భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
భారతీయ పాడి పరిశ్రమ కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన "దుగ్ద్ సంకలన్ సతి మొబైల్ యాప్"ని ప్రారంభించిన కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి డాక్టర్ .మహేంద్ర నాథ్ పాండే
పాల ఉత్పత్తి ప్రక్రియను డిజిటీకరణ చేసి పాల ఉత్పత్తిదారులకు నేరుగా ప్రయోజనం కలిగించడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యల్లో యాప్ అభివృద్ధి ఒక విప్లవాత్మక అడుగు డాక్టర్ మహేంద్ర నాథ్ పాండే
యాప్ సహాయంతో పాల నాణ్యతను ఎక్కువ చేయడం, పారదర్శకతతో కార్యకలాపాల నిర్వహణ, పాల సహకార సంఘాలతో సహా అట్టడుగు గ్రామ స్థాయిలో కార్యకలాపాల క్రమబద్దీకరణ కార్యక్రమాలు అమలు... డాక్టర్ .మహేంద్ర నాథ్ పాండే
Posted On:
16 JUN 2023 7:05PM by PIB Hyderabad
పాడి పరిశ్రమ కోసం రాజస్థాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ లిమిటెడ్, జైపూర్ అభివృద్ధి చేసిన "దుగ్ద్ సనకలన్ సతీ మొబైల్ యాప్"ని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి డాక్టర్ మహేంద్ర నాథ్ పాండే ఈ రోజు ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో ఆవిష్కరించారు. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న రాజస్థాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ లిమిటెడ్ "మినీ రత్న" ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తింపు పొందింది.రాజస్థాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ లిమిటెడ్ రూపొందించి, అభివృద్ధి చేసిన యాప్ భారతీయ పాడి పరిశ్రమపై శాశ్వత ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు అంటున్నారు. పాల నాణ్యతను ఎక్కువ చేయడం, పారదర్శకతతో కార్యకలాపాల నిర్వహణ, పాల సహకార సంఘాలతో సహా అట్టడుగు గ్రామ స్థాయిలో కార్యకలాపాల క్రమబద్దీకరణ చేయడానికి వీలుగా యాప్ ను అభివృద్ధి చేశారు. పల సేకరణలో ఎదురవుతున్న సమస్యలు యాప్ తో పరిష్కారం అవుతాయి.
యాప్ ను ఆవిష్కరించిన తర్వాత మాట్లాడిన డాక్టర్ మహేంద్ర నాథ్ పాండే "పాల ఉత్పత్తి ప్రక్రియను డిజిటీకరణ చేసి పాల ఉత్పత్తిదారులకు నేరుగా ప్రయోజనం కలిగించడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యల్లో యాప్ అభివృద్ధి ఒక విప్లవాత్మక అడుగు " అని అన్నారు. యాప్ ను అభివృద్ధి చేసిన రాజస్థాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ లిమిటెడ్ "మినీ రత్న" ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తింపు పొందింది.రాజస్థాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ ను అభినందించిన మంత్రి 'దుగ్ద్ సంకలన్ సతీ మొబైల్ యాప్' పాల సేకరణ ప్రక్రియలో సంబంధం ఉన్న అన్ని వర్గాల మధ్య పారదర్శకతతో కార్యకలాపాలు జరగడానికి , సామర్థ్యం మెరుగు పరచడానికి, సాధికారత కల్పించడానికి సహకరిస్తుందని అన్నారు. పాల ఉత్పత్తిదారులకు ప్రయోజనం కలిగించి పాడి పరిశ్రమ వృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. పాల ఉత్పత్తిదారులు, పాల సహకార సంఘాలు, పాల సంస్థలు , రాష్ట్ర సమాఖ్యల తో సహా అన్ని భాగస్వామ్య వర్గాలతో అట్టడుగు స్థాయిలో కార్యకలాపాలను మెరుగుపరచడానికి యాప్ ఉపకరిస్తుందని ఆయన అన్నారు. పాల సేకరణ సంబంధించిన అన్ని అంశాలను 'దుగ్ద్ సంకలన్ సతీ మొబైల్ యాప్' పాల ఉత్పత్తిదారులకు ఇంగ్లీష్, హిందీ, పంజాబీ, తెలుగు మరియు ఇతర భాషలలో అందిస్తుంది.
