ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ పై ఇంటర్ సెక్టోరల్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి


ఎఎంఆర్ పై ఏకీకృత చర్య ముఖ్యమైన చొరవగా గుర్తింపు

ఎఎంఆర్ పై నేషనల్ యాక్షన్ ప్లాన్
(ఎన్ ఎ పి) అభ్యాసాలతో
ఎన్ ఎ పి 2.0 కు మార్గనిర్దేశం

Posted On: 15 JUN 2023 6:54PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్ అధ్యక్షతన జరిగిన యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ పై ఇంటర్ సెక్టోరల్ కోఆర్డినేషన్ కమిటీలో జాతీయ కార్యాచరణ ప్రణాళిక అమలు స్థితిగతులపై చర్చించారు.

 

దేశంలో పెరుగుతున్న ఎఎంఆర్ ముప్పును పరిష్కరించడానికి సమన్వయ బహుళ పార్టీల చర్యల ప్రాముఖ్యతను కేంద్ర ఆరోగ్య కార్యదర్శి వివరించారు. "ఎఎమ్ఆర్ ను సరళ లేదా ఒక్కరుగా ఎదుర్కోలేము” అని స్పష్టం చేశారు.

సమస్యలు , కార్యాచరణ అంశాలు ప్రభుత్వ ,ప్రభుత్వేతర రంగాలలో బహుళ-ఏజెన్సీలుగా ఉన్నందున, వాటిని పరిష్కరించే కార్యాచరణ ప్రణాళికకు ఏకీకృత మిషన్ మోడ్ విధానం ద్వారా భాగస్వాములందరి ఉమ్మడి ప్రయత్నాలు అవసరం " అన్నారు. భాగస్వామ్య మంత్రిత్వ శాఖలు/ విభాగాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించగల కీలక పనితీరు సూచికలతో కూడిన సమగ్ర కార్యాచరణ ప్రణాళిక కోసం నైపుణ్యం,  డొమైన్ పరిజ్ఞానాన్ని ఏకతాటిపైకి తీసుకురావడానికి మొత్తం ప్రభుత్వ విధానంతో ఏకీకృత పద్ధతిలో పనిచేయాలని ఆయన కోరారు. భాగస్వామ్య మంత్రిత్వ శాఖలు/ విభాగాల ప్రతినిధులు ఎ ఎం ఆర్ నివారణ, నియంత్రణ దిశగా తాము తీసుకున్న చర్యలను వివరించారు.

 

ఇంటర్ సెక్టోరల్ కోఆర్డినేషన్ కమిటీ ఆన్ ఎఎంఆర్ (ఐ ఎస్ సి సి - ఎఎంఆర్) అనేది డిపార్ట్ మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) , పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, మత్స్యశాఖ; డిపార్ట్ మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ; సీఎస్ఐఆర్; సి డి ఎస్ సి ఒ, ఎఫ్ఎస్ఎస్ఎఐ, ఆయుష్, ఎన్ఎంసి , డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్), ఎంఒహెచ్ ఎఫ్ డబ్ల్యూ ; పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, మత్స్యశాఖ; మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ,మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ ఛేంజ్.భాగస్వామ్యంతో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అధ్యక్షతన ఏర్పడిన ఉన్నత స్థాయి కమిటీ;

 

భారత ప్రభుత్వం తన జాతీయ ఆరోగ్య విధానం, 2017లో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఎఎంఆర్)ను కీలక ప్రాధాన్యతగా గుర్తించిందని, ఏప్రిల్ 2017లో ఎఎంఆర్ నియంత్రణ కోసం భారత జాతీయ కార్యాచరణ ప్రణాళిక (ఎన్ఏపీ-ఏఎంఆర్)ను విడుదల చేసిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ లవ్ అగర్వాల్ తెలిపారు. ఎఎంఆర్ కట్టడికి తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ, ఎన్ఏపీ-ఏఎంఆర్ ను ప్రారంభించిన సందర్భంగా ఏఎంఆర్ ఢిల్లీ డిక్లరేషన్ పై సంతకాలు చేశారు. భారతదేశ జి 20 హెల్త్ వర్కింగ్ గ్రూప్ మూడు ప్రధాన ప్రాధాన్యతలలో ఎఎంఆర్ కూడా ఒకటి, ఇది ప్రపంచ స్థాయిలో దాని ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది.

