రక్షణ మంత్రిత్వ శాఖ
హరిత చొరవలు తీసుకొంటూ ముందుకు సాగుతున్న భారత నౌకాదళం
-హరిత సాంకేతికతలను అందిపుచ్చుకోవడం
Posted On:
04 JUN 2023 6:37PM by PIB Hyderabad
నావికాదళం స్వీయ-ఆధారితంగా మరియు పర్యావరణ బాధ్యత కలిగిన శక్తిగా, పర్యావరణ పరిరక్షణ మరియు హరిత కార్యక్రమాలకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంది. సముద్రాల సంరక్షకుడిగా నౌకాదళం అధిక శక్తి తీవ్రత కలిగిన అనేక నౌకలు, జలాంతర్గాములు మరియు విమానాలను ఉపయోగిస్తోంది. నావికాదళం చేపట్టే ప్రతి ఆపరేషన్, ప్రక్రియలో శక్తి సామర్థ్యాన్ని పెంచడం చాలా ముఖ్యమైనది. ‘క్లీన్ అండ్ గ్రీన్ నేవీ’కి సంబంధించి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను గురించి కిందన వివరించబడ్డాయి.
భారత నావికాదళం భారత ప్రభుత్వం యొక్క ‘జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్ (జేఎన్ఎన్ఎస్ఎం)’ మిషన్ను నెరవేర్చే నావికాదళ లక్ష్యానికి అనుగుణంగా 15.87మెగా వాట్ల సంచిత సామర్థ్యంతో సౌర శక్తి మిషన్ ను ప్రారంభించింది. ఈ ప్లాంటులు కంప్యూటరైజ్డ్ మానిటరింగ్ & కంట్రోల్తో సింగిల్-యాక్సిస్ సన్ ట్రాకింగ్ టెక్నాలజీని ఉపయోగించి గ్రిడ్-కనెక్ట్ చేయబడ్డాయి. అదనంగా ఎస్పీవీల యొక్క 16 మెగా వాట్ల సామర్థ్యపు అమలులో వివిధ దశల్లో ఉన్నాయి. తొలి చొరవగా, డీజిల్ ఇంజిన్ ఉద్గారాలను తగ్గించడం కోసం మెస్సర్స్ చక్ర్ ఇన్నోవేషన్స్చే అభివృద్ధి చేయబడిన స్వదేశీ తయారీ మరియు పేటెంట్ పొందిన రెట్రోఫిట్ పరికరం దీర్ఘకాలిక ట్రయల్స్ కోసం తీరం-ఆధారిత డీజిల్ జనరేటర్లో వ్యవస్థాపించబడింది. ఇంజిన్ నుంచి బయటకు వెలువడే ఉద్గారాలలో హైడ్రోకార్బన్, కార్బన్ మోనాక్సైడ్, పార్టిక్యులేట్ మ్యాటర్లలో 70% తగ్గింపును ట్రయల్స్ సూచించాయి. డీజిల్ ఇంజిన్ ఎగ్జాస్ట్ ఉద్గార తగ్గింపు కోసం రెట్రోఫిట్ పరికరం అన్ని భూ-ఆధారిత డీజిల్ జెన్సెట్లలో దశల వారీగా ప్రవేశపెట్టనున్నారు. ఇవి ఒకసారి ప్రవేశపెడితే, ఉద్గారాల స్థాయిలను మరింత తగ్గించే దిశగా నౌకాదళానికి ఇది తోడ్పాటును అందిస్తుంది. నౌకాదళపు నౌకాశ్రయాల వద్ద చమురు చిందటాలను ఎదుర్కోవడానికి, పర్యావరణ అనుకూల సముద్ర జీవ-నివారణ ఏజెంట్లు ఎన్ఎంఆర్ఎల్ ద్వారా దేశీయంగా అభివృద్ధి చేయబడ్డాయి. ఇవి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సముద్ర ప్రాంతానికే ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి.
