భారత పోటీ ప్రోత్సాహక సంఘం
azadi ka amrit mahotsav

ఆంబిట్ ప్రైవేట్ లిమిటెడ్‌లో కొంత వాటా కొనుగోలుకు డయివా ఇంటర్నేషనల్ హోల్డింగ్స్‌కు సీసీఐ ఆమోదం

నాడు పోస్టు చేయడమైనది: 13 JUN 2023 8:05PM by PIB Hyderabad

ఆంబిట్ ప్రైవేట్ లిమిటెడ్‌లో కొంత వాటాను కొనుగోలు చేయడానికి డయివా ఇంటర్నేషనల్ హోల్డింగ్స్‌కు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) ఆమోదం తెలిపింది.

ప్రతిపాదిత కొనుగోలులో ప్రాథమిక షేర్ల కొనుగోలు, ఇప్పటికే ఉన్న వాటాదార్ల నుంచి ద్వితీయ షేర్ల కొనుగోలు కలిసి ఉంటుంది. దీని ద్వారా, ఆంబిట్ ప్రైవేట్ లిమిటెడ్‌లో నిర్దిష్ట వాటాను డయివా ఇంటర్నేషనల్ హోల్డింగ్స్‌ దక్కించుకుంటుంది.

కొనుగోలు చేస్తున్న సంస్థ
డయివా ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ అనేది జపాన్‌లో ఏర్పైటైన పెట్టుబడుల సంస్థ. దేశీయ లేదా విదేశీ సంస్థల్లో వాటాలు కొనుగోలు చేయడం, ఆయా సంస్థల వాణిజ్య కార్యకలాపాలను నియంత్రించడం, నిర్వహించడం దీని లక్ష్యం.

లక్ష్యిత సంస్థ
ఆంబిట్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది భారతదేశంలో ఏర్పాటైన ఒక ప్రైవేట్ సంస్థ. ఇది అనేక రకాల ఆర్థిక సేవలను అందిస్తుంది. మర్చంట్ బ్యాంకర్‌గా సెబీలో నమోదు అయింది. దీని వివిధ అనుబంధ సంస్థలు రుణాలు, స్టాక్ బ్రోకింగ్, డిపాజిటరీ పార్టిసిపేషన్, ఆర్థిక వ్యవహారాల పరిశోధన, పోర్ట్‌ఫోలియో నిర్వహణ, మ్యూచువల్ ఫండ్ సేవలను అందిస్తుంది.

సీసీఐ నుంచి సవివరణ ఆదేశం రావలసి ఉంది.

 

****


(రిలీజ్ ఐడి: 1932231) సందర్శకుల సూచీ సంఖ్య : : 179
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी