నౌకారవాణా మంత్రిత్వ శాఖ

సముద్ర వాణిజ్య సామర్థ్యాన్ని పెంపొందించడానికి బీబీఐఎన్ఎం దేశాల మధ్య మరింత సహకారం కోసం కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ పిలుపునిచ్చారు


వాణిజ్య ప్రతినిధులతో పాటు బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్ మరియు నేపాల్ దౌత్య రాయబారులు పాల్గొన్న లబ్దిదారుల సమావేశం

యాక్ట్ ఈస్ట్ పాలసీకి ప్రభుత్వ నిబద్ధత సంపూర్ణమైనది, శ్యామ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ ఈ ప్రాంతంలో సముద్ర రంగం వృద్ధికి నాందిగా పని చేస్తుంది: కేంద్ర మంత్రి
శ్రీ సర్బానంద సోనోవాల్

ఈశాన్య భారత ఆర్థిక పునరుద్ధరణకు మోదీ ప్రభుత్వం నిబద్ధతతో ఉంది: సోనోవాల్

Posted On: 04 JUN 2023 6:14PM by PIB Hyderabad

ఈరోజు కోల్‌కతాలో జరిగిన బంగాళాఖాతం ప్రాంతంలో సముద్ర అభివృద్ధిలో లబ్దిదారుల కీలక సమావేశానికి ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల శాఖ సహాయ మంత్రి శ్రీ శంతను ఠాకూర్‌తో పాటు కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాలు మరియు ఆయుష్ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ హాజరయ్యారు.   భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్ మరియు నేపాల్ రాయబారులతో పాటు పరిశ్రమ మరియు వాణిజ్య ప్రతినిధులతో సంభాషించిన తరువాత మంత్రి ఈ ప్రాంతంలోని సముద్ర రంగంలో విలువను వృద్ధి చేయడం కోసం వాటాదారులందరి మధ్య మరింత సహకారం కోసం పిలుపునిచ్చారు. భారతదేశం యొక్క తూర్పు ప్రాంతం అలాగే భారతదేశం యొక్క పొరుగు దేశాలైన భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్ మరియు నేపాల్ అభివృద్ధికి యాక్ట్ ఈస్ట్ పాలసీ గరిష్ట సామర్థ్యాన్ని చేరుకోవడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని శ్రీ సోనోవాల్ నొక్కిచెప్పారు. సెయిల్, టాటా స్టీల్, ఐ ఓ సి, హల్దియా పెట్రోకెమికల్స్ లిమిటెడ్, బీ పీ సీ ఎల్, జిందాల్ స్టీల్, మేసెర్క్ షిప్పింగ్ లైన్స్ మరియు కార్పొరేట్ ప్రపంచంలోని అనేక ఇతర సీనియర్ నాయకులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ, “ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ యొక్క చురుకైన నాయకత్వంలో, ప్రభుత్వం యొక్క యాక్ట్ ఈస్ట్ పాలసీ అపూర్వమైన ఊపందుకుంది, ఈ ప్రాంతంలో అభివృద్ధి లో నూతన యుగానికి నాంది పలికింది. ప్రధాన మంత్రి గతి శక్తి జాతీయ   మాస్టర్ ప్లాన్ రవాణా నమూనాను హేతుబద్ధీకరించడానికి మరియు ఆకర్షణీయమైన వ్యాపార ప్రతిపాదనను రూపొందించడానికి మరొక ప్రోత్సాహం. సముద్ర రంగం అలాగే అంతర్గత జలమార్గాల రంగం ఈ దూరదృష్టితో కూడిన రవాణా పథకంలో మార్పుకు ప్రధాన చోదకాలు. దీనికి సుస్థిరమైన మరియు సమర్థవంతమైన ఆర్థికం గా చౌకైన  కార్గో రవాణా ను మార్చే అవకాశం ఉంది. ఈ చిరస్మరణీయ ప్రయాణంలో, ప్రతి ఒక్కరికీ గరిష్ట విలువ సృష్టిని అందించడానికి మీ క్రియాశీల మద్దతు మరియు వేగవంతమైన సహకారాన్ని మేము కోరుకుంటున్నాము.

