ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
అగర్తల వద్ద అంతర్జాతీయ రైల్వే స్టేషన్ ప్రాజెక్టును సందర్శించి, దాని పురోగతిని సమీక్షించిన - కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశం అంతటా, ముఖ్యంగా ఈశాన్య ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల ప్రకృతి దృశ్యాన్ని పునర్ నిర్వచించారు : కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్
Posted On:
07 JUN 2023 7:57PM by PIB Hyderabad
కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత, ఎలక్ట్రానిక్స్, ఐ.టీ. శాఖ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ ఈరోజు త్రిపుర రాష్ట్ర రాజధాని అగర్తల సమీపంలోని చరిపరా వద్ద ఉన్న అంతర్జాతీయ రైల్వే స్టేషన్ ప్రాజెక్టును సందర్శించి, దాని పురోగతిని సమీక్షించారు.
ఇంజనీరింగ్ అద్భుతంగా పరిగణించబడే ఈ ప్రాజెక్టు, ఈశాన్య ప్రాంతాల నుండి కోల్‌కతాకు ప్రయాణ సమయాన్ని సగానికి తగ్గించి, త్రిపుర, ఈశాన్య ప్రాంతాలకు ఆర్థిక కారిడార్ గా మారడంతో పాటు, ఆర్థికాభివృద్ధి, వర్తక, వాణిజ్యాలను ఉత్ప్రేరక పరుస్తుంది.
ఈ సందర్భంగా శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, “ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారతదేశం అంతటా మౌలిక సదుపాయాల ముఖ చిత్రాన్ని పునర్ నిర్వచించారు. ముఖ్యంగా ఈశాన్య ప్రాంతంలో త్రిపుర, ఈశాన్య ప్రాంతాల జీవన సౌలభ్యం, ఆర్థిక అవకాశాలను మెరుగుపరుస్తుంది." అని పేర్కొన్నారు.
త్రిపురలో మూడు రోజుల పర్యటన నిమిత్తం మంత్రి సోమవారం అగర్తల చేరుకున్నారు. తమ పర్యటన సందర్భంగా ఆయన వివిధ వర్గాల ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి, తెలుసుకున్నారు. నైపుణ్యాభివృద్ధి శాఖ డైరెక్టర్ శ్రీ సంజయ్ చక్రవర్తి తో సమావేశమై, రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధికి చేపడుతున్న ప్రయత్నాలను సమీక్షించారు. మార్కెట్ అనుసంధానాలు, సామర్థ్య నిర్మాణానికి అవకాశాలు, స్వయం సహాయక సంఘాల కోసం తీసుకున్న కార్యక్రమాలకు సంబంధించిన సవాళ్ళ గురించి, వారు చర్చించారు.
కేంద్ర సహాయ మంత్రి తన పర్యటనలో భాగంగా, మేధావుల బృందంతో కూడా సంభాషించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ యొక్క విక్సిత్ భారత్ విజన్ తో పాటు, ప్రజల సంక్షేమం కోసం ఆయన ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను వారితో పంచుకున్నారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రభుత్వం ఏ విధంగా అవిశ్రాంతంగా కృషి చేస్తోందో కూడా వారికి వివరించారు.
‘‘2014 సంవత్సరానికి ముందు ఈశాన్య ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. రహదారులు, రైల్వే లేదా విమాన అనుసంధానత లేనందున పెట్టుబడిదారులు ఈ ప్రాంతానికి దూరంగా ఉండేవారు. ఈ రోజు, ఈ ప్రాంతం, దేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే అనుసంధానించబడి ఉంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హయాంలో గత తొమ్మిదేళ్లలో ఈ ప్రాంతం గొప్ప పురోగతి సాధించింది. విదేశాలు సైతం మనతో పాలుపంచుకోవడానికి ఆసక్తిగా ఉన్నాయి.” అని శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ వివరించారు.
కేంద్ర మంత్రి తన ఇతర కార్యక్రమాల్లో భాగంగా, అఖిల భారతీయ సఫాయి మజ్దూర్ సంఘ్ జాతీయ కార్యదర్శి శ్రీమతి తనూజ్ సాహా ని కలిశారు. కార్మికుల గౌరవాన్ని పెంపొందించినందుకు వారు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రి తిరిగి ఈ సాయంత్రం మంత్రి ఢిల్లీ చేరుకోనున్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంత్రివర్గంలో మంత్రి అయిన తర్వాత శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ త్రిపురలో అధికారికంగా పర్యటించడం ఇది రెండవ సారి. గతంలో ఆయన 2022 ఆగస్టులో త్రిపురలో పర్యటించి, తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు.
*****
(Release ID: 1930621)
Visitor Counter : 151