ఇది సూక్ష్మ-జీవుల కలయిక మరియు వాటి పెరుగుదల ఉద్దీపన అంశాలను కలిగి ఉంటుంది, ఇవి డీజిల్, కందెన, మురికి నూనెలు మొదలైన వివిధ రకాల నూనెలను వినియోగిస్తాయి, తద్వారా సముద్రపు నీటిని ఏదైనా చమురు కాలుష్యం నుండి శుభ్రపరుస్తుంది. ఫలితంగా సముద్ర పర్యావరణ వ్యవస్థ దెబ్బ తినకుండా ఉంటుంది. ఐఐఎస్సీ (బెంగళూరు) సహకారంతో భారత నౌకాదళం సహజ శీతలకరణి కార్బన్ డై ఆక్సైడ్ ఆధారంగా దేశంలో 100కేవీ కెపాసిటీ గల ఏసీ ప్లాంట్‌ను 'మొదటిసారిగా' ప్రారంభించింది. జీడబ్ల్యుపీ 1తో సహజ శీతలకరణిని ఉపయోగించడం ద్వారా అధిక గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ (జీడబ్ల్యుపీ) ఉన్న సాంప్రదాయ హెచ్.సి.ఎఫ్.సి.ల వినియోగాన్ని తగ్గించడానికి ఇది ఒక ముఖ్యమైన అడుగుగా నిలవనుంది. భారతదేశం ఆమోదించిన 2016 కిగాలీ ఒప్పందానికి ఇది అనుగుణంగా ఉండనుంది. ట్రయల్స్ మరియు పనితీరు తెలుసుకొనేందుకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (మెరైన్ ఇంజినీరింగ్) ఐఎన్ఎస్ శివాజీ వద్ద ఈ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ప్లాంట్ 850 గంటలపాటు విజయవంతంగా పనిచేసింది. ఇంధనం యొక్క సంభావ్య ప్రత్యామ్నాయ వనరుగా హైడ్రోజన్ను ఉపయోగించడం కూడా ఐఎన్ కొనసాగిస్తోంది. హైడ్రోజన్ ఆస్పిరేటెడ్ డీజిల్ ఇంజిన్ యొక్క విజయవంతమైన తీర ట్రయల్స్ పూర్తయ్యాయి. ఇది శుభ్రమైన దహనాన్ని మెరుగుపరిచింది తద్వారా CO ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తుంది. పైలట్ ట్రయల్స్ కోసం పరికరం ఇప్పుడు ఓడలో అమర్చబడింది. ఇంకా భారత ప్రభుత్వపు మేక్ ఇన్ ఇండియా చొరవకు అనుగుణంగా షిప్యార్డులతో హైడ్రోజన్ ఇంధన కణాలతో నడిచే ఫెర్రీ క్రాఫ్ట్ అభివృద్ధి ప్రాజెక్ట్ కూడా కొనసాగుతోంది. వాహన ఉద్గారాలను తగ్గించడానికి వాడిన వంట నూనె-ఆధారిత బయోడీజిల్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగం కూడా గత సంవత్సరంలో వేగవంతమైంది. నేవీ యొక్క మోటారు రవాణా వాహనాలలో మొత్తం 192కేఎల్ బి-7 మిశ్రమ బయోడీజిల్ ఉపయోగించబడింది. భారత నావికాదళం మొత్తం కార్బన్ పాదముద్రను తగ్గించడానికి మరియు పర్యావరణ సుస్థిరతను పెంపొందించడానికి, 'మన తరువాతి తరాలకు పచ్చదనం మరియు పరిశుభ్రమైన భవిష్యత్తు'ను నిర్ధారించడానికి, జాతీయ లక్ష్యాన్ని సాకారం చేస్తూ, హరిత కార్యక్రమాల సాధన దిశగా సాగేందుకు 'సన్నద్ధమైంది మరియు నిబద్ధతతో' ఉంది.
***
(Release ID: 1929784)
Visitor Counter : 217