శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి ఒమిక్రాన్ నిర్దిష్ట ఎంఆర్ఎన్ఏ ఆధారిత బూస్టర్ వ్యాక్సిన్ అభివృద్ధి చేయబడింది.

Posted On: 20 JUN 2023 12:50PM by PIB Hyderabad

స్వదేశీ ప్లాట్ఫారమ్ సాంకేతికతను ఉపయోగించి జెన్నోవా బయోఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ .. ఒమిక్రాన్ నిర్దిష్ట ఎంఆర్ఎన్ఏ ఆధారిత బూస్టర్ వ్యాక్సిన్ను అభివృద్ధి చేసిందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డీబీటీ) ప్రకటించింది. కోవిడ్ సురక్ష మిషన్కు ఈ వ్యాక్సిన్ మద్దతుగా నిలుస్తుందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డీబీటీ) తెలిపింది. ఈ వ్యాక్సిన్కు  ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ (ఈయూఏ) కోసం డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) కార్యాలయం నుండి అనుమతి కూడా లభించింది.

వూహాన్ స్ట్రెయిన్ వ్యతిరేకంగా అభివృద్ధి చేసిన ప్రోటోటైప్ ఎంఆర్ఎన్ఏ -ఆధారిత వ్యాక్సిన్ యొక్క మొదటి దశ క్లినికల్ ట్రయల్ వరకు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ నుండి ప్లాట్‌ఫారమ్ సాంకేతికతను అభివృద్ధి చేయడానికి జెన్నోవా యొక్క ఎంఆర్ఎన్ఏ -ఆధారిత తదుపరి- తరం వ్యాక్సిన్ తయారీని డీబీటీ సులభతరం చేసింది.  'మిషన్ కోవిడ్ సురక్ష' కింద ఈ  ప్రాజెక్ట్‌కు మరింత మద్దతు లభించింది.
 బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (బీఐఆర్ఏసీ)లో డీబీటీ కి చెందిన ప్రత్యేకమైన మిషన్ ఇంప్లిమెంటేషన్ యూనిట్ ద్వారా ఇండియన్ కోవిడ్-19 వ్యాక్సిన్ డెవలప్‌మెంట్ మిషన్ తదుపరి క్లినికల్ ట్రయల్స్ ను అభివృద్ధి చేయడం కోసం, ప్రోటోటైప్ వ్యాక్సిన్ ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం రూపొందించింది. దీనిని 29 జూన్ 2022న అత్యవసర వినియోగానికి స్వీకరించడం జరిగింది. అభివృద్ధిపర్చిన ప్లాట్ఫారమ్ టెక్నాలజీని COVID-19 కోసం ఓమిక్రాన్- నిర్దిష్ట బూస్టర్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తారు.

GEMCOVAC®-OM అనేది ఓమిక్రాన్- నిర్దిష్ట ఎంఆర్ఎన్ఏ -ఆధారిత బూస్టర్ వ్యాక్సిన్, డీబీటీ  సహకారంతో జెనోవా ద్వారా స్వదేశీ ప్లాట్‌ఫారమ్ సాంకేతికతను ఉపయోగించి అభివృద్ధి చేయబడింది. ప్రోటోటైప్ టీకా వలె.. GEMCOVAC®-OM అనేది థర్మోస్టేబుల్ వ్యాక్సిన్, దీనికి ఇతర ఆమోదించబడిన ఎంఆర్ఎన్ఏ -ఆధారిత వ్యాక్సిన్‌ల కోసం ఉపయోగించే అల్ట్రా-కోల్డ్ చైన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేదు. ఇది దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తుంది.  ఇది సూది-రహిత ఇంజెక్షన్ పరికర వ్యవస్థను ఉపయోగించి చర్మం ద్వారా శరీరంలోకి పంపిణీ చేయబడుతుంది. బూస్టర్ డోసుగా దీనిని తీసుకున్నవారిలో ఇది రోగనిరోధక ప్రతిస్పందనలను గణనీయంగా ఉత్పత్తి చేస్తుంది. ఆశించిన రోగనిరోధక ప్రతిస్పందన కోసం క్లినికల్ ఫలితాలను ప్రదర్శిస్తుంది.


సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రి (ఐసీ), డాక్టర్ జితేంద్ర సింగ్, బృందం డీబీటీ యొక్క ప్రయత్నాలను ప్రశంసిస్తూ..  " ఈ స్వదేశీ  ఎంఆర్ఎన్ఏ ప్లాట్ఫార్ టెక్నాలజీని సృష్టించడం ద్వారా సాంకేతికత ఆధారిత వ్యవస్థాపకతను ప్రారంభించడంతో డీబీటీ తన లక్ష్యాన్ని మరోసారి నెరవేర్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. -. - ప్రధానమంత్రి ఆత్మనిర్భర దార్శనికతకు అనుగుణంగా 'భవిష్యత్- సన్నద్ధమైన' టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించడానికి సాంకేతికతతో నడిచే ఆవిష్కరణలకు మేము ఎల్లప్పుడూ మద్దతునిస్తామ’న్నారు. "తక్కువ మరియు మద్య ఆదాయ దేశాలతో సహా భారతదేశంలో వ్యాక్సిన్‌ని అమలు చేయడానికి ప్రస్తుతం 2 నుంచి 8 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో భద్రపర్చే ఏర్పాట్లు అవసరమవుతున్నాయి. దీని ఆధారంగానే సరఫరా గొలుసులో మౌలిక సదుపాయాలు రూపొదించడబడ్డాయి. అయితే ఈ ఆవిష్కరణతో రవాణా మరియు నిల్వ కోసం అతితక్కువ ఉష్ణోగ్రత పరిస్థితులు అవసరం లేదని మంత్రి పేర్కొన్నారు. .



