విద్యుత్తు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

విద్యుత్ రంగంలో అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను ఉపయోగించుకోవడానికి ప్రారంభం కానున్న మిషన్ ఆన్ అడ్వాన్స్‌డ్ అండ్ హై-ఇంపాక్ట్ రీసెర్చ్ (మహిర్)


జాతీయ మిషన్ మహిర్ కి విద్యుత్, కొత్త, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖలు,
పి ఎస్ యు వనరులను సమీకరించడం ద్వారా నిధులు సమకూరుతాయి

విద్యుత్ రంగంలో నికర జీరో, స్టార్ట్-అప్, మేక్ ఇన్ ఇండియాను సాధించడానికి
మహిర్ ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది: కేంద్ర విద్యుత్, ఎన్ఆర్ఈ మంత్రి శ్రీ ఆర్. కె. సింగ్

Posted On: 07 JUN 2023 10:27AM by PIB Hyderabad

విద్యుత్ మంత్రిత్వ శాఖ, నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ సంయుక్తంగా విద్యుత్ రంగంలో అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను త్వరగా గుర్తించడానికి, భారతదేశం లోపల, వెలుపల విస్తరణ కోసం దేశీయంగా వాటిని అభివృద్ధి చేయడానికి జాతీయ మిషన్‌ను ప్రారంభిస్తున్నారు. "మిషన్ ఆన్ అడ్వాన్స్‌డ్ అండ్ హై-ఇంపాక్ట్ రీసెర్చ్ (మహిర్)" పేరుతో స్వదేశీ పరిశోధన, అభివృద్ధి  విద్యుత్ రంగంలో సరికొత్త, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను ప్రదర్శించడం లక్ష్యంగా పెట్టుకుంది. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను గుర్తించడం, వాటిని అమలు దశకు తీసుకెళ్లడం ద్వారా, భవిష్యత్ ఆర్థిక వృద్ధికి ప్రధాన ఇంధనంగా వాటిని ఉపయోగించాలని మిషన్ ప్రయత్నిస్తుంది. తద్వారా భారతదేశాన్ని ప్రపంచం స్థాయి తయారీ కేంద్రంగా మార్చడానికి సిద్ధం అవుతోంది. విద్యుత్ మంత్రిత్వ శాఖ,  కొత్త, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఆర్థిక వనరులను సమీకరించడం ద్వారా రెండు మంత్రిత్వ శాఖల పరిధిలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు మిషన్‌కు నిధులు సమకూరుస్తాయి. భారత ప్రభుత్వం బడ్జెట్ వనరుల నుండి అవసరమైన ఏదైనా అదనపు నిధులు సమీకరిస్తాయి.

2023-24 నుండి 2027-28 వరకు ఐదు సంవత్సరాల ప్రారంభ కాలానికి ప్రణాళిక చేస్తూ, ఉత్పత్తికి సాంకేతిక జీవిత చక్ర విధానాన్ని మిషన్ అనుసరిస్తుంది.

మహిర్  ప్రారంభం గురించి కేంద్ర విద్యుత్ & ఎన్ఆర్ఈ మంత్రి శ్రీ ఆర్. కే . సింగ్ మాట్లాడుతూ, ఈ మిషన్ నికర జీరో ఉద్గారాలను సాధించడం, మేక్ ఇన్ ఇండియా స్టార్ట్-అప్ ఇండియా వంటి కార్యక్రమాలను ప్రోత్సహించడం వంటి జాతీయ ప్రాధాన్యతలకు ఉత్ప్రేరకంగా ఉపయోగపడుతుందని అన్నారు. ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (ఎస్‌డిజి) సాధనకు కూడా ఇది దోహదపడుతుందని ఆయన తెలిపారు. “గత తొమ్మిదేళ్లలో, భారత విద్యుత్ రంగం ఒక శక్తివంతమైన, ఆర్థికంగా లాభదాయకమైన రంగంగా రూపాంతరం చెందింది. రాబోయే సంవత్సరాల్లో భారతదేశం 7% కంటే ఎక్కువ వృద్ధిని సాధించబోతున్నందున, విద్యుత్ డిమాండ్ దాదాపు 10% వరకు పెరగబోతోంది. అదనంగా, భారతదేశం ప్రధానమంత్రి దార్శనికతను అనుసరించి ఇంధన పరివర్తనను లక్ష్యంగా చేసుకుంటోంది. దీనికి భారీ పెట్టుబడి మాత్రమే కాకుండా పరిశోధన, ఆవిష్కరణల ద్వారా నడిచే పరివర్తన విధానం కూడా అవసరం." అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు 

విద్యుత్ శాఖ కార్యదర్శి శ్రీ అలోక్ కుమార్ మాట్లాడుతూ మహిర్, విద్యుత్ రంగంలో ఆవిష్కరణలు, పరిశోధనలకు ప్రతిబింబించే, ఒక పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి పరిశ్రమ-అకాడెమియా-ప్రభుత్వ సహకారంతో పని చేస్తుందని తెలిపారు. "మహిర్ఒకవైపు ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్ఐటిలు, ఐఐఎస్ఈఆర్ లు, విశ్వవిద్యాలయాలు వంటి ప్రధాన సంస్థలతో, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యుత్ రంగ స్టార్టప్‌లు, స్థాపిత పరిశ్రమలతో కలిసి ప్రభుత్వం ఒక ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి సశక్త పరిచే వ్యవస్థగా వ్యవహరిస్తుంది" అని విద్యుత్ శాఖ కార్యదర్శి చెప్పారు.

