తుంది.

****



(Release ID: 1937631) Visitor Counter : 132


Read this release in: Marathi , English , Urdu , Hindi