చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఇంటింటికీ న్యాయ సేవల సహాయ ప్రచారం


- పశ్చిమ త్రిపుర జిల్లా న్యాయ సేవల విభాగం అధ్వర్యంలో కార్యక్రమం

प्रविष्टि तिथि: 05 JUN 2023 7:20PM by PIB Hyderabad

పశ్చిమ త్రిపుర జిల్లా న్యాయ సేవల విభాగం ఇంటింటికీ న్యాయ సేవల సహాయ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించింది. న్యాయశాఖ న్యాయ బంధు ఆధ్వర్యంలో ప్రో బోనో క్లబ్, ఇక్ఫాయ్ (ఐసీఎఫ్ఏఐ)  లా స్కూల్, ఇక్ఫాయ్ విశ్వవిద్యాలయం, త్రిపుర జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ వెస్ట్ త్రిపురతో కలిసి పశ్చిమ కమల్‌ఘాట్ గ్రామంలో ఇంటింటికీ న్యాయ సహాయ ప్రచార సందర్శనను నిర్వహించింది. కార్యక్రమంలో భాగంగా ప్రో బోనో క్లబ్ సభ్యులు పశ్చిమ కమల్‌ఘాట్ గ్రామంలో ఇంటింటికీ వెళ్లి న్యాయ సహాయ ప్రచార సందర్శనను నిర్వహించారు. క్లబ్ సభ్యులు గ్రామస్తులతో ముచ్చటించారు. న్యాయ బంధు (ప్రో బోనో లీగల్ సర్వీసెస్) ప్రాథమిక చొరవ దేశవ్యాప్తంగా ప్రో బోనో లీగల్ సర్వీసెస్ పంపిణీ కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం. న్యాయ బంధు కింద ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులు, వారి సమయాన్ని మరియు సేవలను స్వచ్ఛందంగా అందించడానికి ఆసక్తి కలిగి ఉంటారు. మొబైల్ టెక్నాలజీ ద్వారా అర్హులైన అట్టడుగు లబ్ధిదారులతో వీరు అనుసంధానించబడ్డారు. న్యాయ బంధు మొబైల్ అప్లికేషన్ (ఆండ్రాయిడ్/ ఐఓఎస్) అభివృద్ధి చేయబడింది మరియు ఉమంగ్ ప్లాట్‌ఫారమ్‌లో సాంకేతిక భాగస్వామి. సి.ఎస్.సి ఈ-గవర్నెన్స్ సహకారంతో ఆన్‌బోర్డ్ చేయబడింది. 

 

***


(रिलीज़ आईडी: 1930261) आगंतुक पटल : 175
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Manipuri