రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
గుర్గావ్ లో జాతీయరహదారిపై నీటి నిల్వ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు సమావేశం నిర్వహించిన ఎన్.హెచ్.ఎ. ఐ ఛైర్మన్
Posted On:
28 JUN 2023 6:55PM by PIB Hyderabad
హర్యానాలోని గుర్గావ్ జిల్లాలో జాతీయ రహదారులపై నీటి నిల్వ సమస్య పరిష్కారానికి న్యూఢిల్లీలోని ఎన్.హెచ్.ఎ.ఐ కేంద్ర కార్యాలయంలో ,ఒక సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి ఎన్.హెచ్.ఎ.ఐ ఛైర్మన్ శ్రీ సంతోష్ కుమార్ యాదవ్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి గుర్గావ్ మెట్రోపాలిటన్ డవలప్మెంట్ అథారిటీ (జిఎండిఎ) సి.ఇ.ఒ, ఫరీదాబాద్ మెట్రోపాలిటన్ డవలప్మెంట్ అథారిటీ (ఎఫ్.ఎం.డి.ఎ)కి చెందిన అధికారులు,
మనెసర్ మునిసిపల్ కార్పొరేషన్ (ఎంసిఎం) అధికారులు, ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (ఎంసిడి) అధికారులు, ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డు (డిసిబి) అధికారులు, ఎన్.హెచ్.ఎ.ఐకి చెందిన ఇతర సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ ప్రాంతంలోని జాతీయ రహదారులపై నీటినిల్వ సమస్యకు తక్షణ, శాశ్వత పరిష్కారం కనుగొనే అంశాలతోపాటు, ఆక్రమణలను నిరోధించడం, అనధికారికంగా రోడ్లను తవ్వడం, జాతీయ రహదారులకు అక్రమంగా రోడ్ల అనుసంధానం వంటి అంశాలపై కూడా వీరు ఈ సమావేశంలో దృష్టిపెట్టారు.
రహదారులపై నీరు నిల్వకాకుండా ఉండేందుకు తగిన పరిష్కారంగా అధికారులు అనుసరించవలసిన బహుముఖ వ్యూహం గురించి చర్చించారు. తక్షణ చర్యగా , లోతట్టు ప్రాంతాలలో నీటి పంపులను ఏర్పాటు చేయడంతోపాటు,
నీరు నిల్వ కాకుండా తగిన కాలువ మార్గాలు ఏర్పాటు చేసే అంశంపై ఈ సమావేశంలో చర్చించారు. అన్ని ప్రభుత్వ విభాగాల మధ్య మెరుగైన సమన్వయం ఉండాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.
.దౌలా కువాన్, సుబ్రతో పార్క్ చుట్టూ నీటి నిల్వ సమస్యను అధ్యయనం చేసేందుకు ఒక ప్రత్యేక ఏజెన్సీకి ఈ బాధ్యతను అప్పగించి, పరిష్కార మార్గాలు సూచించాల్సిందిగా కోరనున్నట్టు తెలిపారు.
అలాగే గుర్గావ్ – పటౌడి, – రేవారి, ద్వారక ఎక్స్ప్రెస్ వే, గురుగ్రా, సోహ్నా మార్గాలకు సంబంధించి ప్రాజెక్టుల వారీగా సమస్యలను చర్చించడం జరిగింది. జాతీయ రహదారులపై ప్రయాణికులకు, ఎలాంటి అంతరాయం లేకుండా
సురక్షితమైన ప్రయాణ అనుభవాన్ని కలిగించేందుకు తీసుకోవలసిన చర్యలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు.
***
(Release ID: 1936211)
Visitor Counter : 139