పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అయోధ్య విమానాశ్రయం అభివృద్ధి సెప్టెంబర్, 2023 నాటికి పూర్తవుతుంది


దాదాపుగా రూ.350 కోట్ల వ్యయంతో విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇది A-321/B-737 రకం విమానాల రాకపోకలకు అనుకూలంగా ఉంటుంది.

కొత్త మధ్యంతర టెర్మినల్ భవనం 6250 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. రద్దీ సమయాల్లో 300 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు.

Posted On: 30 JUN 2023 7:43PM by PIB Hyderabad

అయోధ్య విమానాశ్రయం అభివృద్ధి సెప్టెంబరు 2023 నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. కొత్త విమానాశ్రయం A-320/B-737 రకం విమానాల నిర్వహణకు అనుకూలంగా ఉంటుంది. ఈ విమానాశ్రయాన్ని దాదాపు రూ.350 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయనున్నారు.

ఐఎఫ్ఆర్ కండిషన్‌లో కోడ్ -C రకం విమానాల నిర్వహణ కోసం ఇప్పటికే ఉన్న రన్‌వేని 1500m X 30m నుండి 2200m x 45m వరకు పొడిగించడం, మధ్యంతర టెర్మినల్ భవనం, ఏటీసీ టవర్, అగ్నిమాపక కేంద్రం, కార్ పార్కింగ్,పార్కింగ్ 03 కోసం కొత్త అప్రాన్ వంటి  సిటీసైడ్, ఎయిర్సైడ్ అభివృద్ధి పనులను కోడ్ సీ రకం విమానాల కోసం చేపడతారు.


6250 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న కొత్త తాత్కాలిక టెర్మినల్ భవనం రద్దీ సమయాల్లో 300 మంది ప్రయాణికులకు అవసరమైన మౌలిక సదుపాయాలను అందించేలా సిద్ధం చేస్తారు. ప్రయాణీకుల సౌకర్యాలలో 08 చెక్-ఇన్- కౌంటర్లు, 03 కన్వేయర్ బెల్ట్‌లు (డిపార్చర్ 01 మరియు అరైవల్ హాల్‌లో 02), డెబ్బై- ఐదు కార్ల పార్కింగ్ సామర్థ్యంలో రెండు పార్కింగ్ ,  బస్సు పార్కింగ్ సదుపాయం కల్పిస్తారు.  విమానాశ్రయం ప్రయాణికుల రద్దీకి అనుకూలంగా ఉంటుంది.

విమానాశ్రయం యొక్క టెర్మినల్ బిల్డింగ్   డబుల్ ఇన్సులేటెడ్ రూఫింగ్ సిస్టమ్ తో నిర్మిస్తారు. ఇంధన పొదుపు కోసం కానోపీస్, ఎల్ఈడీ  లైటింగ్, తక్కువ వేడిని పొందే డబుల్ గ్లేజింగ్ యూనిట్, భూగర్భజలాలను భర్తీ చేయడానికి  చేయడానికి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ఫౌంటైన్‌లతో ల్యాండ్‌స్కేపింగ్, హెచ్వీఏసీ, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, మురుగునీటి శుద్ధి చేసే ప్లాంట్,  ల్యాండ్‌స్కేపింగ్ కోసం రీసైకిల్ చేసిన నీటిని ఉపయోగించడం, GRIHA-–V రేటింగ్‌లకు అనుగుణంగా 250 KWP సామర్థ్యంతో సౌర విద్యుత్ ప్లాంట్ వంటి సదుపాయాలతో ఈ విమానాశ్రయ టెర్మినల్ భవనాన్ని నిర్మించనున్నారు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య యొక్క సంస్కృతి మరియు వారసత్వాన్ని ఏకీకృతం చేయడానికి టెర్మినల్ రూపొందించబడింది.  ఇది సందర్శకులకు అయోధ్యలో ఉన్నామనే అనుభూతిని కల్పిస్తుంది.

టెర్మినల్ భవనం రెండువైపులా ముఖభాగాలు అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరం యొక్క ఆలయ నిర్మాణాన్ని చాటిచెబుతాయి. ప్రతిపాదిత టెర్మినల్ బిల్డింగ్ రామ మందిరాన్ని ప్రతిబింబిస్తుంది.  ఇది సందర్శకులకు ఆధ్యాత్మిక భావాన్ని కలిగిస్తుంది. టెర్మినల్ యొక్క నిర్మాణ అంశాలు, నిర్మాణానికి గొప్పతనాన్ని తెలియజేయడానికి వివిధ ఎత్తుల శిఖరాలతో అలంకరించేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. వివిధ శిఖరాలతో పాటు, టెర్మినల్ భవనం యొక్క ఫాసియాను మెరుగుపరచడానికి టెర్మినల్ అలంకరణ నిలువు వరుసలను కలిగి ఉంటుంది. కొత్త టెర్మినల్ బిల్డింగ్ లోపలి భాగాలను భగవాన్ శ్రీరాముని జీవిత విశేషాలను  వర్ణించేలా స్థానిక కళలు, పెయింటింగ్‌లు మరియు కుడ్యచిత్రాలతో అలంకరిస్తారు.  ఇది ప్రయాణీకులకు మరియు సందర్శకులకు శ్రీరాముడి గొప్పదనాన్ని వర్ణించేలా, అనుభూతిని చెందేలా ఉంటుంది.

కేంద్ర పౌర విమానయాన మరియు ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాదిత్య ఎం. సింధియా.. విమానాశ్రయంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై తన అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అయోధ్య విమానాశ్రయంలో అభివృద్ధి పనులు భారతదేశ మౌలిక సదుపాయాలలో పురోగతిని,  ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ యొక్క దార్శనికతను చూపుతున్నాయన్నారు.  ఈ అత్యాధునిక విమానాశ్రయం పవిత్ర నగరమైన అయోధ్యలో ఎయిర్ కనెక్టివిటీని మెరుగుపరచడానికి మరియు పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి తమ నిబద్ధతకు ప్రతీకగా ప్రధాని తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో, ఈ ప్రాజెక్ట్ ప్రాంతీయ అభివృద్ధిని పెంచడమే కాకుండా రాముడితో ముడిపడి ఉన్న గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కూడా గౌరవిస్తుందన్నారు. విమానాశ్రయం అయోధ్య అభివృద్ధి మరియు శ్రేయస్సుకు మార్గం సుగమం చేస్తుందని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పారు. విమానాశ్రయంలో జరుగుతున్న పురోగతిపై మంత్రి ట్వీట్ చేశారు. ట్వీట్‌ను ఈ లింక్పై చూడొచ్చు ..https://twitter.com/JM_Scindia/status/1674041653487886337? s=20

 

****

 


(Release ID: 1937198) Visitor Counter : 160


Read this release in: English , Urdu , Marathi , Hindi