వ్యవసాయ మంత్రిత్వ శాఖ

పిక్సెల్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ


పంట పెరుగుదల, పెరుగుదల దశ, పెరుగుదల లోపాలు, పంటల ఆరోగ్యం, భూసారం అంశాలపై పిక్సెల్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ ఉపగ్రహాలు సేకరించే సమాచారం ఆధారంగా పరిష్కార మార్గాలు కనుగొనడానికి ఉపకరించే అంశంపై దృష్టి సారించనున్నవ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ

ఆధునిక శాటిలైట్ ఇమేజింగ్ టెక్నాలజీని ఉపయోగించి వినూత్న భౌగోళిక పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి యువ స్టార్టప్‌తో ఇటువంటి రకాల సహకారం చాలా దోహదపడుతుంది: శ్రీ మనోజ్ అహుజా

Posted On: 26 JUN 2023 6:21PM by PIB Hyderabad

పిక్సెల్  స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో  వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ  కార్యదర్శి శ్రీ మనోజ్ అహుజా, వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ    అదనపు కార్యదర్శి ప్రమోద్ కుమార్ మెహెర్దా , న్యూఢిల్లీలోని మంత్రిత్వ శాఖలోని ఇతర సీనియర్ అధికారుల సమక్షంలో ఈ రోజు పిక్సెల్  స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో కుదిరిన అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం తరఫున మహలనోబిస్ జాతీయ పంట సూచన కేంద్రం డైరెక్టర్ శ్రీ సి.ఎస్. మూర్తి, పిక్సెల్  స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌  తరపున చీఫ్ ఆఫ్ స్టాఫ్ శ్రీ అభిషేక్ కృష్ణన్ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం  హైపర్‌స్పెక్ట్రల్ డేటాసెట్‌ని ఉపయోగించి భారతీయ వ్యవసాయ రంగం కోసం ప్రో బోనో ప్రాతిపదికన

పిక్సెల్  స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ వివిధ భౌగోళిక పరిష్కారాలను అభివృద్ధి చేస్తుంది. పంట పెరుగుదల, పెరుగుదల దశ, పెరుగుదల లోపాలు, పంట ఆరోగ్యం, భూసారం అంశాలపై పిక్సెల్  స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ ఉపగ్రహాలు సేకరించే సమాచారం ఆధారంగా పరిష్కార మార్గాలు కనుగొనడానికి ఉపకరించే అంశంపై వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ పని చేస్తుంది.    పిక్సెల్  స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌  అందించే  హైపర్‌స్పెక్ట్రల్ డేటాతో ఫంవినియోగానికి సిద్ధంగా ఉండే విధానాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. తగిన పద్దతులను అభివృద్ధి చేయడం, అమలు చేయడం కోసం   పిక్సెల్  స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ బృందంతో వ్యవసాయ మంత్రిత్వ శాఖ తరఫున మహలనోబిస్ జాతీయ పంట సూచన కేంద్రం పనిచేస్తుంది. 

 

హైపర్‌స్పెక్ట్రల్ రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీలో తక్కువగా ఉండే వేవ్ లెంగ్త్ బ్యాండ్ ఉపయోగించి ఉపగ్రహాలు సమాచారాన్ని సేకరిస్తాయి. ఈ సమాచారం ఆధారంగా   పంటలు, భూసారాన్ని  ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి, అంచనా వేయడానికి నిర్దిష్ట ప్రత్యేక సూచికలను అందిస్తాయి. వ్యవసాయాన్ని పర్యవేక్షించడానికి ఇది ప్రత్యేకమైన సామర్ధ్యంతో  అభివృద్ధి చెందుతున్ననూతన సాంకేతికత. క్లోరోఫిల్ సాంద్రత,భూ ఉపరితల తేమ స్థితి మార్పులు గుర్తించడం ద్వారా పంట ఆరోగ్య స్థితిని గుర్తించి  ప్రమాద నిర్వహణ పరిష్కారాలను అమలు చేయడానికి అవకాశం కలుగుతుంది. 

హైపర్‌స్పెక్ట్రల్ టెక్నాలజీ విధానంలో సేంద్రీయ కార్బన్ అంచనాలతో సహా నేల పోషక మ్యాపింగ్  అమలు చేసే విధానాల్లో ముఖ్యమైన అంశంగా ఉంటుంది.  సెన్సార్ల ద్వారా భూసార పరిస్థితిని తక్కువ ఖర్చుతో, ప్రత్యక్షంగా విశ్లేషించి సమర్ధ సమాచారాన్ని పొందడానికి వీలవుతుంది.  పంట పరిస్థితిని  ముందస్తుగా గుర్తించడం, తెగులు/వ్యాధులు లేదా హైపర్ స్పెక్ట్రల్‌ని ఉపయోగించి పనిచేసే విధానం వల్ల ఖచ్చితమైన రోగనిర్ధారణ చర్యలు అమలు చేయడానికి వీలవుతుంది.  అనేక లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చే ప్రభుత్వ ప్రస్తుత సలహా వ్యవస్థను బలోపేతం చేయడానికి డేటా అనేక అవకాశాలను అందిస్తుంది.

అడ్వాన్స్‌డ్ శాటిలైట్ ఇమేజింగ్ టెక్నాలజీని ఉపయోగించి వినూత్న భౌగోళిక పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి యువ స్టార్టప్ కంపెనీ తో పని చేయడం వల్ల రైతులకు ప్రయోజనం కలుగుతుందని రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ  కార్యదర్శి పేర్కొన్నారు. దీనివల్ల  సర్వే చేయడం, కొలతలు వేయడం లాంటి పనుల కోసం సిబ్బందిపై ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. సిబ్బంది సర్వే చేయడం, కొలతలు వేయడం సమయం తీసుకుంటుంది. కొన్ని సందర్భాల్లో లోపాలు కూడా ఉంటాయి. 

 

*****(Release ID: 1935543) Visitor Counter : 141


Read this release in: English , Urdu , Hindi , Punjabi , Odia