ఆర్థిక మంత్రిత్వ శాఖ

పి.పి.పి.ఐ.ఎన్.ఐ.ఎన్.డి.ఐ.ఏ. కోసం వెబ్‌-సైట్‌ తో పాటు, భారత మౌలిక సదుపాయాల ప్రాజెక్టు అభివృద్ధి నిధుల పథకం (ఐ.ఐ.పి.డి.ఎఫ్) కోసం, మౌలిక సదుపాయాలలో అత్యుత్తమ అభ్యాసాలకోసం ఆన్‌-లైన్ పోర్టళ్ళను, మౌలిక సదుపాయాల ఆర్థిక సచివాలయం (ఐ.ఎఫ్.ఎస్)., డి.ఈ.ఏ. ప్రారంభించింది

Posted On: 14 JUN 2023 6:45PM by PIB Hyderabad

మౌలిక సదుపాయాల ఆర్థిక సచివాలయం (ఐ.ఎఫ్.ఎస్) తమ మౌలిక సదుపాయాల విభాగంలో ప్రైవేట్ పెట్టుబడులను ప్రారంభించే కృషిలో భాగంగా, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సరఫరాకు ఉపయోగపడే పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి వీలుగా ప్రయత్నాలను నిరంతరం పరిచయం చేస్తోంది.

 ప్రయత్నంలో భాగంగాతన వెబ్-సైట్ www.pppinindia.gov.in ని పి.పి.పిప్రాజెక్టుల్లో పాల్గొనే వాటాదారులు మరింత మెరుగ్గా వినియోగించుకోడానికి వీలుగా .ఎఫ్.ఎస్. పునరుద్ధరించింది.  పి.పి.పి.ఐ.ఎన్.ఐ.ఎన్.డి.ఐ.ఏ. అనేది భారతదేశంలో  ప్రభుత్వ-ప్రయివేటు భాగస్వామ్యాలను ప్రోత్సహించడంతో పాటు, సులభతరం చేయడానికి అంకితమైన వెబ్‌సైట్.  అదేవిధంగా, ఇది ప్రభుత్వ-ప్రయివేటు రంగాల మధ్య అంతరాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.  ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు కంపెనీలు, పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులను కలిసి స్థిరమైన వృద్ధి కోసం సహకారం, ఆవిష్కరణలను ప్రోత్సహించే డిజిటల్ ప్లాట్‌-ఫారమ్‌ గా ఈ వెబ్‌ సైట్  పనిచేస్తుంది.   ఈ పునరుద్ధరించబడిన వెబ్‌-సైట్ ద్వారా, భాగస్వామ్యాన్ని పెంపొందించే, పెట్టుబడిని ప్రోత్సహించే, జ్ఞానం, వనరుల మార్పిడిని సులభతరం చేసే శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థను సృష్టించడం ఐ.ఎఫ్.ఎస్. లక్ష్యం.

విధానాలు, మార్గదర్శకాలు, వివిధ రంగాలకు సంబంధించిన నమూనా రాయితీ ఒప్పందాలు, మార్గదర్శక అంశాలు, సూచన పత్రాలు మొదలైన వాటితో సహా నమూనా బిడ్డింగ్ పత్రాలను సులభంగా అందుబాటులో ఉంచే రిపోజిటరీ గా ఈ పునరుద్ధరించబడిన వెబ్‌సైట్ పని చేస్తుంది.   అదేవిధంగా, రాష్ట్ర పి.పి.పియూనిట్ల ఏర్పాటు కోసం కొత్తగా ప్రారంభించబడిన రిఫరెన్స్ గైడ్ తో సహా,  పి.పి.పి.   విధానం, ప్రోగ్రామ్, ప్రాజెక్ట్‌లను ప్రోత్సహించడానికి రాష్ట్రాలు ప్రత్యేక యూనిట్లను రూపొందించడంలో,  పి.పి.పి. ప్రోజెక్టుల నాణ్యతా మదింపులో ప్రాజెక్టు అప్రైజల్ అథారిటీలకు (పి.ఎస్.ఏ. లు) సహాయపడే పి.పి.పిప్రాజెక్టు అప్రైజల్  కోసం రిఫరెన్స్ గైడ్ గా కూడా ఈ పునరుద్ధరించబడిన ఈ వెబ్‌-సైట్ సహాయపడుతుంది. వివిధ రంగాలలో  పి.పి.పి. ప్రోజెక్టుల  రెండు వందలకు పైగా అమలు చేయబడిన రాయితీ ఒప్పందాలను ఈ వెబ్‌ సైట్ లో పొందుపరచడం జరిగింది.  ఈ వెబ్‌ సైట్ పి.పి.పి. టూల్‌ కిట్‌ లను కూడా కలిగి ఉంటుంది. ఇవి మౌలిక సదుపాయాల పి.పి.పి. ల కోసం నిర్ణయం తీసుకోవడాన్ని మెరుగుపరచడానికి రూపొందించబడిన వెబ్ ఆధారిత వనరులుగా ఉపయోగపడతాయి. 

