సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

డాక్టర్ జితేంద్ర సింగ్ ఆదేశాల మేరకు దాదాపు 1,600 మంది ఎఎస్‌ఓలను సెక్షన్ ఆఫీసర్లుగా పదోన్నతులు కల్పించేందుకు ఆమోదం తెలిపి డిఒపిటీ.


"ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉద్యోగులను ప్రోత్సహించడానికి మరియు దీర్ఘకాలిక స్తబ్దత సమస్యను అధిగమించడానికి వారికి భారీ ప్రమోషన్లు మంజూరు చేస్తోంది": డాక్టర్ జితేంద్ర సింగ్

ఈ ఏడాది చివరి నాటికి ఎస్‌ఎస్‌ఏ మరియు ఇతర గ్రేడ్‌లలో మరో 2000 ప్రమోషన్‌లు

Posted On: 27 JUN 2023 5:43PM by PIB Hyderabad

 

అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ (ఎఎస్‌ఓలు) హోదాలో పనిచేస్తున్న 1,592 మంది అధికారులను అడ్హాక్ ప్రాతిపదికన సెక్షన్ ఆఫీసర్ల పోస్ట్‌కి తక్షణమే అమలులోకి వచ్చేలా సామూహిక పదోన్నతి కల్పించడానికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ & ట్రైనింగ్ (డిఒపిటీ) ఆమోదించింది.

ఈ రోజు ఇక్కడ ఈ విషయాన్ని ప్రకటిస్తూ కేంద్ర సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) సైన్స్ & టెక్నాలజీ; పీఎంవో, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ అండ్ స్పేస్, సంబంధిత కేడర్ కంట్రోలింగ్ అధికారుల ద్వారా పదోన్నతుల ఉత్తర్వులు త్వరలో జారీ చేయనున్నట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.

మొత్తం ప్రక్రియను వ్యక్తిగతంగా సమీక్షించిన మంత్రి ఇంచార్జి డిఓపిటి డాక్టర్ జితేంద్ర సింగ్ ఆదేశాల మేరకు ప్రమోషన్‌లు వేగవంతం చేయబడ్డాయి.

“ఉద్యోగులను ప్రోత్సహించడానికి మరియు దీర్ఘకాలిక స్తబ్దత సమస్యను అధిగమించడానికి ప్రభుత్వం వారికి పెద్ద ఎత్తున పదోన్నతులు మంజూరు చేస్తోంది.ఎఎస్‌ఓ మరియు ఇతర గ్రేడ్‌లలో మరో 2,000 ప్రమోషన్‌లు ప్రాసెస్‌లో ఉన్నాయి మరియు ఈ సంవత్సరం చివరి నాటికి వారికి పదోన్నతి లభిస్తుందని ఆశిస్తున్నాము ”అని మంత్రి చెప్పారు.

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ గత తొమ్మిదేళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులు, ఖాళీలు లేకపోవడం వల్ల గత వారసత్వంగా ఉన్న వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలలో దీర్ఘకాలిక స్తబ్దత సమస్యలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షించిందని అన్నారు.

గత ఏడాది కూడా దాదాపు 9,000 సామూహిక ప్రమోషన్లు జరిగాయని అంతకు ముందు మూడు సంవత్సరాల్లో 4,000 ప్రమోషన్లను డిఒపిటీ మంజూరు చేసిందని మంత్రి చెప్పారు.

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ పరిపాలనలోని అత్యల్ప స్థాయిలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు తమ మొత్తం సర్వీస్ పదవీకాలాన్ని 30 నుండి 35 సంవత్సరాల వరకు ఒక్క పదోన్నతి పొందకుండానే గడిపిన సందర్భాలను చూసి తాను వ్యక్తిగతంగా కలవరపడుతున్నానని చెప్పారు. మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులందరితో తాను ఈ సమస్యను చర్చించానని, పరిపాలన యొక్క మధ్య మరియు దిగువ స్థాయిలలో స్తబ్దతను నివారించడానికి అనేక వినూత్న మార్గాలను రూపొందించినట్లు ఆయన చెప్పారు.

పెద్ద సంఖ్యలో కేసుల్లో ఉద్యోగుల మధ్య వ్యాజ్యాల ఫలితంగా పదోన్నతులలో స్తబ్దత ఏర్పడిందని మరియు న్యాయస్థానంలో తన అభిప్రాయాన్ని తెలియజేయడానికి డిఒపిటీ తన శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ, జాప్యం అనివార్యంగా మారిందని డాక్టర్ జితేంద్ర సింగ్ విచారం వ్యక్తం చేశారు.

“ప్రభుత్వ ఉద్యోగాలు సాధ్యమైనంత వరకు అందుబాటులో ఉండేలా ప్రధాని మోదీ ప్రయత్నాలు చేశారని..పదోన్నతులు నిలిచిపోయినందున ఉద్యోగులు కొన్నిసార్లు అదే గ్రేడ్‌లో పదవీ విరమణ పొందడం చాలా బాధాకరం మరియు నిరుత్సాహపరుస్తుంది”అని మంత్రి అన్నారు.

సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ (సిఎస్ఎస్)కి చెందిన ఈ ఉద్యోగులకు సామూహిక పదోన్నతులకు సంబంధించిన ఉత్తర్వులు గత కొన్ని నెలలుగా డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షతన డిఒపిటీలో అనేక రౌండ్ల ఉన్నత స్థాయి సమావేశాల తర్వాత జారీ చేయబడ్డాయి. కొన్ని ఉత్తర్వులు పెండింగ్‌లో ఉన్న రిట్ పిటిషన్ల ఫలితాలకు లోబడి ఉన్నందున న్యాయ నిపుణులను కూడా సంప్రదించామని మంత్రి చెప్పారు.

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ పాలనా సౌలభ్యం మరియు ఎంప్యానెల్‌మెంట్‌లో నిష్పాక్షికతను తీసుకురావడానికి ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో విధివిధానాలను మెరుగుపరిచిందని తద్వారా ఎలాంటి ఆత్మాశ్రయ ప్రాధాన్యతలను నిర్వహించడం లేదన తెలిపారు.

"హ్యూమన్ ఇంటర్‌ఫేస్‌ను తగ్గించడానికి అధునాతన సాంకేతిక సాధనాలను ఉపయోగించి విధానాలు మరింత హైటెక్ చేయబడ్డాయి" అన్నారాయన.

కాలం గడిచే కొద్దీ కాలం చెల్లిన లేదా అసంబద్ధంగా మారిన 1,600 నిబంధనలను ప్రభుత్వం తొలగించిందని డిఓపిటి మంత్రి తెలిపారు.

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ "ఇదంతా ప్రజలకు సమర్థవంతమైన మరియు సకాలంలో ఫలితాలను అందించడానికి మాత్రమే కాకుండా, ఉద్యోగులు తమ సామర్థ్యం మేరకు ఉత్తమంగా పని చేయడానికి కూడా ఉద్దేశించబడింది" అని చెప్పారు.


 

*******


(Release ID: 1935819) Visitor Counter : 133