ఆర్థిక మంత్రిత్వ శాఖ
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న డ్రైవ్‌లో మాదకద్రవ్యాలను ధ్వంసం చేసిన ఎయిర్ కార్గో ఎక్స్‌పోర్ట్ ఢిల్లీ కమిషనరేట్
Posted On:
28 JUN 2023 8:10PM by PIB Hyderabad
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని, 26.06.2023న ఢిల్లీ ఎయిర్ కార్గో కస్టమ్స్ (ఎగుమతి) కమిషనరేట్ 326 కేజీల మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ (మనస్సుపై ప్రభావం చూపే) పదార్ధాలను ఢిల్లీ కాలుష్యనియంత్రణ బోర్డు ఆమోదించిన న్యూఢిల్లీ కేంద్రమైన బయోటిక్ వేస్ట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ధ్వంసం చేసింది.
మాదక ద్రవ్యాల అక్రమరవాణాకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న డ్రైవ్‌లో భాగంగా 27.06.2023న 19.52కేజీల ఓపియం (నల్లమందు)ను స్వాధీనం చేసుకొని మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌లో ప్రభుత్వ ఓపియం అండ్ ఆల్కలాయిడ్ పరిశ్రమకు అందించారు.
ధ్వంసం చేసిన సరుకు 72 కేసులలో స్వాధీనం చేసుకున్నది. ఇందులో గాంజా, హెరోయిన్, ఖాత్ ఆకులు, నల్లమందు, కెటామైన్ సహా ఇతర ఎన్‌డిపిఎస్ పదార్ధాలు ఉన్నాయి. ఈ దాడులను ఢిల్లీలో ఎయిర్ కార్గో కస్టమ్స్ (ఎగుమతి) నిర్వహించే నూతన కొరియర్ టెర్మినల్ వద్ద, విదేశీ పోస్ట్ ఆఫీస్ పైనా ఎక్కువగా జరిపి, ఆ పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు.
మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్ధాలు (ఎన్‌డిపిఎస్) స్మగ్లర్లకు పెద్ద దెబ్బగా పరిణమించింది. దేశంలో మాదక ద్రవ్యాల ముప్పుని ఎదుర్కోవడంలో ఢిల్లీ కస్టమ్స్ కీలక పాత్ర పోషిస్తోంది.
***
(Release ID: 1936207)