పాడి పరిశ్రమ అభివృద్ధిలో కీలకంగా ఉండే అంశాలపై అధ్యయనం చేసిన రాజస్థాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ సమయాలు గుర్తించి, సమస్యల పరిష్కారానికి తాజా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి 'దుగ్ద్ సంకలన్ సతీ మొబైల్ యాప్' ను అభివృద్ధి చేసింది. పాల సేకరణ ప్రక్రియలను డిజిటలైజ్ చేయడం, పాల ఉత్పత్తిదారులకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు నేరుగా లబ్ధిదారులకు బదిలీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యల్లో భాగంగా యాప్ ను అభివృద్ధి చేశారు.
యాప్ ను అభివృద్ధి చేసి రూపొందించిన రాజస్థాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ ను భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శిశ్రీ కమ్రాన్ రిజ్వీ అభినందించారు. ఈ మొబైల్ యాప్ దేశంలో డెయిరీ అభివృద్ధికి, పాల ఉత్పత్తిదారులకు విశ్వాసాన్ని, ఉత్సాహాన్ని అందిస్తుందని అన్నారు. ఈ మొబైల్ యాప్‌ను ఉపయోగించడం ద్వారా డెయిరీ వ్యాపారంలో పారదర్శకత మెరుగు పడుతుంది అని ఆయన అన్నారు.
పాల ఉత్పత్తిదారులు, సహకార సంఘాలు, పాల సంఘాల రాష్ట్ర సమాఖ్యలతో సహా పాల సేకరణ ప్రక్రియలో భాగస్వామ్యం ఉన్న వారందరికీ "దుగ్ద్ సంకలన్ సతీ మొబైల్ యాప్" గణనీయమైన ప్రయోజనాలు అందిస్తుంది. యాప్ ముఖ్య లక్షణాలు, కలిగే ప్రయోజనాలు:
* అన్ని వర్గాల మధ్య పారదర్శకత పెరుగుతుంది.
* సహకార పాల సంగాల ద్వారా సేకరించిన పాలుపై ఆన్‌లైన్ పర్యవేక్షణ
* క్లౌడ్ సర్వర్ ద్వారా పాల ధరలకు సంబంధించి తాజా సమాచారం అందుతుంది. పారదర్శకతకు భరోసా కల్పించి, మానవ లోపాలు తొలగింపు
* యాప్ ద్వారా పాల ఉత్పత్తిదారుల బ్యాంకు ఖాతాలకు పాల చెల్లింపు , ప్రభుత్వ సబ్సిడీ నేరుగా లబ్ధిదారులకు బదిలీ
*పాల సేకరణ కు సంబంధించిన తాజా సమాచారం
*ఇంగ్లీష్, హిందీ, పంజాబీ, తెలుగు లాంటి భాషల్లో యాప్ అందుబాటు
"దుగ్ద్ సనకలన్ సతీ మొబైల్ యాప్" విజయవంతం చేయడానికి అన్ని చర్యలు అమలు చేస్తామని రాజస్థాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రాకేష్ చోప్రా తెలిపారు. యాప్ అభివృద్ధికి సహకరించిన కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి, కార్యదర్శి, మంత్రిత్వ శాఖలోని ఇతర సీనియర్ అధికారులకు శ్రీ రాకేష్ చోప్రా కృతజ్ఞతలు తెలిపారు. రాజస్థాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ 43వ స్థాపన దినోత్సవం సందర్భంగా వాటాదారుల అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
*****
(Release ID: 1933061)
Visitor Counter : 172