మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గాబన్ మొదటి అగ్రి-సెజ్ ప్రాజెక్ట్‌ను జెండా ఊపి ప్రారభించారు.
ఏ ఓ ఎం గ్రూప్ మరియు సెంచూరియన్ యూనివర్సిటీ సహాయంతో ప్రాజెక్ట్ అమలు చేయబడుతుంది
దేశంలో అభివృద్ధి ఆకాంక్ష జిల్లాల్లో ఒకటైన ఒడిశాలోని గజపతి జిల్లా నుండి 30 మంది రైతులు మరియు 20 మంది విద్యార్థులు సాంకేతిక సహాయం కోసం గాబన్‌కు వెళ్లనున్నారు.
గజపతి నుండి గాబన్ వరకు, చిరుతల నుండి వాతావరణ మార్పుల వరకు, భారతదేశం-ఆఫ్రికా సంబంధాలు సుదృడమవుతున్నాయి - శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
Posted On:
14 JUN 2023 10:50PM by PIB Hyderabad
కేంద్ర విద్య మరియు నైపుణ్యాభివృద్ధి మరియు పారిశ్రామికులఅభివృద్ధి మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు న్యూఢిల్లీ నుండి గాబోన్ యొక్క మొదటి అగ్రి-సెజ్ ప్రాజెక్ట్‌ను జెండా ఊపి ప్రారంభించారు. సెంచూరియన్ విశ్వవిద్యాలయం సాంకేతిక మరియు నాలెడ్జ్ భాగస్వామిగా ఏ ఓ ఎం గ్రూప్ ద్వారా ప్రాజెక్ట్ అమలు చేయబడుతుంది. కార్యక్రమంలో మొదటి దశలో 30 మంది రైతులు, ఒడిశాలోని ఆశావహ జిల్లా అయిన గజపతి జిల్లాలోని సెంచూరియన్ విశ్వవిద్యాలయం కి చెందిన 20 మంది బి.ఎస్.సి./ఎమ్.ఎస్.సి.అగ్రి , బీ టెక్, ఎం టెక్ ఇంజినీరింగ్ విద్యార్థులు ఈ ప్రాజెక్ట్ కింద అభివృద్ధి చేయబడుతున్న వ్యవసాయ ఎస్ ఈ జెడ్ కోసం అగ్రి-టెక్నికల్ మరియు టెక్నికల్ కన్సల్టెంట్‌లుగా కలిసి పనచేయనున్నారు.
ఈ సందర్భంగా శ్రీ ప్రధాన్ మాట్లాడుతూ, గజపతి నుంచి గాబన్ వరకు, చిరుతల నుంచి వాతావరణ మార్పుల వరకు భారత్-ఆఫ్రికా సంబంధాలు పటిష్టంగా కొనసాగుతున్నాయన్నారు. ఈ ప్రారంభ ఉత్సవం ఆ సంబంధంలో కొత్త అధ్యాయాన్ని తెరుస్తుందని ఆయన అన్నారు. గాబన్‌లో అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఏర్పాటు దేశంలో ఆహార భద్రత మరియు స్వయం సమృద్ధిని పెంపొందించడంలో ఒక ముఖ్యమైన మైలురాయి అవుతుందని కూడా ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
భారతదేశం-ఆఫ్రికా సంబంధాల గురించి మాట్లాడుతూ, గత 9 సంవత్సరాలలో, భారతదేశం-ఆఫ్రికా సంబంధాలు బలోపేతం అయ్యాయి, భారతదేశం నుండి 35 కంటే ఎక్కువ ఉన్నత స్థాయి పర్యటనలు మరియు ఆఫ్రికా నుండి 100 కంటే ఎక్కువ ఇలాంటి సందర్శనలను జరిగాయి. భారతదేశం మరియు ఆఫ్రికా ఖండం మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో వలసవాద వ్యతిరేక సంఘీభావం, ప్రవాస సద్భావన మరియు 'దక్షిణాది దేశాల' సహకారం సూత్రం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని ఆయన అన్నారు.
భారతదేశ ఆఫ్రికా విధానంలో అభివృద్ధి భాగస్వామ్యమే కీలక భూమిక అని కూడా ఆయన అన్నారు. సామాజిక-ఆర్థిక అభివృద్ధి ప్రయాణంలో విశ్వసనీయ భాగస్వామిగా, భారతదేశం ఆఫ్రికాకు $ 12.3 బిలియన్లకు పైగా రాయితీ రుణాలను మరియు వివిధ రంగాలలో అభివృద్ధి ప్రాజెక్టులతో $ 700 మిలియన్ల గ్రాంట్ సహాయాన్ని అందించింది.
భారతదేశ జీ20 అధ్యక్షత గురించి మాట్లాడుతూ, భారతదేశం యొక్క జీ 20 ప్రెసిడెన్సీ దక్షిణాది దేశాల మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క వాణి ని వినిపించడం లో మరియు వారి ఆందోళనలను ప్రస్తావించడం లో భారతదేశం పాత్ర చాలా ప్రత్యేకమైనదని, ఇది భారత్-ఆఫ్రికా సంబంధాలను బలోపేతం చేయడంలో మరొక అధ్యాయాన్ని రచిస్తోందని ఆయన అన్నారు.
గాబన్ మరియు ఇతర ఆఫ్రికన్ దేశాలు భారతదేశ అభివృద్ధి ప్రయాణం మరియు అభివృద్ధి ఆకాంక్ష జిల్లాల పథకం వంటి ఇటీవలి కార్యక్రమాల నుండి చాలా నేర్చుకోవాలని ఆయన అన్నారు.
విద్య మరియు నైపుణ్యాభివృద్ధి రంగాలలో భారతదేశం-ఆఫ్రికా దీర్ఘకాల సంబంధాల గురించి కూడా ఆయన మాట్లాడారు.
***
(Release ID: 1932667)
Visitor Counter : 175