నౌకారవాణా మంత్రిత్వ శాఖ

గుజరాత్ లోని లోథాల్ లో 4,500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో జాతీయ సముద్రయాన వారసత్వ భవనసముదాయాన్ని(ఎన్.ఎం.హెచ్.సి) అభివృద్ధి చేయనున్న ప్రభుత్వం.


భారతదేశానికి గల గొప్ప సముద్రయాన వారసత్వాన్ని ప్రపంచానికి తెలియజేసేలా ఎన్.ఎం.హెచ్.సిని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు.

లోథాల్, ఎన్.ఎం.హెచ్.సి ప్రాజెక్టు పురోగతి పై సమీక్షా సమావేశం 2023 జూలై 2న జరుగుతుంది.

Posted On: 30 JUN 2023 6:01PM by PIB Hyderabad

సాగర మాల కార్యక్రమం కింద , కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వశాఖ గుజరాత్లోని లోథాల్ లో ప్రపంచ శ్రేణి సదుపాయాలతో జాతీయ సముద్రయాన వారసత్వ సముదాయాన్ని అభివృద్ధి చేస్తోంది.
ఎన్.ఎం.హెచ్.సిని అంతర్జాతీయ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దనున్నారు. ఇక్కడ భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి , ఆధునిక కాలం వరకు గల సముద్రయాన వారసత్వ చరిత్రను ప్రదర్శిస్తారు. ఇది అటు విజ్ఞానాన్ని , వినొదాన్ని కలిగించే  ప్రాజెక్టు.
ఇందులో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భారతీయ సముద్రయాన వారసత్వ చరిత్రపై అవగాహన కల్పిస్తారు.

ఇందుకు సంబంధించిన ప్రాజెక్టు పురోగతిపై గుజరాత్ లోని లోథాల్ లో  ప్రాజెక్టుస్థలం వద్ద 2023 జూలై 2న సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ ప్రాజెక్టు పై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్,
కేంద్ర పోర్టులు, షిప్పింగ్, వాటర్వేస్, ఆయుష్ శాఖ మంత్రి శ్రీ శర్వానంద్ సోనోవాల్,  కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమం, రసాయనాలు,ఎరువుల శాఖ మంత్రి  డాక్టర్ మన్సుఖ్ మాండవీయ, పోర్టులు, షిప్పింగ్, జలమార్గాలు,పర్యాటక శాఖ సహాయమంత్రి శ్రీ శ్రీపాద యశోనాయక్,
కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ సహాయమంత్రి శ్రీ శంతను ఠాకూర్ తదితరులు సమీక్ష నిర్వహించనున్నారు.

ఈ సముద్రయాన కాంప్లెక్స్లో ప్రపంచంలోనే ఎత్తయిన లైట్ హౌస్ మ్యూజియం, ప్రపంచంలోనే అతిపెద్ద ఆక్వాటిక్ గ్యాలరీ, భారతదేశపు భారీ నౌకామ్యూజియం ఏర్పాటు కానున్నాయి. దీనితో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ పర్యాటక కేంద్రం కానున్నది.
ఈ ప్రాజెక్టుకు పర్యాటకులను ఆకర్షించచడంలో గల సామర్ధ్యాన్ని దృష్టిలో ఉంచుకున్నప్పుడు, ఇది ఈ ప్రాంత ఆర్ధిక అభివృద్ధిని మరింత ముందుకు తీసుకుపోగలదని భావిస్తున్నారు.

4500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ కాంప్లెక్స్ నిర్మాణ పనులు  2022 మార్చిలో ప్రారంభమయ్యాయి.  ఈ ప్రాజెక్టులో పలు వినూత్న అంశాలు ఉన్నాయి. హరప్పా నాగరికత కాలం నాటి నిర్మాణ శైలులను
జీవన విధానాన్ని పునర్ ఆవిష్కరించే విధంగా లోథాల్ మినీ రిక్రియేషన్ వంటివి ఇక్కడ ఏర్పాటవుతున్నాయి. స్మారక థీమ్ పార్క్, సముద్రయాన థీమ్ పార్క్, నౌకా థీమ్ పార్క్, వాతావరణ థీమ్ పార్క్,  సాహస, వినోద థీమ్ పార్క్ వంటి థీమ్ పార్కులు ఏర్పాటవుతున్నాయి.
భారతీయ నౌకకాయాన సంస్కృతిని హరప్పా నాగరికతా కాలం నుంచి నేటివరకు తెలియజేసేలా 14 గ్యాలరీలను ఏర్పాటు చేస్తారు. అలాగే కోస్తా తీర ప్రాంత పెవిలియన్లో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల లో వైవిధ్యతతో కూడిన
సముద్రయాన వారసత్వాన్ని ,ఇతర అంశాలను ప్రతిబింబించేలా రూపుదిద్దనున్నారు.

 

***



(Release ID: 1936917) Visitor Counter : 98


Read this release in: English , Urdu , Hindi