రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

పశ్చిమ నౌకాదళ కమాండ్‌లో 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవ (ఐడీవై-2023) వేడుకలు

Posted On: 21 JUN 2023 3:28PM by PIB Hyderabad

పశ్చిమ నౌకాదళ కమాండ్ (డబ్ల్యు.ఎన్.సి) యూనిట్లు 21 జూన్ 2023న యోగా శిబిరాలను నిర్వహించాయి. 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడీవై-2023) సందర్భంగా 'ఓషన్ రింగ్ ఆఫ్ యోగా' మరియు 'యోగ ఆర్కిటిక్ వరకు అంటార్కిటికా' అనే ఇతివృత్తంతో యోగా క్యాంపులు నిర్వహించబడ్డాయి. ఆయుష్ మంత్రిత్వ శాఖ ద్వారా ప్రకటించబడిన కామన్ యోగా ప్రోటోకాల్ (సీవైపీ) ప్రకారం బుధవారం 0700-0830 గంటల వరకు దీనిని నిర్వహించారు. మహారాష్ట్ర, గుజరాత్, గోవా, కర్నాటకలోని నావికాదళ విభాగాలలోని వివిధ ప్రదేశాలలో నిర్వహించిన శిబిరాల్లో మొత్తం 7000 మంది నౌకాదళ సిబ్బంది, రక్షణ  విభాగం పౌరులు (కుటుంబ సభ్యులతో సహా) యోగా కార్యక్రమాలలో పాల్గొన్నారు. సముద్రాల అంతటా యోగా యొక్క ప్రయోజనాల విస్తరణ అనే నిర్దేశించిన థీమ్‌కు అనుగుణంగా గొప్ప ఉత్సాహంతో సముద్రాలలో, ఐదు విదేశీ ఓడరేవులలోని నౌకాదళ సిబ్బంది, మన దేశపు నౌకాదళ సిబ్బంది, జలాంతర్గాములలో కూడా యోగా కార్యక్రమాలను నిర్వహించారు. ప్రపంచంలోని పురాతన వ్యవస్థీకృత యోగా కేంద్రాలలో ఒకటైన 'ది యోగా ఇన్‌స్టిట్యూట్' ముంబైలోని నావల్ డాక్‌యార్డ్‌లో ఐఎన్ఎస్ విశాఖపట్నం మరియు ఐఎన్ఎస్ మోర్ముగోలో యోగా సెషన్‌లను నిర్వహించింది. దీనికి వెస్ట్రన్ నావల్ కమాండ్ ఎఫ్ఓసీ-ఐఎన్-సీ వైస్ అడ్మ్ దినేష్ కె.త్రిపాఠి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యువ తరంలో యోగా స్ఫూర్తిని పెంపొందించడానికి నావికాదళ సిబ్బంది, యు వారి కుటుంబాల కోసం కోలాబాలోని నేవీ నగర్‌లో మరియు కమాండ్‌లోని నేవీ చిల్డ్రన్స్ స్కూల్లో పిల్లలకు ప్రత్యేక యోగా సెషన్‌లు నిర్వహించబడ్డాయి. ఈ ప్రధాన ఇంవెట్కు ముందు ప్రముఖ యోగా సంస్థలు 'కైవల్యధామ' మరియు 'హార్ట్‌ఫుల్‌నెస్' దక్షిణ ముంబయిలో వరుసగా జూన్ 07-09 జూన్ 23 మరియు 15-17 జూన్ 23 వరకు నౌకాదళ సిబ్బంది మరియు వారి కుటుంబాల కోసం యోగా వర్క్‌షాప్‌లను నిర్వహించాయి. దీనికి తోడు పతంజలి సమితి, ఆర్ట్ ఆఫ్ లివింగ్, భారత్ స్వాభిమాన్ (ఎన్వైఏఎస్) నుండి సర్టిఫైడ్ యోగా శిక్షకులు నావల్ డాక్‌యార్డ్, నివాస ప్రాంతాలు, మెరైన్ డ్రైవ్‌లతో సహా ఈవెంట్ యొక్క చివరి రోజున వివిధ ప్రదేశాలలో సామూహిక యోగా శిబిరాలను నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రముఖ నౌకాదళ భవనాలను విద్యుత్తు దీపాలతో అలంకరించారు. ఐడీవై-2023కి ముందు యోగా అవగాహనను ప్రోత్సహించడానికి సెమినార్లు/ ఉపన్యాసాలు/ క్విజ్‌లు/ వ్యాస రచనమరియు ఫోటోగ్రఫీ పోటీలు వంటి వివిధ కార్యకలాపాలను  నిర్వహించారు. వెస్ట్రన్ నావల్ కమాండ్ ఎల్లప్పుడూ అధికారులు, పురుషులు క్రీడలు, సాహసకృత్యాలు, శారీరక దృఢత్వ కార్యకలాపాలను కొనసాగించేందుకు అధికారులు సిబ్బంది రాణించడానికి ప్రోత్సహిస్తుంది. నావికాదళ సిబ్బంది ఎప్పటికప్పుడు ఎదురవుతున్న సవాళ్లకు అనుగుణంగా స్పందిస్తూ దేశానికి సేవలందిస్తూనే ప్రశంసలు తీసుకువచ్చారు. సమయం-పరీక్షించిన సంప్రదాయాలకు కట్టుబడి యోగా, శారీరక మరియు మానసిక ఆరోగ్య మెరుగుదల చర్యగా బోర్డు షిప్‌లు మరియు స్థాపనలలో ప్రతిరోజూ సాధన చేయబడుతోంది.  అదనంగా, సేవా సిబ్బంది మరియు కుటుంబాల కోసం నౌకాదళ నివాస ప్రాంతాలలో యోగా కోచింగ్ క్యాంపులు తరచుగా నిర్వహించబడుతున్నాయి. 

***


(Release ID: 1934308)
Read this release in: English , Urdu , Hindi