శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

విభేదాలకు అతీతంగా ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించాలని, ప్రపంచ శ్రేయస్సు కోసం ఒకే కుటుంబం స్ఫూర్తితో బాధ్యతతో వ్యవహరించాలని జీ20 సభ్య దేశాలను కోరిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


ముంబైలో జరిగిన జి 20 రీసెర్చ్ మినిస్టర్స్ సమావేశంలో ప్రారంభోపన్యాసం చేసిన డాక్టర్ జితేంద్ర సింగ్; ప్రస్తుత కాల సంక్లిష్ట సవాళ్లను పరిష్కరించడంలో ప్రపంచ సహకారం విజ్ఞాన భాగస్వామ్యం ప్రాముఖ్యతను భారతదేశం గుర్తించింది; ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి అంతర్జాతీయ వేదికపై ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని పదేపదే పునరుద్ఘాటిస్తున్నారు; .

భారతదేశ జి 20 అధ్యక్ష పదవీకాలంలో, మెరుగైన భవిష్యత్తు కోసం ప్రపంచ పరిశోధన , ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లడానికి మేము కట్టుబడి ఉన్నాము: డాక్టర్ జితేంద్ర సింగ్

పరిశుభ్రమైన ఇంధన వనరుల వైపు మారేందుకు , స్మార్ట్ గ్రిడ్లు, ఇంధన సామర్థ్యం కలిగిన భవనాలు , సుస్థిరమైన రవాణా వ్యవస్థలు వంటి పర్యావరణ ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి జి 20 దేశాలు సాంకేతికత , ఆవిష్కరణల సామర్థ్యాన్ని ఉపయోగించాలి.

తుఫాను, సునామీ, కొండచరియలు విరిగిపడటం, అడవుల్లో మంటలు వంటి వివిధ ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయడానికి , పర్యవేక్షించడానికి జి -20 సమాజం సాంకేతిక పరిజ్ఞానాన్ని జి -20 దేశాల వెలుపల కూడా పంచుకోవాలి; తద్వారా వారు ఇటువంటి విపత్తుల నుండి తమను తాము మెరుగ్గా సిద్ధం చేసుకోవచ్చు: డాక్టర్ జితేంద్

Posted On: 05 JUL 2023 12:48PM by PIB Hyderabad

విభేదాలకు అతీతంగా ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించాలని, ప్రపంచ శ్రేయస్సు కోసం  ఒకే కుటుంబం స్ఫూర్తితో బాధ్యతతో వ్యవహరించాలని జీ20 సభ్య దేశాలకు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) పీఎంవో, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ, స్పేస్ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపు ఇచ్చారు.

 

జి 20 సైన్స్ మంత్రుల సమావేశంలో డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభోపన్యాసం చేస్తూ, ప్రస్తుత కాల సంక్లిష్ట సవాళ్లను పరిష్కరించడంలో ప్రపంచ సహకారం విజ్ఞాన భాగస్వామ్యం ప్రాముఖ్యతను భారతదేశం గుర్తించిందని, ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి అంతర్జాతీయ వేదికపై ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని పదేపదే పునరుద్ఘాటిస్తున్నారని తెలిపారు.

సృజనాత్మక సంస్కృతిని పెంపొందించడానికి, సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించడానికి , అందరికీ సుసంపన్నమైన భవిష్యత్తును నిర్ధారించడానికి సమిష్టి విజ్ఞానం, నైపుణ్యం ,వనరులను ఉపయోగించుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. సమ్మిళిత, సమాన, సుస్థిర వృద్ధిలో రాణించడానికి లోతైన ఎజెండాతో ముందుకు సాగాలని జి 20 దేశాలను మంత్రి కోరారు.

 

అనేక సభ్య దేశాలు తమ జాతీయ సైన్స్ శ్రేణిలో అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తున్నాయనే వాస్తవాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్  ప్రస్తావిస్తూ, కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో మనం ఇటీవల చేసినట్లుగా, ఈ సమూహం ప్రధాన ప్రపంచ సవాళ్లను పరిష్కరించే సామర్థ్యాన్ని కలిగి  ఉందని అన్నారు.

భారత్ జీ-20 అధ్యక్ష కాలం లో మెరుగైన రేపటి కోసం ప్రపంచ పరిశోధనలు, ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన ఉద్ఘాటించారు.

