పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
ప్రకృతి వైపరీత్యాలు, విపత్తుల నుంచి భూమిని కాపాడేందుకు పర్యావరణ అనుకూల జీవనశైలిని అవలంబించాలని పిలుపిచ్చిన శ్రీ అశ్విని కుమార్ చౌబే
Posted On:
17 JUN 2023 4:32PM by PIB Hyderabad
చిత్తడి/ మాగాణి నేలలను కాపాడడంలో భాగంగా శనివారం బీహార్‌లోని బక్సర్‌లో పర్యావరణం, అడవులు & వాతావరణ మార్పు (ఎంఇఎఫ్‌సిసి) మిషన్ లైఫ్ పై ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం 08 జూన్ 2023న బక్సర్‌లోని గోకుల్ జలాశయంలో నిర్వహించిన మాగాణి భూములను కాపాడాలన్న ప్రచారానికి కొనసాగింపు. మంత్రిత్వ శాఖ పర్యావరణ సమాచారం, చైతన్యం, సామర్ధ్య నిర్మాణం & ఉపాధి కార్యక్రమం (ఇఐఎసిపి) పాట్నాలోని ఎడిఆర్ఐ కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే రోజంతా జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లైఫెథాన్ రన్‌తో ప్రారంభమై, లైఫ్ (LiFE) పై ప్రదర్శన ప్రారంభించి, లైఫెథాన్‌లో మూడు వర్గాలు వరుసగా, 12 కీమీలు, 7 కిమీలు, 5 కిమీల పరుగులో విజేతలైన బాల, బాలికలను సత్కరించారు. ఎంఇఎఫ్‌సిసి సంయుక్త కార్యదర్శి డాక్టర్ సుజీత్ కుమార్ బాజ్‌పాయ్, రాష్ట్ర చిత్తడినేలల/ మాగాణి ప్రాధికారసంస్థ (ఎస్‌డబ్ల్యుఎ) మెంబర్ సెక్రటరీ శ్రీ ఎస్‌హెచ్ సురేంద్ర సింగ్, బీహార్ ఎస్‌పిసిబి మెంబర్ సెక్రెటరీ శ్రీ చంద్రశేఖర్ రావు, భోజ్‌పూర్ డిఎఫ్ఒ శ్రీ ఎం. రాజ్‌కుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మిషన్ లైఫ్, మాగాణి భూములపై ప్రత్యేక దృష్టితో పర్యావరణం పట్ల చైతన్యం, పరిరక్షణకు కృషి చేయాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో బీహార్‌లోని భిన్న ప్రాంతాలకు చెందిన దాదాపు 550మంది బాలబాలికలు లైఫెథాన్ రన్ కోసం నమోదు చేసుకోగా, అది విజయవంతంగా ముగిసింది. అలాగే, లైఫ్ పై ప్రదర్శన అస్సాం, బీహార్, ఝార్ఖండ్, సిక్కిం, ఉత్తరాఖండ్, ఢిల్లీ సహా ఆరు రాష్ట్రాలలో గల ఇఐఎసిపి కేంద్రాల నుంచి లైఫ్ ప్రదర్శనలో పాలు పంచుకున్నారు. వారు మంత్రిత్వ శాఖ చేపట్టిన గ్రీన్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (జిఎస్‌డిపి- హరిత నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమం)లో భాగంగా అభివృద్ధి చేసిన ఉత్పత్తులను ప్రదర్శించారు. పైన పేర్కొన్నవి కాక, జెడ్ఎస్ఐ, బిఎస్‌పిసిబి. బిఐఎస్, బీహార్ జీవిక, భోజ్‌పుర్ అటవీ డివిజన్ కూడా తమ స్టాళ్ళను ఏర్పాటు చేశారు. ప్రదర్శనను ప్రారంభించిన తర్వాత, శ్రీ చౌబే ప్రతి స్టాల్‌ను ప్రత్యేకంగా సందర్శించి, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్రారంభించిన మిషన్ లైఫ్ పై వాస్తవ చర్యతీసుకున్న భాగస్వాములందరినీ అభినందించారు. ప్రదర్శనకు హాజరైన వారికి, సందర్శకులకు వినూత్న పరిష్కారాలు, వెదురు హస్తకళలు, వెదురుతో చేసిన నీటి సీసాలు మొదలైన పర్యావరణ అనుకూల ఉత్పత్తులను అన్వేషించడానికి అవకాశం కల్పించింది.
