రాష్ట్రపతి సచివాలయం
జూలై 3 నుండి 7 వరకు కర్నాటక, తెలంగాణ, మహారాష్ట్రలలో పర్యటించనున్న భారత రాష్ట్రపతి
प्रविष्टि तिथि:
02 JUL 2023 7:24PM by PIB Hyderabad
భారత రాష్ట్రపతి, శ్రీమతి ద్రౌపది ముర్ము జూలై 3 నుండి 7, 2023 వరకు కర్ణాటక, తెలంగాణ మరియు మహారాష్ట్రలలో పర్యటించనున్నారు. జులై 3, 2023న, కర్ణాటకలోని ముద్దెనహళ్లిలో శ్రీ సత్యసాయి యూనివర్సిటీ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ 2వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొననున్నారు. సాయంత్రం కర్ణాటక రాజ్‌భవన్‌లో పీవీటీజీ సభ్యులతో కూడా రాష్ట్రపతి ముచ్చటించనున్నారు. జూలై 4, 2023న, రాష్ట్రపతి హైదరాబాద్‌లో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ముగింపు కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారు. జూలై 5, 2023న, గోండ్వానా విశ్వవిద్యాలయం యొక్క 10వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ప్రసంగిస్తారు. నాగ్‌పూర్‌లోని కోరడిలో భారతీయ విద్యాభవన్ యొక్క సాంస్కృతిక కేంద్రాన్ని కూడా ప్రారంభించనున్నారు. జూలై 6, 2023న, రాష్ట్రపతి నాగ్‌పూర్‌లోని రాజ్‌భవన్‌లో పీవీటీజీసభ్యులతో సంభాషిస్తారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఆమె గౌరవార్థం ముంబయిలోని రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన పౌర విందుకు రాష్ట్రపతి హాజరవుతారు.
*****
(रिलीज़ आईडी: 1937031)
आगंतुक पटल : 214