భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారతదేశ పరిశోధనా నౌక 'సాగర్ నిధి' - కొలంబో సెక్యూరిటీ కాన్‌క్లేవ్‌లో శాస్త్రవేత్తల తొలి ప్రయాణం

Posted On: 03 JUL 2023 3:34PM by PIB Hyderabad

సముద్ర సహకారానికి సంబంధించిన  హిందూ మహాసముద్ర ప్రాంతానికి చెందిన  దేశాల మధ్య  కుదిరిన కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ (CSC) ఒప్పందంలో భాగంగా  బంగ్లాదేశ్, మారిషస్ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు 2023 జూన్ 29న  భారతదేశ పరిశోధన నౌక 'సాగర్ నిధి' లో ప్రయాణం ప్రారంభించారు. . దాదాపు 35 రోజుల పాటు సాగే  ఉమ్మడి సముద్ర యాత్ర శాస్త్రవేత్తలు పాల్గొంటారు. 

కేంద్ర భూ శాస్త్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న  ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS) ఈ యాత్రని నిర్వహిస్తుంది. 2022  నవంబర్ లో గోవా, హైదరాబాద్‌లో జరిగిన తొలి సిఎస్సి  ఓషనోగ్రాఫర్స్ అండ్ హైడ్రోగ్రాఫర్స్ సదస్సులో యాత్రకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. 

యాత్ర సమయంలో సముద్ర వాతావరణంలో మార్పులు,సముద్ర జలాల్లో చోటు చేసుకునే వైవిధ్యాన్ని అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహించి సమాచారాన్ని సేకరిస్తారు.

 

***

 


(Release ID: 1937093) Visitor Counter : 231


Read this release in: English , Urdu , Hindi , Bengali