ప్రదర్శనకు సచేతనతను జోడిస్తూ, ఆకట్టుకునే నుక్కడ్ నాటకాన్ని శక్తిమంతమైన ప్రదర్శనతో ప్రేక్షకుల ఎదుట ప్రదర్శించారు. చిత్తడి/ మాగాణి నేలల ప్రాముఖ్యతను, వాటిని కాపాడి, సంరక్షించవలసిన తక్షణ ఆవశ్యకతను గురించి అవగాహనను ఈ నాటకం పెంచింది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, అనేక కారణాల వల్ల చిత్తడి నేలలు అత్యంత ముఖ్యమైనవని పేర్కొన్నారు. ఈ చిత్తడి భూముల సాంస్కృతిక, చారిత్రిక, సామాజిక ప్రాముఖ్యతను గురించి ప్రస్తావిస్తూ, ఈ చిత్తడి భూములను కాపాడేందుకు పాల్గొన్నవారందరినీ ఉమ్మడిగా కలిసి పని చేయవలసిందిగా కోరారు. పెరుగుతున్న తుపానుల సంఖ్యను, 10 ఏళ్ళ కిందట ఇదే రోజున మన సన్నిహితులు సహా అనేక మంది ప్రాణాలు కోల్పోయిన కేదార్‌నాథ్‌లో చోటు చేసుకున్న విషాదాన్ని ప్రస్తావిస్తూ, ఆ మరువలేని ఘటనలో కుటుంబ సభ్యులను కోల్పోయిన కుటుంబాలకు హృదయపూర్వక సంతాపాన్ని తెలిపారు. ప్రకృతి, ప్రగతి చేయి చేయి కలిపి నడవాలని, అటువంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి భూమిని కాపాడడంలో ప్రతి వ్యక్తి చేసే కృషి ముఖ్యమని శ్రీ చౌబే ఉద్ఘాటించారు. తెల్లవారు జామునే లైఫెథాన్ లో పెద్ద సంఖ్యలో వచ్చి పాల్గొన్న బక్సర్ యువతను ప్రశంసిస్తూ, వారికి పర్యావరణ ప్రహారీ అని నామకరణం చేశారు. ఇంత మంది బాలికలు, యువతులు లైఫెథాన్ కార్యక్రమంలో పాలుపంచుకున్నందుకు హర్షాన్ని వ్యక్తం చేస్తూ, ఈ యువ భాగస్వాములు మిషన్ లైఫ్, మత్తడి నేలల పరిరక్షణ హేతువు కోసం పని చేసేందుకు బక్సర్‌లోని ఇతర వ్యక్తులను సున్నితపరుస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
మత్తిడి భూములు. ఎన్‌పిసిఎ పథకాన్ని, అమృత్ దరోహర్ కార్యక్రమం ప్రాముఖ్యతను పట్టి చూపుతూ, సంయుక్త కార్యదర్శి డాక్టర్ సుజీత్ కుమార్ బాజ్‌పేయి ప్రధాన ప్రసంగం చేశారు. బీహార్‌లో అనేక చిత్తడి నేలలు ఉన్నాయంటూ, వాటికి రామ్‌సార్ ప్రాంతాలుగా గుర్తించేందుకు సంభావ్యత ఉందని పేర్కొంటూ, రాష్ట్ర మత్తిడి నేలల పరిరక్షణ ప్రచారం నుంచి ప్రతిపాదనలు అందిన తర్వాత మంత్రిత్వ శాఖ త్వరితగతిన పరిశీలిస్తుందని డాక్టర్ బాజ్‌పేయి హామీ ఇచ్చారు.
లైఫ్ ఆధారిత అల్పాహార అనుభవంలో భాగంగా, పాల్గొన్నవారికి సేంద్రీయ, స్థిరమైన ఆహార ఎంపికలను అందించడం ద్వారా పర్యావరణ అనుకూల ఆహార ఎంపికలు, స్థిరమైన ఆహార ప్రత్యామ్నాయాలు, బాధ్యతాయుత వినియోగం ప్రయోజనాలను ప్రదర్శించారు. పాల్గొన్నవారి చేత శ్రీ అశ్విని కుమార్ చౌబే లైఫ్ ప్రతిజ్ఞ చేయించిన అనంతరం కార్యక్రమం ముగిసింది.
***
(Release ID: 1933133)
Visitor Counter : 174