జల శక్తి మంత్రిత్వ శాఖ

సుస్థిర అభివృద్ధి కోసం రివర్ బేసిన్‌లు మరియు రిజర్వాయర్‌లలోని అవక్షేపాల(పూడిక) సమగ్ర నిర్వహణపై జాతీయ వర్క్‌షాప్


రిజర్వాయర్లు మరియు వాటి ఉపయోగకరమైన జీవితంపై ప్రభావాన్ని అంచనా వేయడానికి అవక్షేపణ రేట్లు అంచనా వేయాలి: జలవనరులశాఖ కార్యదర్శి

Posted On: 19 JUN 2023 6:12PM by PIB Hyderabad

జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ వాటర్ కమిషన్ ఈరోజు న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్‌లో ‘రివర్ బేసిన్‌లు మరియు రిజర్వాయర్ల సుస్థిర అభివృద్ధి, సమగ్ర నిర్వహణ’పై ఒక రోజు జాతీయ వర్క్‌షాప్‌ను నిర్వహించింది. సీడబ్ల్యూసీ చైర్మన్ శ్రీ కుష్వీందర్ వోహ్రా మరియు జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీమతి దేబశ్రీ ముఖర్జీ సమక్షంలో జలవనరులు, నది అభివృద్ధి మరియు గంగా పునరుజ్జీవనం (జలవనరుల శాఖ)  కార్యదర్శి శ్రీ పంకజ్ కుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.  వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు, అకాడమిక్ ఇన్‌స్టిట్యూట్‌లు మరియు డ్యామ్ పునరుద్ధరణ మరియు అభివృద్ధి ప్రాజెక్ట్ (డిఆర్‌ఐపి) ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీల నుండి 200 మందికి పైగా ప్రతినిధులు వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. రిజర్వాయర్‌లో  పూడికను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవడంతోపాటు దశలవారీగా అమలు చేసే చర్యలతో పాటు స్వల్ప మరియు దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని తీర్మానించారు.

సమావేశాన్ని ఉద్దేశించి, జలవనరులశాఖ కార్యదర్శి మాట్లాడుతూ...  రిజర్వాయర్‌లపై దాని ప్రభావాన్ని అంచనా వేయడానికి మరియు వాటి ఉపయోగకరమైన జీవితాన్ని అంచనా వేయడానికి అవక్షేపణ రేటును అంచనా వేయవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. వర్క్‌షాప్‌లోని చర్చలు రిజర్వాయర్లు మరియు నదులలో అవక్షేపణ (పూడిక) నిర్వహణ కోసం ఒక చర్యను రూపొందించడంలో రాష్ట్రాలకు మార్గనిర్దేశం చేయాలని ఆయన సూచించారు.  దేశంలో నీటి వనరుల మౌలిక సదుపాయాల కోసం అవక్షేపణకు సంబంధించిన నిర్దిష్ట సమస్యలను సెంట్రల్ వాటర్ కమిషన్  ఛైర్మన్  వివరించారు.  జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీమతి దేబశ్రీ ముఖర్జీ  మాట్లాడుతూ.. నదీ పరీవాహక ప్రాంతంలోని అవక్షేప(పూడిక) సమస్యలను అర్థంచేసుకోవడానికి బేసిన్ హెల్త్ సెడిమెంట్ స్థితిని సాధనంగా మార్చాలని ఆకాంక్షించారు.

నదులు, జలాశయాలు మరియు నీటి వనరులలో అవక్షేప(పూడిక) నిర్వహణ కోసం స్థిరమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడంలో సంబంధిత భాగస్వాములతో చర్చలు లక్ష్యంగా ఈ వర్క్‌షాప్ జరిగింది. ఈ సందర్భంగా..  అవక్షేప(పూడిక) నిర్వహణపై జాతీయ ఫ్రేమ్‌వర్క్, అవక్షేప అంచనా అధ్యయనాలు, నదీ స్వరూప ఆరోగ్య అంచనా కోసం జియోమోర్ఫోలాజికల్ టూల్స్ అప్లికేషన్, జాతీయ జలమార్గాల కోసం అవక్షేపణ నిర్వహణ, బేసిన్ స్కేల్ అసెస్‌మెంట్ కోసం మోడలింగ్ సాధనాలు, అవక్షేప భారాలు వంటి విస్తృత శ్రేణి అంశాలపై విషయ నిపుణులు వివరించారు.  రాజస్థాన్, కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు మరియు ఒడిశాలోని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ఈ అంశంపై  తమ అనుభవాన్ని పంచుకున్నాయి. సీడబ్ల్యూసీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ రూర్కీ, సీడబ్ల్యూపీఆర్ఎస్, ఎన్హెచ్పీసీ, డీవీసీ, పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ, ఎన్ఆర్ఎస్సీ వంటి కేంద్ర విభాగాలు, ఏజెన్సీలు మరియు విద్యాసంస్థలు తమ నైపుణ్యంపై ప్రదర్శనలు ఇచ్చాయి.

