సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
జూన్ 29 నుంచి జూలై 5 వరకు జైపూర్ లో జరగనున్న దివ్యకళా మేళా.
20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 100 మంది దివ్యాంగ కళాకారులు, హస్తకళాకారులు, ఎంటర్ప్రెన్యుయర్లు ఈ మేళాలో తమ ఉత్పత్తులు, నైపుణ్యాలను ప్రదర్శిస్తారు.
Posted On:
28 JUN 2023 3:18PM by PIB Hyderabad
దివ్యాంగుల సాధికారతా విభాగం , 2023 జూన్ 29 నుంచి , జూలై 5 మధ్య రాజస్థాన్లోని జైపూరర్ లో జవహర్లాల్ నెహ్రూ మార్గ్ లోని జవహర్ కళా కేంద్ర లో , జరిగే దివ్య కళా మేళాలో దేశవ్యాప్తంగా గల దివ్యాంగ హస్తకళాకారులు, ఎంటర్ప్రెన్యుయర్లు తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శనకు పెట్టనుంది.
ఈ ఈవెంట్ సందర్శకులకు అద్భుత అనుభవాన్ని మిగల్చనుంది. ఇందులో జమ్ముకాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి అద్భుతమైన ఉత్పత్తులను ,హస్తకళారూపాలను, ఎంబ్రాయిడరీ వర్క్ ను, పాకెట్ చేసిన ఆహార పదార్థాలను ప్రదర్శనకు పెట్టనున్నారు.
దివ్యాంగుల సాధికారతా విభాగం , దివ్యాంగుల ఆర్ధిక సాధికారతకు చేపట్టిన వినూత్న కార్యక్రమం ఈ దివ్య కళా మేళా. దివ్యాంగుల నైపుణ్యాలను, వారు తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శనకు, మార్కెటింగ్కు ఒక పెద్ద వేదికగా ఇది వారికి ఉపకరించనుంది.
2022 నుంచి నిర్వహిస్తున్న దివ్య కళా మేళాలలో జైపూర్ లో నిర్వహిస్తున్న మేళా ఆరవది. మొదటిది 2022 డిసెంబర్లో ఢిల్లీలో, రెండవది 2023 ఫిబ్రవరిలో ముంబాయిలో, మూడవది 2023 మార్చిలో భోపాల్ లో, నాలుగవది 2023 మే నెలలో గువాహతి లో, ఐదవది 2023 జూన్ లో ఇండోర్ లో జరిగాయి.
20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన దివ్యాంగ హస్తకళాకారులు, చేతివృత్తుల వారు, ఎంటర్ప్రెన్యుయర్లు, ఈ దివ్య కళా మేళాలో తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తారు. ఈ ప్రదర్శనలో కింది కేటగిరీలోని ఉత్పత్తులు ఉంటాయి.
అవి గృహ అలంకరణలు, జీవన శైలికి సంబంధించినవి, దుస్తులు, స్టేషనరీ, పర్యావరణ హితకర ఉత్పత్తులు, పాకేజ్ చేసిన ఉత్పత్తులు, ఆర్గానిక్ ఉత్పత్తులు బొమ్మలు, బహుమతులు, వ్యక్తిగత వస్తువులు, ఆభరణాలు,
క్లచ్ బ్యాగ్ లు వంటివి ఉన్నాయి. ఇది స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత నిచ్చే ఓకల్ ఫర్ లోకల్ కు ఇది ఒక మంచి అవకాశం. దివ్యాంగ కళాకారులు పట్టుదలతో తయారు చేసే ఈ ఉత్పత్తులను చూడడానికి, కొనడానికి ఇది మంచి అవకాశం.
జైపూర్ లో ఏడు రోజులపాటు జరిగే దివ్యకళా మేళా , 2023 జూన్ 29 నుంచి , 5 జూలై 2023 వరకు ఉదయం 10 గంటలనుంచి రాత్రి 10 గంటలవరకు తెరిచి ఉంటుంది.
ఈ సందర్భంగా పలు సాంస్కృతక కార్యక్రమాలు, దివ్యాంగ కళాకారులచే ప్రదర్శింపబడతాయి. అలాగే పలువురు ప్రముఖ కళాకారులు కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొంటారు.ఈ మేళా సందర్భంగా సందర్శకులు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆహారాలను రుచి చూడవచ్చు.
దివ్యకళా మేళా ఈవెంట్ను జూన్ 29 సాయంత్రం 5 గంటలకు కేంద్ర సామాజిక న్యాయం , సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయమంత్రి,
శ్రీమతి ప్రతిమా భౌమిక్ హాజరుకానున్నారు.
దివ్యకళామేళాలను పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిర్వహించి, దివ్యాంగులు తయారు చేసిన ఉత్పత్తులను ప్రొత్సహించేందుకు దివ్యాంగుల సాధికారత విభాగం పెద్ద ఎత్తున ప్రణాళికలు రూపొందిస్తోంది. 2023–24 సంవత్సరంలో ఈ మేళాలను దేశవ్యాప్తంగా 12 నగరాలలో ఏర్పాటు చేయనున్నారు.
***
(Release ID: 1936213)
Visitor Counter : 121