వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

కందిపప్పు, మినపప్పు ధరలను నిరంతరం పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరిన కేంద్రం; నిల్వల స్థితిని తనిఖీ చేయాలని, నిల్వ పరిమితి ఆదేశాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం


కందిపప్పు, మినపప్పు నిల్వల వెల్లడిని సమీక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారుల సమావేశానికి అధ్యక్షత వహించిన డిఓసిఎ అదనపు కార్యదర్శి

Posted On: 14 JUN 2023 6:52PM by PIB Hyderabad

వినియోగదారుల వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి నిధి ఖరే 2023 జూన్ 14 న రాష్ట్ర ఆహార , పౌర సరఫరాల శాఖలు, కేంద్ర గిడ్డంగుల కార్పొరేషన్ (సిడబ్ల్యుసి) , రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ (ఎస్ డబ్ల్యుసి) ల అధికారులతో కందిపప్పు , మినపపప్పు నిల్వల పరిస్థితిని, రాష్ట్ర ప్రభుత్వాలు నిల్వ పరిమితుల ఉత్తర్వుల అమలు తీరును సమీక్షించారు.

 

అక్రమంగా నిల్వచేయడాన్ని, ధరలపై అనైతిక ఊహాగానాలను నియంత్రించ డానికి, వినియోగదారులకు స్థోమతను మెరుగుపరచడానికి వినియోగదారుల వ్యవహారాల శాఖ 2023 జూన్ 2 న నిత్యావసర వస్తువుల చట్టం, 1955 కింద కందిపప్పు , మినపప్పు నిల్వల పై పరిమితులను విధించింది.

 

రిటైల్ ధరలు, వివిధ స్టాక్ హోల్డింగ్ సంస్థలు వెల్లడించిన స్టాక్ పరిమాణాలు, కంది, మినపప్పుకు సంబంధించి సీడబ్ల్యూసీ, ఎస్ డబ్ల్యూసీ గోదాముల్లోని నిల్వలను సమావేశంలో సమీక్షించారు.

మార్కెట్ నిర్వాహకులు బ్యాంకులతో తాకట్టు పెట్టిన పరిమాణాలు, స్టాక్ డిస్ క్లోజర్ పోర్టల్ లో ప్రకటించిన పరిమాణాల మధ్య వ్యత్యాసాలను ధృవీకరించడానికి రాష్ట్రాలు తీసుకున్న చర్యలు, స్టాక్ పరిమితుల అమలుపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. సిడబ్ల్యూసి , ఎస్ డబ్ల్యూ సి లు తమ గోదాముల్లోని కంది, మినపప్పు నిల్వల వివరాలను ఎప్పటికప్పుడు అందజేయాలని కోరారు. ధరలను నిరంతరం పర్యవేక్షించాలని, స్టాక్ హోల్డింగ్ సంస్థల స్టాక్ పొజిషన్లను పరిశీలించాలని, స్టాక్ పరిమితుల ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేశారు.

 

ఈ ఉత్తర్వుల ప్రకారం, అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు 2023 అక్టోబర్ 31 వరకు కందిపప్పు , మినపప్పు lనిల్వ పరిమితులను నిర్దేశించారు. హోల్సేల్ వ్యాపారులకు వ్యక్తిగతంగా ప్రతి పప్పుకు వర్తించే స్టాక్ పరిమితులు 200 మెట్రిక్ టన్నులు; చిల్లర వ్యాపారులకు 5 మెట్రిక్ టన్నులు; ప్రతి రిటైల్ అవుట్ లెట్ వద్ద 5 మెట్రిక్ టన్నులు ; పెద్ద గొలుసు రిటైలర్లకు డిపో వద్ద 200 మెట్రిక్ టన్నులు; మిల్లర్లకు చివరి 3 నెలల ఉత్పత్తి లేదా వార్షిక స్థాపిత సామర్థ్యంలో 25% లేదా ఏది ఎక్కువైతే అది. డిపార్ట్ మెంట్ పోర్టల్ (https://fcainfoweb.nic.in/psp)లో ఈ సంస్థలు స్టాక్ పొజిషన్ ను ప్రకటించడం కూడా ఉత్తర్వు తప్పనిసరి చేసింది.

 

స్టాక్ డిక్లరేషన్ అడ్వైజరీతో ప్రారంభించి వినియోగదారులకు కందిపప్పు, మినపప్పు చౌకగా అందేలా వినియోగదారుల వ్యవహారాల శాఖ తీసుకున్న వివిధ చర్యల లో స్టాక్ లిమిట్ ఆర్డర్ అత్యంత కీలకం.

 

రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ దిగుమతిదారులు, మిల్లర్లు, స్టాకిస్టులు, ట్రేడర్లు వంటి సంస్థల వద్ద ఉన్న కందిపప్పు నిల్వలను పర్యవేక్షించడానికి 2023 మార్చిలో అదనపు కార్యదర్శి శ్రీమతి నిధి ఖరే అధ్యక్షతన  కమిటీని డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు, దిగుమతిదారులు, మిల్లర్లతో వరుస సమావేశాలు నిర్వహించి వినియోగదారులకు పప్పుధాన్యాలు చౌకగా అందేలా చూడటానికి వ్యవస్థీకృత రిటైల్ చైన్ లను నిర్వహించింది. కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు 12 మంది సీనియర్ అధికారులను కూడా డిపార్ట్మెంట్ నియమించింది.

 

*****



(Release ID: 1932671) Visitor Counter : 139