భారత పోటీ ప్రోత్సాహక సంఘం
ఆకో టెక్‌లో అదనపు వాటాను జనరల్ అట్లాంటిక్ కొనుగోలు చేసేందుకు సిసిఐ ఆమోదం
Posted On:
07 JUN 2023 4:52PM by PIB Hyderabad
ఆకో టెక్‌లో అదనపు వాటాను జనరల్ అట్లాంటిక్ కొనుగోలు చేసేందుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఆమోదాన్ని తెలిపింది.
అకో టెక్నాలజీ అండ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆకో టెక్) అదనంగా 4.04% వాటాను జనరల్ అట్లాంటిక్ సింగపూర్ ఆక్ ప్రైవేట్ లిమిటెడ్ (జిఎఎస్ఎసికె) ఈ ప్రతిపాదిత కలయిక ద్వారా కొనుగోలు చేయాలన్నది ఉద్దేశ్యం.
జనరల్ అట్లాంటిక్ నియంత్రణలోని వాహనాలు లేదా పెట్టుబడుల ద్వారా నిర్వహిస్తున్న పెట్టుబడులను పెట్టే కంపెనీ జిఎఎస్ఎసికె.
తన అనుబంధ సంస్థ ఆకో జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ (ఆకో జిఐ) ద్వారా సాధారణ బీమా ( నాన్ లైఫ్) బీమాను అందించే వ్యాపారంలో ఆకో టెక్ నిమగ్నమై ఉంది.
కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (కలయికలకు సంబందించిన వ్యాపార లావాదేవీలకు సంబంధించిన విధానం), నిబంధనలు 2011లోని నిబంధన 19 (2) కింద జిఎఎస్ఎకె & జిపి బెర్ముడా, ఎల్.పి. సంయుక్తంగా అందించిన సవరణలకు లోబడి ప్రతిపాదిత కలయికను కమిషన్ ఆమోదించింది.
సిసిఐ వివరణాత్మక ఉత్తర్వులు త్వరలో జారీ కానున్నాయి.
***
(Release ID: 1930617)
Visitor Counter : 161