 

ఎన్ఏపీ- ఎఎంఆర్ లో భాగంగా వివిధ వ్యూహాత్మక ప్రాధాన్యాల కింద తీసుకున్న చర్యలపై సమావేశంలో చర్చించారు.

కమ్యూనికేషన్ ,ఐఇసి కార్యకలాపాల ద్వారా ప్రజలలో చైతన్యం, అవగాహనను పెంచడం ఎన్ ఎ పి- ఎ ఎం ఆర్ వ్యూహాత్మక లక్ష్యాలు. నేషనల్ ఎఎంఆర్ సర్వైలెన్స్ నెట్వర్క్ (నార్స్-నెట్), రాష్ట్ర నిఘా నెట్ వర్క్ ల ద్వారా మానవ, జంతు, పర్యావరణంలో ఎ ఎం ఆర్ పై నిఘా పెంచడం ద్వారా పరిజ్ఞానం, సాక్ష్యాలను పెంచాల్సి ఉంటుంది. మూడవ వ్యూహాత్మక లక్ష్యం ఇన్ ఫెక్షన్ నివారణ , నియంత్రణ. ఈ దిశగా, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలలో ఇన్ ఫెక్షన్ నివారణ, నియంత్రణ కోసం జాతీయ మార్గదర్శకాలను 2020 జనవరిలో జారీ చేశారు. యాంటీ మైక్రోబియల్ స్టీవార్డ్ షిప్ అనేది ఎన్ ఎ పి - ఎ ఎం ఆర్ నాల్గవ వ్యూహాత్మక లక్ష్యం. ఐదవ లక్ష్యం కొత్త మందులు , సాంకేతికతలలో సృజనాత్మక పరిశోధన , అభివృద్ధిని తీసుకురావడం.  ఇక జాతీయ, ఉప-జాతీయ , అంతర్జాతీయ సహకారం ఎన్ఎపి-ఎఎమ్ఆర్ ఆరవ, చివరి వ్యూహాత్మక లక్ష్యం.

 

జాతీయ ఐపిసి కార్యక్రమాన్ని రూపొందించడానికి ఎన్ సిడిసి లో ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ (ఐపిసి) యూనిట్ ను ఏర్పాటు చేయడం,  ఇతర వర్టికల్ హెల్త్ ప్రోగ్రామ్ ల కింద ఐపిసితో అనుసంధానం, యాంటీమైక్రోబయల్ వినియోగంపై జాతీయ,  రాష్ట్ర స్థాయి డేటాను సేకరించడానికి , క్రోడీకరించడానికి ఒక డిజిటల్ వేదికను అభివృద్ధి చేయాల్సిన అవసరం గురించి,  మానవ, జంతు, పర్యావరణ ,ఆహార రంగాన్ని సరిగ్గా ఏకీకృతం చేయాల్సిన అవసరం సహా కొనసాగుతున్న చొరవ గురించి, ఎఎంఆర్ పై రాష్ట్ర నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికల రూపకల్పన, ఎఎంఆర్ పై సమగ్ర పరిశోధన ఎజెండాను అభివృద్ధి చేయడానికి పరిశోధనా సంస్థల భాగస్వామ్యంపై దృష్టి సారించడం.

గురించి సమావేశంలో చర్చించారు.

 

ప్రస్తుతం కొనసాగుతున్న ఎన్ ఎ పి పి-. ఎఎంఆర్ అమలు నుంచి నేర్చుకున్న పాఠాల ఆధారంగా, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎఎంఆర్ 2.0 పై జాతీయ కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని నిర్ణయించారు, తద్వారా ఎఎంఆర్ నియంత్రణ దిశగా సమిష్టి ప్రయత్నాలను బలోపేతం చేయవచ్చు.

 

****



(Release ID: 1932732) Visitor Counter : 169