ఆర్థిక మంత్రిత్వ శాఖ
30కి పైగా నకిలీ సంస్థల గుట్టు రట్టు చేసిన సీజీఎస్‌టీ దిల్లీ పశ్చిమ కమిషనరేట్, ప్రత్యేక తనిఖీల్లో భాగంగా ఒక వ్యక్తి అరెస్టు
प्रविष्टि तिथि:
28 JUN 2023 8:24PM by PIB Hyderabad
సీజీఎస్‌టీ దిల్లీ ప్రాంతీయ పరిధిలోని సీజీఎస్‌టీ దిల్లీ పశ్చిమ కమిషనరేట్, నకిలీ సంస్థల నమోదులపై చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో భాగంగా ఒక సంస్థ గురించి ఆరా తీస్తే విస్తుగొలిపే విషయాలు బయటకు వచ్చాయి. నమోదు సమయంలో ఆ సంస్థ ఇచ్చిన చిరునామాతోనే ఇంకా చాలా సంస్థలు నమోదయ్యాయని అధికారులు కనిపెట్టారు. కానీ, ఆ చిరునామాతో ఉన్న ఆస్తి యజమాని మాత్రం తనకు అలాంటి విషయాలేవీ తెలీవని వెల్లడించారు. ఆ చిరునామా నుంచి ఎలాంటి వ్యాపార లావాదేవీలు, సరుకుల తరలింపు జరగలేదని అధికారుల దర్యాప్తులో తేలింది.
డేటా అనలిటిక్స్ ద్వారా కనిపెట్టిన దిల్లీలోని అనేక ప్రదేశాల్లో ఈ సోదాలు జరిగాయి. శివ అనే వ్యక్తి, రుణాలు మంజూరు నెపంతో కొందరి కేవైసీ వివరాలు సంపాదించి, ఆ చిరునామాలతో నకిలీ సంస్థలను సృష్టించినట్లు అధికారులు తేల్చారు. శివ 30కి పైగా నకిలీ సంస్థలను సృష్టించి, వాటిని నగదు రూపంలో అమ్మి సొమ్ము చేసుకున్నట్లు రుజువైంది. భౌతిక ధృవీకరణ లేకుండా, జీఎస్‌టీ నమోదులు పూర్తి చేసేందుకు ఆధార్ ప్రమాణీకరణను ఉపయోగించినట్లు కూడా అతను ఉపయోగించినట్లు తెలిపాడు.
ఈ నకిలీ సంస్థలు రూ.50 కోట్లకు పైగా ఐటీసీ పొందినట్లు నిర్ధరణ అయింది. సీజీఎస్‌టీ చట్టం, 2017లోని సెక్షన్ 132 ఉల్లంఘించిన కారణంగా అధికారులు శివను అరెస్టు చేశారు. ఈరోజు అతడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
****
(रिलीज़ आईडी: 1936209)
आगंतुक पटल : 169