మిషన్ లక్ష్యాలు: 
* గ్లోబల్ పవర్ సెక్టార్ కోసం అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, భవిష్యత్తు సంబంధిత రంగాలను గుర్తించడం, సంబంధిత సాంకేతికతల ఆమూలాగ్రం  స్వదేశీ 
పవర్ సెక్టార్ వాటాదారుల కోసం సామూహిక ఆలోచనలు, సినర్జెటిక్ టెక్నాలజీ అభివృద్ధి, సాంకేతికతను సజావుగా బదిలీ చేయడానికి మార్గాలను రూపొందించడం కోసం ఒక సాధారణ వేదికను అందించడం
* స్వదేశీ టెక్నాలజీల పైలట్ ప్రాజెక్ట్‌లకు (ముఖ్యంగా భారతీయ స్టార్టప్‌లు అభివృద్ధి చేసిన), వాటి వాణిజ్యీకరణను సులభతరం చేయడానికి
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల పరిశోధన & అభివృద్ధిని వేగవంతం చేయడానికి, ద్వైపాక్షిక లేదా బహుపాక్షిక సహకారాల ద్వారా అధునాతన సాంకేతికతలకు సామర్థ్యాలు, ప్రాప్యతను పెంపొందించడానికి విదేశీ భాగస్వామ్యం,  ప్రభావితం చేయడం, తద్వారా విజ్ఞానం, సాంకేతిక బదిలీని సులభతరం చేయడం.
శాస్త్రీయ, పారిశ్రామిక ఆర్ అండ్ డి కి  విత్తనం, పెంపకం, స్థాయిని పెంచడం,  దేశంలోని విద్యుత్ రంగంలో శక్తివంతమైన, వినూత్న పర్యావరణ వ్యవస్థను సృష్టించడం

పవర్ సిస్టమ్ సంబంధిత టెక్నాలజీలు, అప్లికేషన్స్ డెవలప్‌మెంట్‌లో మన దేశాన్ని అగ్రగామిగా మార్చడానికి తగు విధానాలను శోధించడం. 

పరిశోధన కోసం గుర్తించిన అంశాలు: 

  1. లిథియం-అయాన్ స్టోరేజ్ బ్యాటరీలు 
  2. భారతీయ వంట పద్ధతులకు అనువైన ఎలక్ట్రిక్ కుక్కర్స్/ప్యాన్లలో చోటుచేసుకుంటున్న మార్పులు   
  3. మొబిలిటీ కోసం గ్రీన్ హైడ్రోజన్ (హై ఎఫిషియెన్సీ ఫ్యూయల్ సెల్)
  4. కార్బన్ నిల్వలు 
  5. జియో థర్మల్ శక్తి 
  6. ఘన స్థితి శీతలీకరణ.
  7. ఈవి బ్యాటరీల కోసం నానో టెక్నాలజీ 
  8. దేశీయ సిఆర్జిఓ టెక్నాలజీ 

 

మిషన్  నిర్మాణం

టెక్నికల్ స్కోపింగ్ కమిటీ, అపెక్స్ కమిటీ  అని మిషన్ రెండు-స్థాయిల నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. 

సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ చైర్‌పర్సన్ అధ్యక్షతన ఉన్న టెక్నికల్ స్కోపింగ్ కమిటీ, ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న, అభివృద్ధి చెందుతున్న పరిశోధనా ప్రాంతాలను గుర్తిస్తుంది, మిషన్ కింద అభివృద్ధి చేయడానికి సంభావ్య సాంకేతికతలను సిఫార్సు చేస్తుంది, ప్రాజెక్టుల సాంకేతిక-ఆర్థిక ప్రయోజనాలను సమర్థిస్తుంది, పరిశోధన రూపురేఖలను అందిస్తుంది మరియు ఆమోదించబడిన పరిశోధనలను కాలానుగుణంగా పర్యవేక్షిస్తుంది. 

టెక్నికల్ స్కోపింగ్ కమిటీ (టిఎస్సి) ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలో కొనసాగుతున్న, అభివృద్ధి చెందుతున్న రంగాలను సర్వే చేసి, గుర్తిస్తుంది. అపెక్స్ కమిటీకి సిఫార్సులు చేస్తుంది. మిషన్ కింద అభివృద్ధి కోసం పరిగణించబడే సంభావ్య సాంకేతికతలను టిఎస్సి గుర్తిస్తుంది. విద్యుత్ రంగం భవిష్యత్తు కోసం సాంకేతికత యొక్క ఔచిత్యాన్ని బయటకు తీసుకువస్తుంది.  సాంకేతిక పరిజ్ఞానం  దేశీయ అభివృద్ధి సాంకేతిక-ఆర్థిక ప్రయోజనాన్ని సమర్థిస్తుంది. సాంకేతికత కోసం  రోడ్‌మ్యాప్‌తో ముందుకు వస్తుంది. 

***


(Release ID: 1931291) Visitor Counter : 177


Read this release in: English , Urdu , Hindi , Tamil