విద్యుత్తు మంత్రిత్వ శాఖ

భార‌త‌- స్కాండినేవియ‌న్ నాయ‌క‌త్వ స‌ద‌స్సు, వ‌ర్క్‌షాప్‌ను నిర్వహించిన ఎన్ టిపిసి స్కూల్ ఆఫ్ బిజినెస్

Posted On: 07 JUN 2023 12:17PM by PIB Hyderabad

ఎన్‌టిపిసి స్కూల్ ఆఫ్ బిజినెస్ త‌న నోయిడా ఆవ‌ర‌ణ‌లో 6 జూన్ 2023న భార‌త్‌- స్కాండినేవియ‌న్ నాయ‌క‌త్వ స‌ద‌స్సును, వ‌ర్క్‌షాప్‌ను నిర్వ‌హించింది. వివిధ భౌగోళిక ప్రాంతాల‌కు చెందిన మేధావులు, ఆలోచ‌నాప‌రులు మారుతున్న ఆర్ధిక‌, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిస‌రాల నేప‌థ్యంలో అందుకు అనుగుణంగా మారుతున్న సంస్కృతులు, సంవేద‌న‌ల అనుస‌ర‌ణ‌కు తోడ్ప‌డేందుకు అవ‌స‌ర‌మైన మాన‌సిక‌ సంసిద్ద‌త‌ల‌పై చ‌ర్చించారు.  స‌మ్మిళ‌త స్థాయిని పెంచాల‌ని పిలుపిచ్చే ప్ర‌పంచంలో సంద‌ర్భ‌శుద్ధి, ల‌క్ష్య లేదా ప్ర‌యోజ‌న నిర్దేశానికి ఇది అత్య‌వ‌స‌ర‌మ‌ని గుర్తించి ఈ స‌ద‌స్సును నిర్వ‌హించ‌డం జ‌రిగింది.  విప‌త్తు నివార‌ణ‌, సామాజిక సాధికార‌త‌, ఇంధ‌న సామ‌ర్ధ్యం, ఉద్గారాల త‌గ్గింపు, ఉన్న‌త మేనేజ్‌మెంట్ విద్య‌; ద్వైపాక్షిక & బ‌హుళ‌పాక్షిక ఫోరంలు, ప‌రిశోధ‌కులు స‌హా మొత్తం 150 మంది ప్ర‌ముఖ నిపుణులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. 
క‌ల‌ర్డ్ మెద‌డు రూప‌రేఖ‌లు, కోణాల‌ విశ్లేష‌ణ‌ను, డైరెక్టివ్ క‌మ్యూనికేష‌న్ మెథ‌డాల‌జీ (త‌క్కువ జ్ఞానం, సామ‌ర్ధ్యం, ఆత్మ‌విశ్వాసం ఉన్న‌వారితో మాట్లాడేట‌ప్పుడు మ‌నం అనుస‌రించే ప‌ద్ద‌తి లేదా ఒక ప‌ని ప‌ట్ల ప్రేరణ‌ను సృష్టించే ప‌ద్ద‌తి) ప్ర‌తిపాదించిన డాక్ట‌ర్ ఆర్థ‌ర్ కార్మాజీ ప‌ట్టి చూపారు. 
నాయ‌క‌త్వ ప్ర‌ధాన ల‌క్ష‌ణాలైన స‌మ‌గ్ర‌త‌, విశ్వ‌స‌నీయ‌త‌ల ప్రాముఖ్య‌త‌ను ఐఐఎం అహ్మ‌దాబాద్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ భార‌త్ భాస్క‌ర్ నొక్కి చెప్పారు. 
ఆస‌క్తి, స‌హ‌కారం, నిబ‌ద్ద‌త‌, సాహ‌సం, సాంస్కృతిక మేధ‌స్సు, పాత ఆలోచ‌న‌ల‌ను విడిచిపెట్ట‌డం, తిరిగి అభ్య‌సించ‌డం, మెద‌డు క్షితిజాల‌ను విస్త‌రింప‌చేసుకోవ‌డానికి సంసిద్ధ‌త అన్న‌వి ఆరు నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల చిహ్నాల‌ని డెలాయిట్ ఇండియా భాగ‌స్వామి ఎస్‌.వి.నాథ‌న్ పేర్కొన్నారు. 
అంత‌ర్గ‌త నాయ‌క‌త్వం, మ‌నఃప్ర‌వృత్తి - భ‌ద్ర‌త గురించి డాక్ట‌ర్ హ‌కాన్ స్వెన్నెర్‌స్టాల్ మాట్లాడారు. 
ప‌రిశ్ర‌మ నాయ‌కుల రూప‌రేఖ‌ల‌ను ఎన్‌టిపిసి డైరెక్ట‌ర్ (హెచ్ఆర్‌) డికె పటేల్ ప‌ట్టి చూపారు. 
వాతావ‌ర‌ణ స‌మ‌ర్ధ‌వంత‌మైన చ‌ర్య‌ల పోర్ట్ ఫోలియా (వాటాల జాబితా) ద్వారా భార‌త దేశం త‌న‌ అభివృద్ధి ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చుకోవ‌డానికి ఎన్‌టిపిసి సార‌థ్య దార్శ‌నిక‌త‌పై దృష్టితో ఎన్‌టిపిసి సిఎండి గురుదీప్ సింగ్ అధ్య‌క్షోప‌న్యాసం చేశారు.
ఇవి జి20లో భార‌త‌దేశ వ్యూహాత్మ‌క పాత్ర‌కు అనుగుణంగా జాతీయ‌, ప్రాంతీయ ప్ర‌పంచ స్థాయిల్లో సంబంధిత ఆర్దిక‌, ప‌ర్యావ‌ర‌ణ ల‌బ్దిని నిర్ధారిస్తాయి.  

 

****
 



(Release ID: 1930502) Visitor Counter : 135


Read this release in: English , Urdu , Hindi , Tamil