విద్యుత్తు మంత్రిత్వ శాఖ

కేరళలో జలవిద్యుత్ సామర్థ్యాన్ని వేగవంతం చేయటానికి కేరళ విద్యుత్ బోర్డుకు ఎన్ హెచ్ పీసీ కన్సల్టెన్సీ సేవలు

Posted On: 17 JUN 2023 5:40PM by PIB Hyderabad

కేరళలో జలవిద్యుత్ సామర్థ్యాన్ని వేగవంతం చేయటానికి కేరళ విద్యుత్ బోర్డుకు  ఎన్ హెచ్ పీసీ కన్సల్టెన్సీ సేవలు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేరళ రాష్ట్ర విద్యుత్ బోర్డుకు, ఎన్ హెచ్ పీసీకి మధ్య ఒప్పందం కుదిరింది. ఈ అవగాహనా ఒప్పందం ప్రకారం  కేరళ విద్యుత్ బోర్డు ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రాజెక్టుల, చేపట్టబోయే ప్రాజెక్టుల  డిజైన్లను పరిశీలించటం, సవరణలు, సూచనలు చేయటం ఎన్ హెచ్ పీసీ బాధ్యత. ఒప్పందం కింద ఎన్ హెచ్ పీసీ, కేరళ  రాష్ట్ర విద్యుత్ బోర్డు ఆ రాష్ట్రంలో జల విద్యుత్ అవకాశాలను పరిశీలించి సాంకేతికంగా, వాణిజ్యపరంగా గిట్టుబాటయ్యేలా ఉత్పత్తిని వేగవంతం చేయటం, కాలుష్య రహిత విద్యుత్   ఉత్పత్తి చేయటం ఇందులో కీలకం.

ఈ అవగాహనా ఒప్పందం మీద ఎన్ హెచ్ పీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (వ్యూహాత్మక వ్యాపారాభివృద్ధి, కన్సల్టెన్సీ) రజత గుప్తా, కేరళ రాష్ట్ర విద్యుత్ బోర్డు డైరెక్టర్  ( ఉత్పత్తి -సివిల్) జి. రాధాకృష్ణన్ 2023 జూన్ 16 న సంతకం చేశారు.

ఈ ఒప్పందం సంతకానికి ముందు కేరళ రాష్ట్ర విద్యుత్ బోర్డు ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్  ఒక జరిగిన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎన్ హెచ్ పీసీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ కె విష్ణోయ్ ని అభినందించారు. తమ విద్యుత్ బోర్డుతో చేతులు కలిపినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్ హెచ్ పీసీ సాంకేతిక నైపుణ్యం తమకు ఉపయోగపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.  

***



(Release ID: 1933237) Visitor Counter : 136


Read this release in: English , Urdu , Hindi , Marathi