హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జమ్మూ కాశ్మీర్ పర్యటన రెండో రోజున ఈ రోజు శ్రీనగర్‌లో బలిదాన్ స్తంభానికి శంకుస్థాపన చేసి, జమ్మూ కాశ్మీర్ పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులతో సమావేశమై నియామక పత్రాలు అందజేసిన కేంద్ర హోం, సహకార మంత్రి శాఖ శ్రీ అమిత్ షా


జమ్మూ కాశ్మీర్ సాహసవంతులు, ధైర్యశాలుల భూమి, దేశ సేవలో అమరులైన వారి జ్ఞాపకార్థం బలిదాన స్థూపం నిర్మాణం.. ట్వీట్‌లో పేర్కొన్న శ్రీ అమిత్ షా .

బలిదాన స్థూపం అమరవీరుల స్మృతి ని చిరస్థాయిగా ఉండేలా చూసి యువతలో దేశభక్తి ప్రేరేపిస్తుంది.. శ్రీ అమిత్ షా

కాశ్మీర్ ప్రజలు శాంతి కోసం కట్టుబడి ఉన్నారని చెప్పడానికి ఉగ్రవాదులతో పోరాడుతూ, అమాయక ప్రజలకు భద్రత కల్పిస్తూ తమ ప్రాణాలను అర్పించిన జమ్మూ కాశ్మీర్ పోలీసుల త్యాగం నిదర్శనం.

జమ్మూ కాశ్మీర్ పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులతో సమావేశం అయ్యాను. అమరవీరుల కుటుంబ సభ్యులకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం తరపున నియామక పత్రాలు అందజేసాను.. ట్వీట్ లో శ్రీ అమిత్ షా

Posted On: 24 JUN 2023 4:04PM by PIB Hyderabad

జమ్మూ కాశ్మీర్ పర్యటన రెండో రోజునలో భాగంగా కేంద్ర హోం, సహకార మంత్రి శాఖ శ్రీ అమిత్ షా ఈ రోజు శ్రీనగర్‌లో బలిదాన్ స్తంభానికి శంకుస్థాపన చేశారు. శ్రీ షా  జమ్మూ కాశ్మీర్ పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులతో సమావేశమై వారికి  నియామక పత్రాలు అందజేశారు. దీనికి సంబంధించి ట్వీట్ చేసిన శ్రీ అమిత్ షా  “ దేశ  ధైర్యసాహసాలు, శౌర్యానికి పుట్టినిల్లు జమ్మూ కాశ్మీర్. అమర వీరుల పరాక్రమాన్ని,త్యాగాన్ని  చిరస్థాయిగా నిలిపేందుకు ఈరోజు శ్రీనగర్‌లోని ప్రతాప్ పార్కులో ' బలిదాన స్థూపం' నిర్మాణానికి శంకుస్థాపన చేసాను.బలిదాన స్థూపం అమరవీరుల స్మృతి ని చిరస్థాయిగా నిలిపి యువతలో దేశభక్తిని ప్రేరేపిస్తుంది' అని పేర్కొన్నారు. 

 

 “ఉగ్రవాదులతో పోరాడుతూ అమాయక ప్రజల ప్రాణాలకు  భద్రత కల్పిస్తూ తమ ప్రాణాలను అర్పించిన జమ్మూ కాశ్మీర్ పోలీసు సిబ్బంది తయాగం కలకాలం గుర్తుంటుంది. కాశ్మీర్ మరియు ప్రజలు శాంతికి కట్టుబడి ఉన్నారనడానికి నిదర్శనం. ఈ రోజు శ్రీనగర్‌లో అమరవీరుల కుటుంబ సభ్యులను కలుసుకున్నాను.  అమరవీరుల సన్నిహిత బంధువులకు జమ్మూ కాశ్మీర్  ప్రభుత్వం తరపున నియామక పత్రాలు అందజేసాను' అని శ్రీ అమిత్ షా తెలిపారు. 

******

 


(Release ID: 1935044) Visitor Counter : 167