రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి కొత్త ఆలోచనలు నూతన ఆవిష్కరణలతో ముందుకు రండి: బీహార్‌లోని గోపాల్ నారాయణ్ సింగ్ విశ్వవిద్యాలయంలో యువతకు రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పిలుపు

Posted On: 10 JUN 2023 2:21PM by PIB Hyderabad

రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ దేశంలోని యువకులు కొత్త ఆలోచనలు మరియు ఆవిష్కరణలతో ముందుకు రావాలని మరియు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఊహించిన విధంగా 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంలో ప్రభుత్వానికి సహకరించాలని పిలుపునిచ్చారు. జూన్ 10, 2023న బీహార్‌లోని రోహతాస్ జిల్లాలో గోపాల్ నారాయణ్ సింగ్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగించారు.

 

భారతదేశం స్వర్ణయుగంలోకి ప్రవేశించిందని, 2047 నాటికి 'అమృత్ కాల్' ముగింపులో అభివృద్ధి చెందిన దేశంగా అపూర్వమైన వేగంతో దూసుకుపోతోందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ నొక్కి చెప్పారు. ప్రభుత్వ ప్రయత్నాల కారణంగా, భారతదేశం ప్రపంచంలోని మొదటి ఐదు ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉందని, 2027 నాటికి ఇది మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని పెట్టుబడి సంస్థ మోర్గాన్ స్టాన్లీ నివేదిక పేర్కొంది.

 

రక్షణ మంత్రి దేశంలో స్టార్ట్-అప్ ఎకోసిస్టమ్ పెరుగుదలపై మాట్లాడుతూ,  ఏడు-ఎనిమిదేళ్ల క్రితం కేవలం 500 గా ఉండే స్టార్టప్‌ల సంఖ్య100 యునికార్న్‌లతో సహా  నేడు దాదాపు లక్షకు పెరిగింది. దేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లి మానవాళి అభివృద్ధికి దోహదపడే సామర్థ్యం యువతకు ఉందని ఉద్ఘాటించారు.

 

విద్య మరియు విజ్ఞానాన్ని పొందడంపై దృష్టి సారించటం తో పాటు దేశ సంస్కృతులు, విలువలు మరియు సంప్రదాయాలతో వాటిని అనుసంధానం చేయడంపై దృష్టి పెట్టాలని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ విద్యార్థులను కోరారు. "మీ విలువలు ప్రపంచంలో మీ గుర్తింపు మాత్రమే కాదు, మీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు దేశానికి కూడా గుర్తింపు" అని ఆయన అన్నారు.

భారతదేశం ఒక వ్యక్తి యొక్క విలువను అతని/ఆమె జ్ఞానం ద్వారా మాత్రమే కాకుండా, విలువలు మరియు ప్రవర్తన ద్వారా అలాగే అతని నైపుణ్యం, అలాగే దానిని ఎంత సమర్థంగా ఉపయోగించబడుతుందనే దాని ద్వారా కూడా వ్యక్తి యొక్క విలువను అంచనా వేసే దేశం అని హైలైట్ చేస్తూ, రక్షణ మంత్రి వ్యక్తిత్వ నిర్మాణంపై దృష్టి పెట్టాలని విద్యార్థులకు ఉద్బోధించారు. అహం, మితిమీరిన ఆత్మవిశ్వాసం మరియు స్వీయ-కేంద్రీకృత వైఖరి వృద్ధికి పెద్ద అడ్డంకులు అని, ప్రతి ఒక్కరినీ ప్రగతి పథంలో తీసుకెళ్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా ఉండాలని ఆయన అన్నారు.

 

శ్రీ రాజ్‌నాథ్ సింగ్ విద్యార్థులు తమను తాము ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దుకోవాలని కోరారు, అయితే విద్యా సంస్థలు వారిని విద్యా మరియు వారి మానసిక వికాస స్థాయిని పెంచుతాయి. ఒక వ్యక్తి ఆధ్యాత్మిక స్పృహను పెంపొందించుకున్నప్పుడు, అతను / ఆమె  దేశ అభివృద్ధి తో తన స్వంత అభివృద్ధి అని  ఆలోచిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.

 

విద్యార్ధుల హృదయాలు మరియు మనస్సులలో శాశ్వతమైన అభ్యాస జ్యోతిని వెలిగించాలని రక్షణ మంత్రి ఉపాధ్యాయ సోదరులకు పిలుపునిచ్చారు. ఇది వ్యక్తి యొక్క వ్యక్తిత్వంలో అత్యంత కీలకమైన భాగమని, ఇది వ్యక్తిగత ఎదుగుదలను మాత్రమే కాకుండా, సమాజ అభివృద్ధికి కూడా దోహదం చేస్తుంది.

***


(Release ID: 1931331) Visitor Counter : 155