డీబీటీ కార్యదర్శి మరియు బీఐఆర్ఏసీ  చైర్‌పర్సన్ డాక్టర్ రాజేష్ ఎస్ గోఖలే మాట్లాడుతూ... సాంకేతిక ఆవిష్కరణల కోసం ఒక పర్యావరణ వ్యవస్థను నడపడానికి మరియు రూపొందించడానికి వ్యూహాత్మక నిధుల సమీకరణ చాలా అవసరం.  డీబీటీ దేశం యొక్క మొట్టమొదటి ఎంఆర్ఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్ అభివృద్ధికి మద్దతునిచ్చినప్పుడు ఆ పని చేసింది. ఇది మరిన్ని వ్యాక్సిన్ల తయారీకి, తక్కువ కాలంలో అభివృద్ధి చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. క్లినికల్ ట్రయల్ నెట్‌వర్క్‌లు, కన్సార్టియా ఆఫ్ హాస్పిటల్స్‌ ఎంఆర్ఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కోసం అదే సైట్లను ఉపయోగించాయని చెప్పారు.

 జెనోవా బయోఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ సీఈవో, డాక్టర్ సంజయ్ సింగ్ మాట్లాడుతూ..  "మేము ఈ ప్లాట్‌ఫారమ్ టెక్నాలజీని అభివృద్ధి చేయడం ప్రారంభించినప్పుడు ప్రతిపాదనను డీబీటీకి పంపామన్నారు. ప్రభుత్వం సైతం ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్‌ను అభివృద్ధి చేయగల మా సామర్థ్యాన్ని విశ్వసించిందని, మేము GEMCOVAC®-OM DCG(I) కార్యాలయం నుండి ఈయూఏ పొందడం ఈ 'పాండమిక్ సిద్ధంగా' సాంకేతికతను ప్రారంభించడానికి, పెంపొందించడానికి మా ప్రయత్నాలే నిదర్శనమన్నారు. భారతదేశం ఇప్పుడు కోవిడ్-కి వ్యతిరేకంగా ఒకటి కాదు రెండు ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేసింది. 19 ర్యాపిడ్ డిసీజ్నాస్టిక్ ప్లాట్‌ఫారమ్ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. దేశం యొక్క మొట్టమొదటి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి  మా బృందం గత రెండు సంవత్సరాలుగా అవిశ్రాంతంగా పనిచేసినందుకు నేను గర్విస్తున్నాను. ఇది మా అందరి కృషి, సీడీఎస్సీఓ సబ్జెక్ట్ నిపుణుల కమిటీ మార్గదర్శకత్వం లేకుండా మరియు బీఐఆర్ఏసీ యొక్క వ్యాక్సిన్ నిపుణుల కమిటీ పర్యవేక్షణ లేకుండా సాధ్యం కాలేదన్నారు.

డీబీటీ గురించి
సైన్స్ & టెక్నాలజీ మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డీబీటీ), భారతదేశంలో బయోటెక్నాలజీ అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది మరియు వేగవంతం చేస్తుంది. ఇందులో వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, జంతు శాస్త్రాలు, పర్యావరణం మరియు పరిశ్రమల రంగాలలో బయోటెక్నాలజీ యొక్క పెరుగుదల మరియు అప్లికేషన్‌లు ఉన్నాయి.

బీఐఆర్ఏసీ గురించి:
బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (బీఐఆర్ఏసీ) అనేది లాభాపేక్ష లేని సెక్షన్ 8, షెడ్యూల్ B, పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజ్.  దీనిని భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని బయోటెక్నాలజీ విభాగం (డీబీటీ) ఏర్పాటు చేసింది. బయోటెక్ ఎంటర్‌ప్రైజెస్ వ్యూహాత్మక పరిశోధన మరియు ఆవిష్కరణలను చేపట్టడం, జాతీయంగా సంబంధిత ఉత్పత్తి అభివృద్ధి అవసరాలను పరిష్కరించడం దీని పని.

జెనోవా గురించి
భారతదేశంలోని పూణేలో ప్రధాన కార్యాలయం కలిగిన జెనోవా బయోఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, బయోటెక్నాలజీ సంస్థ.  ఇది బయో పరిశోధన మరియు అభివృద్ధి, ఉత్పత్తి మరియు వాణిజ్యీకరణకు అంకితం చేయబడింది.

 

***

 


(Release ID: 1933706) Visitor Counter : 187