రక్షణ మంత్రిత్వ శాఖ
మంగోలియాలో జరుగుతున్న ఎక్స్‌ఖాన్ క్వెస్ట్ 2023 బహుళదేశాల ఉమ్మడి విన్యాసాలలో పాల్గొంటున్న భారత సైనిక దళం
Posted On:
19 JUN 2023 4:53PM by PIB Hyderabad
సుమారు 20 దేశాల సైనిక దళాలు, పరిశీలకుల భాగస్వామ్యంతో బహుళ దేశాల శాంతిపరిరక్షక ఉమ్మడి విన్యాసాలు ఎక్స్ ఖాన్ క్వెస్ట్ 2023 సోమవారం మంగోలియాలో ప్రారంభమయ్యాయి. మంగోలియాలోని విన్యాసాలు జరిగే ప్రాంతంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంగోలియా గౌరవ అధ్యక్షుడు శ్రీ ఉఖ్నాగీన్ ఖురేల్‌సుఖ్ ఈ విన్యాసాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంగోలియా ఆర్మడ్ ఫోర్సెస్ (ఎంఎఎఫ్- మంగోలియా సాయుధ దళాలు), యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ పసిఫిక్ కమాండ్ (యుఎస్ఎఆర్‌పిఎసి) కలిసి ప్రాయోజితులుగా ఉన్నాయి.
భారతీయ సైన్యానికి గఢ్‌వాల్ రైఫిల్స్ నుంచి వచ్చిన దళం ప్రాతినిధ్యం వహించింది.
ఇందులో పాల్గొంటున్న దేశాల పరస్పర కార్యనిర్వహణను పెంచడం, అనుభావాలను పంచుకోవడం, ఐక్యరాజ్య సమితి శాంతిపరిరక్షక కార్యకలాపాల (యుఎన్‌పికెఒ) దళాలకు శిక్షణ నివ్వడం ఈ 14 రోజుల విన్యాసాల లక్ష్యం. ఈ విన్యాసం భాగస్వాములు భవిష్యత్ ఐరాస శాంతి పరిరక్షక మిషన్‌లో పాల్గొనేందుకు సిద్ధం చేసేందుకు, శాంతి నిర్వహణ సామర్ధ్యాలను అభివృద్ధి చేయడం, సైనిక సంసిద్ధతను పెంచుకునేందుకు తయారు చేస్తాయి. ఈ విన్యాసాలలో కమాండ్ పోస్ట్ ఎక్సర్‌సైజ్ (సిపిఎక్స్), క్షేత్రస్థాయి శిక్షణా విన్యాసాలు (ఎఫ్‌టిఎక్స్), పోరాటంపై చర్చలు, ఉపన్యాసాలు ప్రదర్శనలు కూడా ఉంటాయి.
ఈ సైనిక విన్యాసాలు భారతీయ సైన్యం, పాలుపంచుకుంటున్న దేశాలు, ముఖ్యంగా మంగోలియా సాయుధదళాలతో రక్షణ సహకర స్థాయిని పెంచడం ద్వారా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందిస్తాయి.
****
(Release ID: 1933616)
Visitor Counter : 201