ఆర్థిక మంత్రిత్వ శాఖ

హిమాచల్ ప్రదేశ్‌లో ఉద్యానవనాల అభివృద్ధి కోసం $130 మిలియన్ రుణంపై సంతకాలు చేసిన భారతదేశం, ఏడీబీ

Posted On: 12 JUN 2023 2:14PM by PIB Hyderabad

 హిమాచల్ ప్రదేశ్‌లో ఉద్యానవనాల అభివృద్ధి కోసం $130 మిలియన్ రుణంపై  భారతదేశం,ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) సంతకాలు చేశాయి. దీని ప్రకారం 

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో రైతుల ఆదాయాన్ని పెంచడానికి, వ్యవసాయ ఉత్పాదకత ఎక్కువ చేయడానికి , నీటి పారుదల సౌకర్యాన్ని మెరుగుపరచడానికి, ఉద్యానవన వ్యవసాయ వ్యాపారాలను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం  ఆసియా అభివృద్ధి బ్యాంకు కృషి చేస్తాయి. 

రుణ ఒప్పందంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ రజత్ కుమార్ మిశ్రా, ఆసియా అభివృద్ధి బ్యాంకు ఇండియా రెసిడెంట్ మిషన్ కంట్రీ డైరెక్టర్ టేకో కొనిషి సంతకాలు చేశారు. 

హిమాచల్ ప్రదేశ్ సబ్‌ట్రాపికల్ హార్టికల్చర్, ఇరిగేషన్ వాల్యూ అడిషన్ ప్రాజెక్ట్‌ కింద కార్యక్రమాలు అమలు జరుగుతాయి. 

రుణ ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత మాట్లాడిన శ్రీ రజత్ కుమార్ మిశ్రా  ఇప్పటివరకు వాతావరణ పరిస్థితులపై ఆధారపడి సాగిన  హిమాచల్ ప్రదేశ్‌లోని దక్షిణ ప్రాంతాలలో ఉపఉష్ణమండల ఉద్యానవనాలను మెరుగుపరచడం, పంటల వైవిధ్యం, వాతావరణ అనుకూలత, రాష్ట్ర గ్రామీణ ప్రాంతాల్లో మరింత  ఆర్థిక, సామాజిక అభివృద్ధి సాధించడం లక్ష్యంగా కార్యక్రమం అమలు జరుగుతుందని తెలిపారు. రంగంతో  దేశ అభివృద్ధి సాధించి,  ఆహార భద్రత కల్పించడానికి అవకాశం కలుగుతుందన్నారు. 

' ఏడీబీ సమకూర్చే నిధులతో ఈ ప్రాజెక్టు 200 హెక్టార్లలో ఉపఉష్ణమండల ఉద్యానవన అభివృద్ధికి కృషి జరుగుతుంది. నీటి వినియోగానికి  సంబంధించి  ఏడీబీ రూపొందించిన వాటర్ యూజర్ అసోసియేషన్  ముసాయిదా చట్టం  ప్రయోగాత్మకంగా అమలు జరుగుతుంది' అని టేకో కొనిషి తెలిపారు.

రాష్ట్రంలోని  బిలాస్‌పూర్, హమీర్‌పూర్, కాంగ్రా, మండి, సిర్మౌర్, సోలన్  ఉనా జిల్లాల్లో లో కనీసం 15,000 వ్యవసాయ కుటుంబాలకు ప్రాజెక్టు వల్ల ప్రయోజనం కలుగుతుంది.   వాతావరణ మార్పుల ప్రభావం,  నీటిపారుదల సౌకర్యాలు లేకపోవడం, అడవి  జంతువుల దాడుల వల్ల జరుగుతున్న  పంట నష్టం కారణంగా ఈ కుటుంబాలు వ్యవసాయం చేయడం మానేశారు లేదా వారి వ్యవసాయ ప్రాంతాలను తగ్గించుకున్నారు. ప్రాజెక్టు ద్వారా 15,000 వ్యవసాయ కుటుంబాల ఆదాయం పెంచి ఆరి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి ప్రాజెక్టు కింద చర్యలు అమలు చేస్తారు. 

నూతన జల వనరుల పథకాలు అమలు చేయడం, ప్రస్తుతం పనిచేస్తున్న జల వనరుల పథకాల పనితీరు మెరుగుపరచడం లాంటి చర్యల ద్వారా  6,000 హెక్టార్ల సాగుభూమిలో వ్యవసాయ నీటిపారుదల, నీటి నిర్వహణ మెరుగు పరచడానికి చర్యలు అమలు చేస్తారు. 

 జల శక్తి విభాగం (జల వనరుల శాఖ), ఉద్యాన వన  శాఖ కలిసి స్మూక్ష  జల వనరుల వినియోగం ద్వారా జల వినియోగదారుల సంఘాల   సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి చర్యలు అమలు చేస్తాయి. 

ఉపఉష్ణమండల ఉద్యానవన మార్కెట్‌లను  రైతులకు అందుబాటులోకి తేవడానికి ప్రాజెక్టు ద్వారా చర్యలు అమలు జరుగుతాయి. సామూహిక వ్యవసాయ విధానం ద్వారా రైతులు వ్యవసాయ కార్యక్రమాలు చేపట్టడానికి సంఘాలను నెలకొల్పుతారు.  జిల్లా వ్యాప్తంగా రైతుల  సహకార సంఘాలు ఏర్పాటు చేస్తారు. రైతుల ఆదాయం పెంచడానికి దోహద పడే విధంగా  రైతు ఉత్పత్తి సంస్థ ఏర్పాటు అవుతుంది.  1/5/2018-ADB.II I/67997/2023 ఉపఉష్ణమండల ఉద్యానవన మార్కెట్‌లను రైతులకు అందుబాటులోకి తీసుకు రావడానికి చర్యలు అమలు జరుగుతాయి.  వ్యవసాయ వ్యాపార ప్రోత్సాహం,  క్రమబద్ధీకరణ,ప్యాకేజింగ్ సౌకర్యాలు, నిల్వ , సేకరణ కేంద్రాలు వంటి విలువ-జోడింపు సౌకర్యాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు అమలు జరుగుతాయి.

 మొక్కల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వ, ప్రైవేట్ ఉపఉష్ణమండల ఉద్యాన నర్సరీ సౌకర్యాల ఆధునీకరణకు ప్రాజెక్టు ద్వారా చర్యలు అమలు చేస్తారు. లబ్ధిదారులకు అవసరమైన సమాచారం,  వ్యవసాయ సలహాలు అందించి  నిర్వహణ కోసం  డిజిటల్ వ్యవసాయ -టెక్నాలజీ వ్యవస్థల అభివృద్ధికి ప్రాజెక్టు కింద చర్యలు అమలు జరుగుతాయి. 

***



(Release ID: 1931818) Visitor Counter : 187


Read this release in: English , Urdu , Hindi , Tamil