విద్యుత్తు మంత్రిత్వ శాఖ
ఎన్‌హెచ్‌పిసి డైరెక్టర్ (సిబ్బంది)గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ ఉత్తమ్ లాల్
Posted On:
14 JUN 2023 10:59AM by PIB Hyderabad
భారతదేశ అగ్రగామి జలవిద్యుత్ కంపెనీ అయిన ఎన్‌హెచ్‌పిసి లిమిటెడ్ డైరెక్టర్ (సిబ్బంది)గా శ్రీ ఉత్తమ్ లాల్ బాధ్యతలు స్వీకరించారు.
ఎన్‌హెచ్‌పిసిలో నియామకానికి ముందు, శ్రీ లాల్ ఎన్‌టిపిసి లిమిటెడ్‌లో చీఫ్ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్- సిఎస్ఆర్/ ఆర్& ఆర్/ ఎల్ఎ)గా విధులను నిర్వహించారు. సుదీర్ఘమైన 35 ఏళ్ళ వృత్తి జీవితంలో ఆయనకు పర్సనల్ మేనేజ్‌మెంట్, పారిశ్రామిక సంబంధాలు, కార్పొరేట్ సామాజిక బాధ్యత వంటి అంశాలలో ఆయనకు సుసంపన్నమైన, విస్త్రత అనుభవం ఉంది. విద్యుత్ రంగంలో ఆయనకు గల నైపుణ్యం, దీర్ఘ అనుభవం కారణంగా ప్రాచుర్యం పొందిన ఆయన, సంస్థ లక్ష్యం, దృక్పథ సేవలో మానవ వనరుల సామర్ధ్యాన్ని సమ్మిళితం చేయాలని యత్నిస్తున్న ఒక ప్రముఖ హెచ్ఆర్ ప్రొఫెషనల్.
పర్సనల్ మేనేజ్‌మెంట్ & పారిశ్రామిక సంబంధాలలో గ్జేవియర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (రాంచి) నుంచి శ్రీ లాల్ పిజి డొప్లొమాను పొందారు. ఆయన రాంచీ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్‌బి పట్టాను కూడా ఆయన పొందారు.
***
(Release ID: 1932470)
Visitor Counter : 125