 

బంగ్లాదేశ్/ ఈశాన్య ప్రాంతం/మయన్మార్ ద్వారా ఈశాన్య కార్గో రవాణాను నిర్ధారించడం కోసం జాతీయ జలమార్గాలు 1 మరియు 2 ద్వారా వాణిజ్యం, ఎస్ ఎం పీ మధ్య వస్తువుల రవాణాను సులభతరం చేయడం ద్వారా బంగ్లాదేశ్‌తో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడం, కోల్‌కతా మరియు బంగ్లాదేశ్‌లోని వివిధ నౌకాశ్రయాలు (చిట్టగాంగ్, మోంగ్లా) ఐ డబ్ల్యు ఏ ఐ ని కలిగి ఉన్నాయి; కే ఎం ఎం టీ టీ పీ లో భాగంగా, మిజోరాం మీదుగా ఈశాన్య ప్రాంతంకు కార్గోను రవాణా చేయడానికి మయన్మార్‌లోని మయన్మార్ యొక్క సిట్వే పోర్ట్‌తో సహకారం; ఎస్ టీ ఎస్ /ట్రాన్స్‌షిప్‌మెంట్ కార్యకలాపాల కోసం  డ్రాఫ్ట్ పరిమితులను అధిగమించడానికి ఎస్ ఎం పీ ఎక్ పరిమితుల్లో డీప్ డ్రాఫ్టెడ్ ఫెసిలిటీలను ఉపయోగించడం; పీ పీ పీ మోడ్ ద్వారా ఎస్ ఎం పీ కే  వద్ద సామర్థ్య మెరుగుదలలు వంటివి సమావేశంలో చర్చించబడిన కొన్ని ముఖ్య అంశాలు. 

 

శ్రీ సర్బానంద సోనోవాల్ ఇంకా మాట్లాడుతూ, “యాక్ట్ ఈస్ట్ విధానం భారతదేశం యొక్క తూర్పు భాగానికి మాత్రమే కాకుండా, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్ మరియు మయన్మార్‌ల వాణిజ్య మరియు వ్యాపార ప్రయోజనాల కోసం వృద్ధికి నాంది పలికింది. వారణాసి నుండి బంగ్లాదేశ్ మీదుగా దిబ్రూఘర్ వరకు ప్రయాణించిన గంగా విలాస్ పర్యాటక విజయం, దక్షిణాసియా ప్రాంతంలో జల పర్యాటక రంగం యొక్క గొప్ప సంభావ్యతను పెంచింది, ఇది మన గొప్ప సంస్కృతి మరియు వారసత్వాన్ని ప్రదర్శిస్తుంది. అదేవిధంగా, మేము ఈశాన్య భారతదేశంతో పాటు భూటాన్ మరియు బంగ్లాదేశ్‌లకు కొత్త మార్గాన్ని తెరిచే మయన్మార్‌లోని వ్యూహాత్మక సిట్వే పోర్ట్‌లో విజయవంతంగా ఆపరేషన్‌ను ప్రారంభించాము. మేము ఈ ప్రాంతంలో సముద్ర రంగం అభివృద్ధి పట్ల మా నిబద్ధతను ధృవీకరిస్తున్నాము మరియు ఈ ప్రాంతంలో  అభివృద్ధికి మా అంతర్గత నదీతీర వ్యవస్థను ఉపయోగించి రవాణా పరిష్కారాలను శక్తివంతం చేయడం ద్వారా విలువను మెరుగు పరుస్తాము. ఇది  ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారి ‘సబ్కా సాత్, సబ్కా వికాస్’ దార్శనికతకు నిజమైన ప్రతిబింబం.

ఐ బీ పీ/కే ఎం ఎం టీ టీ పీ మార్గం ద్వారా గంగా నది మరియు బ్రహ్మపుత్ర నది ద్వారా అంతర్గత జల రవాణాను పెంచడం గురించి ఐ డబ్ల్యు ఏ ఐ /అనుబంధ భాగస్వాములతో చర్చతో సమావేశం ప్రారంభమైంది. దీని తర్వాత భారతదేశ పొరుగు దేశాల (నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్) కాన్సుల్ జనరల్‌లతో మంత్రుల ఇంటరాక్టివ్ సమావేశం జరిగింది.  బహుముఖ కార్యక్రమాల సహాయంతో నిరంతర సహకారం మరియు ఎంటర్‌ప్రైజ్ ద్వారా 2013-14 నుండి ఎస్ ఎం పీ కే మరియు ఈ ప్రాంతం మొత్తంగా  వాణిజ్యం వృద్ధి చెందడంలో కీలక పాత్ర పోషించినందుకు కేంద్ర మంత్రి వాటాదారులను ప్రశంసించారు.

 

****



(Release ID: 1929804) Visitor Counter : 137