రక్షణ మంత్రిత్వ శాఖ
ఉపాధి కల్పన కోసం ప్రైవేటు రంగంతో అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేసిన మాజీ సైనికోద్యోగుల సంక్షేమ విభాగం
నాడు పోస్టు చేయడమైనది:
12 JUN 2023 4:02PM by PIB Hyderabad
రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన మాజీ సైనికోద్యోగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని డైరెక్టొరేట్ ఆఫ్ జనరల్ రీసెటిల్మెంట్ (డిజిఆర్),కు, ఎం/ఎ స్ కోటాక్ మహీంద్ర లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లు 12 జూన్ 2023న న్యూఢిల్లీలో ఒక అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశాయి.
రక్షణ సేవలలోని గౌరవ మాజీ సైనికులకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కార్పొరేట్ కంపెనీలను, మాజీ సైనికులను ఒక సామాన్య వేదికపైకి తెచ్చేందుకు డిజిఆర్, కార్పొరేట్ల మధ్య అవగాహన ఒప్పందం ప్రయత్నిస్తోంది.
ఈ సందర్భంగా డైరెక్టర్ జనరల్ (పునరావాసం) మేజర్ జనరల్ శరద్ కపూర్ మాట్లాడుతూ, ఈ భాగస్వామ్యం పరిశ్రమ, కార్పొరేట్‌లకు తమ మాజీ సైనికులను మరింత ప్రత్యక్షంగా కనిపించేలా చేయడమే కాక నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించడంతో పాటుగా తమ మాజీలకు గౌరవ ప్రదమైన ప్రత్యామ్నాయ వృత్తిని అందించడం వంటి లక్ష్యాలను సాధించడంలో సాయపడుతుందని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 1931903)
సందర్శకుల సూచీ సంఖ్య : : 196