 

ఇటీవలి కాలంలో, శాస్త్రవేత్తలు , పరిశోధకులు అంతరిక్ష అన్వేషణ నుండి కృత్రిమ మేధస్సు వరకు, బయోటెక్నాలజీ నుండి నానోటెక్నాలజీ వరకు అనేక విభాగాలలో అత్యాధునిక ఆవిష్కరణలు,  పురోగతిలో ముందంజలో ఉన్నారని, శాస్త్రీయ అవగాహన సరిహద్దులను అధిగమించారని, మొత్తం మానవాళికి ప్రయోజనం చేకూర్చే ఆవిష్కరణలను ప్రోత్సహించారని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

 

వాతావరణ మార్పులు, క్షీణిస్తున్న సహజ వనరుల సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటున్నందున, పునరుత్పాదక ఇంధన వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం అనివార్య మయిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. జి-20 సభ్యదేశాలు మన నెట్ జీరో లక్ష్యాలకు కట్టుబడి ఉండాలని, సుస్థిర అభివృద్ధి, పునరుత్పాదక ఇంధనంపై పనిచేయడం కొనసాగించాలని అన్నారు. ఇటీవలి సంవత్సరాల్లో సౌర, పవన విద్యుత్ వ్యవస్థాపనల్లో ప్రపంచం గణనీయమైన వృద్ధిని సాధించడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగల పదార్థాలను కనుగొని, సృష్టించడానికి మన శాస్త్రవేత్తలు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని, దీనిని పరిశుభ్రంగా, మరింత చౌకగా, అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు.

 

పరిశుభ్రమైన ఇంధన వనరుల వైపు మారేందుకు , స్మార్ట్ గ్రిడ్లు, ఇంధన సామర్థ్యం కలిగిన  భవనాలు , సుస్థిరమైన రవాణా వ్యవస్థలు వంటి పర్యావరణ ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి జి 20 దేశాలు సాంకేతికత , ఆవిష్కరణల సామర్థ్యాన్ని ఉపయోగించాలని డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాలు పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడమే కాకుండా ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తాయని,  ఉద్యోగాల సృష్టికి కొత్త మార్గాలను

సృష్టిస్తాయని ఆయన పేర్కొన్నారు.

 

తుఫాను, సునామీ, కొండచరియలు విరిగిపడటం, అడవి మంటలు, అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం వంటి వివిధ ప్రకృతి విపత్తులను అంచనా వేయడానికి, పర్యవేక్షించడానికి జి -20 దేశాలు అధునాతన అంతరిక్ష సాంకేతికతలను కలిగి ఉన్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఈ సాంకేతిక పరిజ్ఞాన ఉత్పత్తులను జి -20 దేశాలు తమ

వెలుపలి దేశాలతో కూడా పంచుకోవాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు. తద్వారా వారు ఇటువంటి విపత్తుల నుండి తమను తాము మెరుగ్గా సిద్ధం చేసుకోవచ్చని అన్నారు. .

 

క్వాంటమ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం, క్వాంటమ్ కమ్యూనికేషన్, క్రిప్టోగ్రఫీ , క్వాంటమ్ అల్గారిథమ్ లను అన్వేషించడం జి -20 పరిశోధన ఎజెండా తదుపరి స్థాయి అని భారత సైన్స్ మంత్రి ప్రతినిధులకు చెప్పారు. క్వాంటమ్ టెక్నాలజీ ఆధారిత ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడానికి, సుస్థిర అభివృద్ధికి తోడ్పడే ప్రముఖ దేశంగా అనేక ఆర్థిక వ్యవస్థలను తీర్చిదిద్దడానికి శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన - అభివృద్ధిని పెంచాలని మనం లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు.

 

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, శాస్త్రవేత్తలు జన్యు పరిశోధన , బయోటెక్నాలజీకి గణనీయమైన సహకారం అందించారని, పరిశోధకులు వ్యాధుల జన్యు ఆధారాన్ని అధ్యయనం చేయడం, వ్యక్తిగతీకరించిన వైద్య విధానాలను అభివృద్ధి చేయడం, జన్యు ఇంజనీరింగ్ పద్ధతులను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించారని అన్నారు.

 

ఆరోగ్య సంరక్షణ ఫలితాలను మెరుగుపరచడానికి , జన్యుపరమైన రుగ్మతలను పరిష్కరించడానికి ఈ ప్రయత్నాలు అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని ఆయన అన్నారు. రోగనిరోధక శక్తి మన ఆరోగ్యం , ఆహారంతో నేరుగా ముడిపడి ఉన్నందున, మందులకు బదులుగా మనం తినే ఆహారం ద్వారా రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి అనేక వ్యవస్థలు మనలను ప్రోత్సహిస్తాయని మంత్రి అన్నారు.

 

ప్రపంచంలో ఫిన్ టెక్ ఎకోసిస్టమ్స్ విపరీతంగా పెరిగాయని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. కొన్ని ఆర్థిక వ్యవస్థలు వర్చువల్ కరెన్సీలను అవలంబించగా, మరికొన్ని దేశాలు పెద్ద ఎత్తున వర్చువల్ లావాదేవీలను ఉపయోగిస్తున్నాయి.

ప్రపంచం వేగవంతమైన డిజిటల్ మార్పును చూస్తున్నందున, సైబర్-భద్రత కీలక దృష్టిగా మారిందని, హ్యాకర్లకు విచ్ఛిన్నం చేయడం కష్టమైన అల్గారిథమ్ లను అభివృద్ధి చేయాలని శాస్త్రీయ సమాజానికి మంత్రి పిలుపునిచ్చారు.

సైబర్ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, కీలకమైన డిజిటల్ ఆస్తులు, డేటాను రక్షించడానికి అధునాతన వ్యవస్థలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

 

ఈ పరీక్షా సమయాల్లో, ప్రపంచంలో అనేక టెక్నాలజీ ఆధారిత స్టార్టప్ లు కూడా పెరిగాయని, ఆరోగ్య సంరక్షణ, ఫైనాన్స్, వ్యవసాయం , విద్యతో సహా వివిధ రంగాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో ఈ కంపెనీలు రాణించాయని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. నిర్ణయం తీసుకునే ప్రక్రియలను మెరుగు పరచడానికి, ఉత్పాదకతను పెంచడానికి , వివిధ పరిశ్రమలలో సృజనాత్మకతను ప్రోత్సహించడానికి కృత్రిమ మేధ, డేటా అనలిటిక్స్ అనుసంధానం సహాయపడిందని ఆయన అన్నారు.

 

ఖనిజ వనరులు, ఇంధన పరిష్కారాలు,  సముద్ర ఆహారం పరంగా మన మహాసముద్రాలు , సముద్రాల అపారమైన సామర్ధ్యం గురించి డాక్టర్ జితేంద్ర సింగ్ జి 20 ప్రతినిధుల దృష్టికి తీసుకువచ్చారు. చేపలను పెంపకం, సముద్ర పరిశోధన, తీరప్రాంత పర్యాటకం పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడానికి అందరూ కట్టుబడి ఉన్నారని చెప్పారు.

బ్లూ ఎకానమీ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం ద్వారా, ఆర్థిక అభివృద్ధిని సుస్థిరమైన , బాధ్యతాయుతమైన రీతిలో నడిపిస్తూ మన మహాసముద్రాల సంపదను పరిరక్షించి వచ్చని ఆయన అన్నారు.

‘మన మహాసముద్రాలలో పెరిగిన ప్లాస్టిక్ లు, మైక్రోప్లాస్టిక్స్ గురించి కూడా మనం ఆందోళన చెందుతున్నాము, అనేక సముద్ర జీవులు వాటిని తింటాయి. అవి ఇది మన ఆహార గొలుసులోకి ప్రవేశించినప్పుడు చూపే ప్రభావం మనం దృష్టి పెట్టాల్సిన మరొక ముఖ్యమైన అంశం‘ అన్నారు.

 

జీ20 సభ్యదేశాల్లో కొందరు నీటి ఎద్దడి, నీటి నాణ్యత సవాళ్లను ఎదుర్కొంటుండగా, మరికొందరు ఆ దిశగా అడుగులు వేస్తున్నారని జితేంద్ర సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. కచ్చితమైన నీటి పారుదల, నీటి శుద్ధి వ్యవస్థలు, డీశాలినేషన్ పద్ధతులు, మురుగునీటి శుద్ధి సాంకేతిక పరిజ్ఞానం వంటి వినూత్న స్వచ్ఛమైన నీటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత పెంచి అమలు చేయాలన్నారు.

 

మరింత సుస్థిర భవిష్యత్తు దిశగా మనం పయనిస్తున్నప్పుడు, వ్యర్థాల ఉత్పత్తిని తగ్గించే , వనరుల సామర్థ్యాన్ని పెంచే వినూత్న విధానాలను అన్వేషించడం చాలా ముఖ్యమని మంత్రి అన్నారు.

వ్యర్థాలను తగ్గించడం, విలువైన వస్తువులను రీసైక్లింగ్ చేయడం ,ఆర్థిక వృద్ధికి స్థిరమైన , పునరుత్పత్తి విధానాన్ని ప్రోత్సహించడంపై దృష్టి సారించే బయో రంగంలో సర్క్యులర్ ఎకానమీ సూత్రాలను అవలంబించడం ప్రాముఖ్యతను గుర్తించామని ఆయన తెలిపారు.

సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను (ఎస్ డీజీ) సాధించే దిశగా పురోగతిని ముందుకు తీసుకెళ్లే యాక్సిలరేటర్లుగా లైఫ్ స్టైల్ ఫర్ ది ఎన్విరాన్ మెంట్ (ఎల్ఐఎఫ్ఇ) ను స్వీకరించడంలో పరిశోధన, ఆవిష్కరణల పాత్రను కూడా తాము గుర్తిస్తున్నామని, వాటిని ప్రోత్సహించే చర్యలకు మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు.

 

జి 20 రీసెర్చ్ మినిస్టర్స్ మీటింగ్ లో డాక్టర్ జితేంద్ర సింగ్ తన ముగింపు ప్రసంగంలో, ఆర్ ఐఐజి సమావేశాలలో, సభ్య దేశాలు ఇంధన పదార్థాలు , పరికరాలకు సంబంధించిన సవాళ్లు, సౌర శక్తి వినియోగం , ఫోటోవోల్టాయిక్ టెక్నాలజీ,  గ్రీన్ ఎనర్జీ కోసం మెటీరియల్స్ ,

ప్రక్రియలు;  కొత్త వనరుల- సమర్థవంత మైన, సుస్థిరమైన , మరింత సర్క్యులర్ వృత్తాకార జీవ-ఆధారిత సాంకేతికతలు, ఉత్పత్తులు , సేవలను సృష్టించడంలో పరిశోధన, అభివృద్ధి , ఆవిష్కరణల పాత్ర వంటి విధాన సమస్యలు; బ్లూ ఎకానమీ సైన్స్ , సర్వీసులను అర్థం చేసుకోవడం; బ్లూ ఎకానమీ రంగాలు - అవకాశాలు; పరిశీలనా డేటా , సమాచార సేవలు; సముద్ర పర్యావరణ వ్యవస్థలు , కాలుష్యం; బ్లూ ఎకానమీ నిర్వహణ- దృక్పథాలు; తీర , సముద్ర ప్రాదేశిక ప్రణాళిక; సముద్ర జీవ వనరులు , జీవవైవిధ్యం; డీప్ సీ ఓషన్ టెక్నాలజీ; బ్లూ ఎకానమీ విధాన దృక్పథాలు సహా వివిధ అంశాలపై చర్చించాయని సంతృప్తి వ్యక్తం చేశారు.

 

వసుధైక కుటుంబం లేదా వన్-ఎర్త్ వన్-ఫ్యామిలీ వన్-ఫ్యూచర్ అనే భారతదేశ జి 20 ప్రధాన థీమ్ కింద కోల్కతా -  రాంచీ -, దిబ్రూగఢ్ -  ధర్మశాల - డయ్యూ వరకు ఇప్పుడు ముంబై వరకు గత 5-6 నెలల్లో భారతదేశం నిర్వహించిన ఆర్ఐఐజి సమావేశాలు , సమావేశాల శ్రేణి ముగింపు సూచకంగా జరిగిన నిర్మాణాత్మక,  ఫలవంతమైన చర్చలకు గానూ డాక్టర్ జితేంద్ర సింగ్ జి 20 ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ ఏ ఈక్విటబుల్ సొసైటీని ఆర్ఐఐజీ-2023 ప్రధాన ఇతివృత్తంగా గుర్తించామని తెలిపారు.

 

మన ప్రాధాన్య రంగాలపై విలువైన సూచనలు , వ్యాఖ్యలతో భారతదేశ ఆర్ఐఐజి ఎజెండాకు మద్దతు ఇచ్చినందుకు సభ్యులకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. అంతర్జాతీయ సహకారం, భాగస్వామ్యాల ద్వారా రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ద్వారా ఐక్యరాజ్యసమితి ఎస్ డీజీ-2023 సాధనకు సహకరించేందుకు భారత్ కట్టుబడి ఉంది.

 

i) మెటీరియల్స్ ఫర్ సస్టెయినబుల్ ఎనర్జీ ii) వృత్తాకార జీవ ఆర్థిక వ్యవస్థ; iii) ఇంధన మార్పు కోసం పర్యావరణ ఆవిష్కరణలు; iv) స్థిరమైన బ్లూ-ఎకానమీని సాధించే దిశగా శాస్త్రీయ సవాళ్లు - అవకాశాలు, అనే అనే ప్రాధాన్య అంశాల కింద భారతదేశం మొత్తం 5 సమావేశాలు ,  సదస్సులకు ఆతిథ్యం ఇచ్చింది. ఇది సమ్మిళిత సామాజిక అభివృద్ధి వృద్ధి కోసం పరిశోధన -ఆవిష్కరణ ల ప్రాముఖ్యతను సూచిస్తుంది.

 

<><><><><>


(Release ID: 1937540) Visitor Counter : 211


Read this release in: English , Urdu , Hindi , Tamil