భారత ప్రభుత్వ డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రోత్సహించడానికి, ఐ.ఐ.పి.డి.ఎఫ్. పథకం కింద పరిశీలన కోసం దరఖాస్తులను సమర్పించడానికి ..పి.డి.ఎఫ్. పోర్టల్‌ ను ఐ.ఎఫ్.ఎస్. ప్రారంభించింది.  ఐ.ఐ.పి.డి.ఎఫ్. పథకం కింద ఆన్‌-లైన్‌ లో దరఖాస్తు చేసుకోవడానికి స్పాన్సరింగ్ అథారిటీని ఈ ఆన్‌-లైన్ పోర్టల్ అనుమతిస్తుంది. ప్రాసెసింగ్ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.  తక్కువ వ్రాతపని ఉంటుంది.  పి.ఎస్.ఏ. లు సమర్పించిన ప్రాజెక్టులు వేగంగా, సమయానుకూలంగా ఆమోదం పొందడానికి ఇది సహాయపడుతుంది.  ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య అప్రైజల్ కమిటీ తో పాటు, వి.జి.ఎఫ్. పధకం కోసం ఆన్‌-లైన్ దరఖాస్తులను సమర్పించడం కోసం ఈ వెబ్‌-సైట్‌ లో ఇదేవిధమైన ఆన్‌-లైన్ పోర్టళ్ల ను ప్రారంభించే ప్రక్రియలో ఐ.ఎఫ్.ఎస్. ఉంది.

వీటికి అదనంగా, పునరుద్ధరించబడిన ఈ వెబ్‌-సైట్ ఉత్తమ అభ్యాసాల పోర్టల్ ను కూడా కలిగి ఉంటుంది. ఇది రాష్ట్రాలు, కేంద్ర మంత్రిత్వ శాఖల ద్వారా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను విజయవంతంగా అమలు చేయడంలో ఉత్తమ పద్ధతులను కలిగి ఉంటుంది.  వీటితో పాటు, ప్రాజెక్టు అమలు, కీలక సవాళ్లు, విజయ కారకాలు, ఫలితాలు, ప్రభావాల పరంగా అత్యుత్తమ అభ్యాసాలను గుర్తించడం జరుగుతుంది.  గుర్తించిన అనేక ఉత్తమ అభ్యాసాలతో దీన్ని ప్రారంభించడం జరిగింది.  రాష్ట్రాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు పరస్పర జ్ఞాన మార్పిడి, విస్తృత అమలు కోసం తమ ఉత్తమ పద్ధతులను ఇందులో పొందుపరచవచ్చు, ప్రదర్శించవచ్చు.  ఇందుకోసం, ఉత్తమ అభ్యాసాల పోర్టల్‌  Home-Public Private Partneships in India

 

ను వినియోగించుకోవచ్చు. 

పి.పి.పి. ప్రాజెక్టుల డేటాబేస్,  పి.పి.పి. నాలెడ్జ్ హబ్, రాబోయే పి.పి.పి. కార్యక్రమాల వివరాలు, వర్క్‌ షాప్‌ లు, ఫోరమ్‌ ల వంటి అన్ని అంశాలకు ఒకే చోట పరిష్కారం లభించే విధంగా, ఈ పునరుద్ధరించబడిన వెబ్‌-సైట్, దాని మెరుగైన వాడుకలో సౌలభ్యం, సమాచార వివరాలతో, ఇది ఒక సమగ్ర వెబ్‌-సైట్‌ గా ఉపయోగపడుతుంది.  దీని ద్వారా కీలక వాటాదారులు ఒకచోట చేరవచ్చు, భాగస్వామ్యాలను ఏర్పరచుకోవచ్చు. 

 

 

*****

 (Release ID: 1932731) Visitor Counter : 124


Read this release in: English , Urdu , Hindi