వ్యవసాయ మంత్రిత్వ శాఖ

వ్యవసాయం, రైతుల సంక్షేమం మంత్రిత్వ శాఖ కింద డిఏ & ఎఫ్డబ్ల్యూలో ప్లాంట్ ప్రొటెక్షన్ అండ్ క్వారంటైన్ డైరెక్టరేట్, ఆసియా పసిఫిక్ ప్లాంట్ ప్రొటెక్షన్ కమిషన్ (ఏపీపీపీసి-ఎఫ్ఏఓ) సంయుక్తంగా ముంబైలో జూన్ 19 నుండి 23 వరకు మామిడిపై కీటక నిర్వహణ కోసం అనుసరించాల్సిన వ్యూహంపై నిర్వహించనున్న కార్యశాల

Posted On: 19 JUN 2023 5:51PM by PIB Hyderabad
నవంబర్ 2022లో బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా మరియు పసిఫిక్ ప్లాంట్ ప్రొటెక్షన్ కమిషన్ ( (ఏపీపీపీసి) 32వ సెషన్‌లో ఆసియా పసిఫిక్ ప్లాంట్ ప్రొటెక్షన్ కమిషన్ 2023-24 ద్వైవార్షికానికి సమీకృత కీటక నిర్వహణ (ఐపీఎం) స్టాండింగ్ కమిటీ అధ్యక్ష స్థానానికి భారతదేశాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. దీని ప్రకారం, మామిడిపై పండ్ల పురుగుల నిర్వహణ కోసం సిస్టమ్స్ అప్రోచ్‌పై ఏపీపీపీసి వర్క్‌షాప్ జూన్ 19-23 మధ్య హోటల్ ఫార్చ్యూన్ సెలెక్ట్ ఎక్సోటికా, వాషి, నవీ ముంబైలో జరుగుతుంది.
 

వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ (పీపీ), ఏపీపీపీసి సెక్రటేరియట్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ డాక్టర్ యుబక్ ధోజ్ జి.సి, శ్రీ ఆశిష్ కుమార్ శ్రీవాస్తవ్ సమక్షంలో వర్క్‌షాప్‌ను వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి సహాయ మంత్రి శోభా కరంద్లాజే ప్రారంభించారు. శోభా కరంద్లాజే, ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ పొందడానికి చీడలు లేని, అవశేషాలు లేని పండ్లు కూరగాయల ఉత్పత్తిపై ఉద్ఘాటించారు, తద్వారా రైతు ఆదాయం పెరుగుతుంది. వసుధైవ కుటుంబం అనే భారతదేశ నినాదం వర్క్‌షాప్ ప్రయోజనం వ్యాప్తి చెందుతుందని 

ఏపీపీపీసి ఐపీఎం స్టాండింగ్ కమిటీ,  ప్లాంట్ ప్రొటెక్షన్ అడ్వైజర్ డాక్టర్ జేపీ సింగ్ తన స్వాగత ప్రసంగంలో రైతుల రిజిస్ట్రేషన్, రైతులు మంచి వ్యవసాయ పద్ధతులను అవలంబించడం, పెస్ట్ మానిటరింగ్, ప్రాసెసింగ్ అటాక్ హౌస్, ఫైటోసానిటరీ ద్వారా భారతదేశంలో సిస్టమ్స్ అప్రోచ్ అమలు ప్రయాణాన్ని వివరించారు. 

బంగ్లాదేశ్, ఇండోనేషియా, లావో, మలేషియా, నేపాల్, ఫిలిప్పీన్స్, సమోవా, శ్రీలంక, థాయ్‌లాండ్, వియత్నాం, భూటాన్‌ల నుండి భౌతికంగా వర్క్‌షాప్‌కు హాజరయ్యారు, మిగిలిన దేశాల నుండి వర్చ్యువల్ గా హాజరయ్యారు.

*****



(Release ID: 1933613) Visitor Counter : 132


Read this release in: Hindi , English , Urdu , Marathi