నేషనల్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ సెడిమెంట్ మేనేజ్‌మెంట్ (ఎన్ఎస్ఎఫ్ఎం) & డ్యామ్ సేఫ్టీ యాక్ట్-2021 మరియు రిజర్వాయర్‌లలో అవక్షేపణపై ప్రధాన ప్రెజెంటేషన్ల  ద్వారా ఈ అంశంపై చర్చలు జరిగాయి. నది మరియు రిజర్వాయర్‌లోని అవక్షేపాల నిర్వహణకు ఏకకాలంలో సమగ్ర ఫ్రేమ్‌వర్క్‌ను అందజేయడంతోపాటు, అవక్షేపణ, దాని పర్యావరణ ప్రభావం మరియు వివిధ క్లియరెన్స్ యొక్క చట్టబద్ధమైన అంశాలను కవర్ చేస్తుందని నేషనల్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ సెడిమెంట్ మేనేజ్‌మెంట్ (ఎన్ఎస్ఎఫ్ఎం) 2023లో  జలవనరులు, నది అభివృద్ధి మరియు గంగా పునరుజ్జీవనం (జలవనరుల శాఖ) ద్వారా నోటిఫై చేయబడింది.  డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 అనేది ఏదైనా కారణం వల్ల డ్యామ్ భద్రతపై ప్రభావం పడకుండా చూసే ఒక మైలురాయి చట్టం. ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ యాక్ట్‌ను వాస్తవంగా తీసుకువచ్చినందున, డ్యామ్‌లు మరియు దాని రిజర్వాయర్‌ల సురక్షిత పనితీరును నిర్ధారించడానికి మరియు ఆశించిన ప్రయోజనాలను పొందేందుకు రిజర్వాయర్ అవక్షేపణ (బాతిమెట్రిక్ సర్వేతో సహా) తీవ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్న అంశంపై చర్చించారు. దేశంలో కోల్పోయిన నిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరించడానికి ప్రామాణిక ప్రోటోకాల్‌ల ద్వారా పర్యవేక్షణ మరియు కొలతలు, అవక్షేప హాట్‌స్పాట్‌ల గుర్తింపు, ఇంటిగ్రేటెడ్ బేసిన్ లెవెల్ సెడిమెంట్ ఫ్లక్స్‌ల కోసం మోడలింగ్ మరియు అవక్షేప రేట్లను అంచనా వేయడం మరియు అవక్షేప నిర్వహణ ప్రణాళికను అనుసరించడం తప్పనిసరిగా అవసరమని పునరుద్ఘాటించబడింది.

వాటర్‌షెడ్ మేనేజ్‌మెంట్, క్యాచ్‌మెంట్ ఏరియా ట్రీట్‌మెంట్ వంటి వివిధ అవక్షేప నిర్వహణ పద్ధతులు, క్యాచ్‌మెంట్ నుండి అవక్షేపణను నిరోధించడం, ఇప్పటికే ఉన్న రిజర్వాయర్‌లలో అవక్షేపాలను నిర్వహించడానికి వివిధ పద్ధతులు.. అవి స్లూయిసింగ్, డ్రాడౌన్ ఫ్లషింగ్ మరియు పెద్ద సైజ్ డీప్ అవుట్‌లెట్‌లను అందించడం వంటివి అవసరాన్ని బట్టి అవలంబించవలసి ఉంటుంది. బేసిన్‌లోని క్యాస్కేడ్‌లోని ప్రాజెక్టులకు సమన్వయ మరియు సమకాలీకరించబడిన రిజర్వాయర్ ఆపరేషన్ మరియు అవక్షేప నిర్వహణ విధానం అవసరం.

రాజస్థాన్ మరియు కేరళ కూడా తమ రిజర్వాయర్లలో పూడిక తీసేందుకు రెవెన్యూ ఆధారిత నమూనాలను ప్రదరశించాయి. విస్తృతమైన ప్రీ-డిసిల్టేషన్ అధ్యయనాలపై చర్చించడంతోపాటు అందరినుంచి మన్ననలు అందుకున్నాయి. రిజర్వాయర్ల డీ-సిల్టేషన్ కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను వాటాదారులు అభివృద్ధి చేయాలి.

ఐఐటీ రూర్కీ,  ఐఐటీ కాన్పూర్ విద్యాసంస్థలు బాతిమెట్రిక్ సర్వేతో సహా అవక్షేపణ రేట్లు, వాల్యూమ్‌లు మరియు రిజర్వాయర్ కెపాసిటీని అంచనా వేయడానికి ఉపయోగించే కొత్త మరియు ఆధునిక పద్ధతుల గురించి వివరించాయి. ఉపగ్రహ రిమోట్ సెన్సింగ్; బాతిమెట్రీ మరియు రిమోట్ సెన్సింగ్ రెండింటినీ ఉపయోగించి హైబ్రిడ్ పద్ధతితోపాటు మరియు డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ (డీజీపీఎస్). అవక్షేప పరిమాణం మరియు నదుల స్వరూపంపై అవక్షేపం యొక్క ప్రభావాలను లెక్కించడానికి జియోమోర్ఫోలాజికల్ పారామితులను ఉపయోగించాలని సూచించాయి. పూడిక తీయడానికి నది ప్రతిస్పందనను అంచనా వేయడానికి మరియు నది స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి అవసరమైన ప్రాథమిక మరియు అనువర్తిత పరిశోధనలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. వివరణాత్మక సమగ్ర పరిశోధనలు మరియు మోడలింగ్ (2డీ న్యూమరికల్ అలాగే 3ఈ ఫిజికల్) జీఐఎస్ సాంకేతికతలను సమగ్రపరచడం అవక్షేప అంచనా మరియు నిర్వహణకు అవసరమని తెలిపాయి.

 

***



(Release ID: 1933606) Visitor Counter : 113


Read this release in: English , Urdu , Hindi , Tamil