ఆర్థిక మంత్రిత్వ శాఖ
ముంబై విమానాశ్రయంలో సుమారు రూ. 6.2 కోట్ల విలువైన 10 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న డిఆర్ఐ, 2 అరెస్టు
Posted On:
04 JUN 2023 8:34PM by PIB Hyderabad
రెండు వేర్వేరు కేసుల్లో 3 & 4 జూన్ 2023న డైరొక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్ఐ) ముంబై 10కిలోలకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకుంది.
మొదటి కేసులో, నిర్ధిష్ట నిఘా సమాచార ఆధారంగా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ నెం.IX 252లో షార్జా నుంచి ముంబై వచ్చిన 2 ప్రయాణీకులను అడ్డుకున్నారు. ఆ ఇద్దరు ప్రయాణీకులను తనిఖీ చేస్తున్నప్పుడు విదేశీ గుర్తులు ఉన్న 8కిలోల 24 కారట్ల బంగారాన్ని 8 బంగారు కడ్డీల రూపంలో తమ నడుముకు చుట్టి దాచుకున్న విషయాన్ని కనుగొన్నారు. తదుపరి నిఘా సమాచారంపై తక్షణమే స్పందించి, ఈ ప్రయాణీకుల సహచరుడిని అదుపులోకి తీసుకున్నారు. పరీక్షలలో స్వాధీనం చేసుకున్న కడ్డీ రూపంలోని 8కేజీల బంగారం విలువ రూ. 4.94 కోట్లు. మొదటి కేసులో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు.
రెండవ కేసులో, దుబాయ్ నుంచి వస్తున్న ఒక భారతీయుడిని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ (సిఎస్ఎంఐ) విమానాశ్రయంలో 3 జూన్ 2023న అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు. ఆ ప్రయాణీకుడి బ్యాగేజ్‌ను పరీక్షిస్తుండగా, మహిళలు వాడే క్లచ్ పర్సులను గుర్తించారు. ఈ మొత్తం పర్సులకీ 24 క్యారెట్ల బంగారాన్ని వెండి రంగు మెటల్ వైర్ల రూపంలో తెలివిగా పర్సుల లోహపు బద్దల కిందదాచి పెట్టడాన్ని కనుగొన్నారు.
ఈ కనుగొన్న బంగారు వైర్లు నికర బరువు 2004 గ్రాములు, తాత్కాలిక విలువ రూ. 1,23,80,875. ఈ కేసులో ఆ ప్రయాణీకుడిని అరెస్టు చేయడం జరిగింది. రెండవ కేసులో బాగా చదువుకున్న వ్యక్తులు బంగారం స్మగ్లింగ్‌కు ప్రణాళికలు వేసి, అమలు చేయడంలో ప్రత్యక్షంగా ప్రమేయాన్ని కలిగి ఉన్నారని తెలుస్తోంది.
రెండు కేసులలో కార్యనిర్వహణ పద్ధతి వినూత్నంగా ఉండటంగా కనుగొన్నారు. ఇది దేశంలోకి వివిధ రూపాల్లో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న సిండికేట్‌లను తనిఖీ చేయడానికి డిఆర్ఐ అధికారులు నిత్యం ఎదుర్కొంటున్న కొత్త సవాళ్లను సూచిస్తుంది.
ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో వెండి రంగు లోహపు వైర్ల రూపంలో విదేశీ ముద్ర బంగారం, దానితో పాటుగా కడ్డీల రూపంలో 24 క్యారెట్ల బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం అన్నది బంగారం స్మగ్లింగ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి గుర్తుగా చెప్పుకోవచ్చు
దాదాపు రూ. 6.2 కోట్ల విలువైన దాదాపు 10కిలోల బంగారాన్ని మొత్తం 4 ప్రయాణీకుల నుంచి స్వాధీనం చేసుకుని, ఈ కేసులలో వారిని అరెస్టు చేయడం జరిగింది. తదుపరి దర్యాప్తు, విచారణలు కొనసాగుతున్నాయి.
***
(Release ID: 1929799)
Visitor Counter : 161