సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గత 9 సంవత్సరాల్లో శ్రీ మోదీ ప్రభుత్వం ఉపాధి కల్పన పైనే కాదు, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ నిర్మాణంపై కూడా దృష్టి సారించింది : డాక్టర్ జితేంద్ర సింగ్


‘‘భారత యువత నేడు ఏ మాత్రం ప్రభుత్వోద్యోగంలోని భద్రత కోరుకోవడంలేదు. వారు కీలక రంగాల్లోకి అడుగు పెట్టేందుకు, కొత్త అవకాశాలు అందిపుచ్చుకునేందుకు, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నారు’’


స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా కోట్లాది ఉపాధి అవకాశాలు సృష్టిస్తున్నాయి : డాక్టర్ జితేంద్ర సింగ్

నాడు పోస్టు చేయడమైనది: 02 JUN 2023 4:54PM by PIB Hyderabad

గత 9 సంవత్సరాల కాలంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వ అతి పెద్ద విజయగాథ  స్టార్టప్  ల సంఖ్య గణనీయంగా పెరగడమేనని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ (స్వతంత్ర హోదా) మంత్రి; పిఎంఓ, అణు ఇంధనం, అంతరిక్షం;  సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖల  ఎంఓఎస్ డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

శనివారం యువజన సమ్మేళనంలో ప్రసంగిస్తూ 2014 సంవత్సరానికి ముందు కేవలం 350  స్టార్టప్  లుండేవి. కాని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2015 సంవత్సరంలో ఎర్రకోట బురుజుల నుంచి ప్రసంగిస్తూ ఉపాధి కల్పన శక్తులు కావాలని యువతకు పిలుపు ఇచ్చి, 2016 సంవత్సరంలో స్టార్టప్  స్కీమ్  పేరిట ప్రత్యేక పథకం ప్రారంభించిన తర్వాత స్టార్టప్  ల సంఖ్య విపరీతంగా పెరిగింది, దేశంలో 92,683 స్టార్టప్ లు, 115 పైగా యునికార్న్  లతో (100 కోట్ల డాలర్ల విలువ పైబడిన సంస్థలు) నేడు ప్రపంచంలోనే అతి భారీ స్టార్టప్  వ్యవస్థ ఉన్న మూడో పెద్ద దేశంగా భారత్ ఎదిగింది అన్నారు.

2022  సంవత్సరంలోనే పారిశ్రామిక ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య శాఖ (డిపిఐఐటి) 26,542 కంపెనీలకు స్టార్టప్  లుగా గుర్తించిందని మంత్రి చెప్పారు. 2017-2021  సంవత్సరాల మధ్య కాలంలో స్టార్టప్  లు దేశంలో 23 లక్షల ప్రత్యక్ష,  పరోక్ష ఉద్యోగాలను సృష్టించాయని నాస్కామ్ అధ్యయనం తెలుపుతోందన్నారు. అంతే కాదు, తాము ప్రత్యక్షంగా కోట్లాది ఉద్యోగాలు సృష్టించామని, ఇంకా ఎన్నో పరోక్ష ఉద్యోగాలు కూడా ఏర్పడ్డాయని స్టార్టప్  లు స్వయంగా నివేదించాయి.

భారత యువత క్రమంగా ప్రభుత్వోద్యోగాలు పొందాలనే ఆలోచనా ధోరణి నుంచి బయటపడుతున్నట్టు డాక్టర్  జితేంద్ర  సింగ్  తెలిపారు. భారత యువత కీలక రంగాల్లో కొత్త అవకాశాలు సృష్టించేందుకు సిద్ధపడుతున్నారు, వేలాది ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు అని చెప్పారు. ఉత్తరప్రదేశ్ లోని సంభల్  లో ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి  పొందిన యువతతో సంభాషిస్తూ గత 9 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం కేవలం ఉపాధి కల్పన పైనే దృష్టి సారించలేదు, ఎంటర్  ప్రెన్యూర్  షిప్  నిర్మాణానికి కృషి చేస్తోంది అని తెలిపారు.

స్టార్టప్  ఇండియా పథకంతో పాటుగా శ్రీ మోదీ  ప్రభుత్వం 2016 ఏప్రిల్ 5వ తేదీన స్టాండప్  ఇండియా పథకం కూడా ప్రారంభించింది అని డాక్టర్ జితేంద్ర మోదీ తెలిపారు. షెడ్యూల్డ్  కులాలు (ఎస్ సి) లేదా షెడ్యూల్డు తెగల (ఎస్ సి) పారిశ్రామికులకు, ప్రత్యేకించి ఒక్కో బ్రాంచి నుంచి ఒక మహిళా పారిశ్రామికవేత్తకు... ట్రేడింగ్,  సర్వీసులు, తయారీ రంగాల్లో కొత్త సంస్థ ఏర్పాటు చేసేందుకు రూ.10 లక్షల నుంచి రూ.1 కోటి మధ్య రుణాలందించడం ఈ  పథకం లక్ష్యం. కనీసం 2.5 లక్షల రుణగ్రహీతలకు లబ్ధి చేకూర్చాలనేది ఈ పథకం లక్ష్యం.

యువత దేశవ్యాప్తంగా ఈ కొత్త ఎంటర్  ప్రెన్యూర్లు కొత్త  స్టార్టప్  వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా కొత్త ఎంటర్  ప్రెన్యూర్లు, కొత్త ఉత్పత్తిదారులుగా మారాలని పిఎం శ్రీ మోదీ కోరుతున్నారని డాక్టర్  జితేంద్ర సింగ్  చెప్పారు. స్టార్టప్  లలో భారతదేశం ప్రపంచంలోనే నంబర్ వన్ కావాలన్నది పిఎం శ్రీ మోదీ కల అని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో దేశ భవిష్యత్తుకు  ‘‘స్టార్టప్  ఇండియా’’;  ‘‘స్టాండప్  ఇండియా’’ భరోసాగా నిలుస్తాయని పిఎం శ్రీ మోదీ గట్టి విశ్వాసంతో ఉన్నారని ఆయన చెప్పారు.

2021 సంవత్సరంలో భారత స్టార్టప్  లు 4400 కోట్ల డాలర్లు సమీకరించాయి, వాటిలో 50 కోట్ల డాలర్లకు పైబడిన డీల్స్  3300 కోట్ల డాలర్ల మేరకు ఉన్నాయి అని డాక్టర్  జితేంద్ర సింగ్  తెలిపారు. చాలా భారతీయ స్టార్టప్  ల వ్యవస్థాపకులు, సిబ్బంది, మార్కెట్  కూడా భారతదేశంలోనే ఉన్నప్పటికీ వాటి పుట్టుక మాత్రం విదేశాల్లోనే జరిగింది. అంతే కాదు, ఈ ‘‘విదేశీ స్టార్టప్’’లు లేదా ‘‘ఫ్లిప్డ్’’ స్టార్టప్ లే భారత యునికార్న్  లలో అత్యధికంగా ఉన్నాయి.

పిఎం శ్రీ మోదీ అంతరిక్ష రంగంలో కూడా ప్రైవేటు రంగం భాగస్వామ్యానికి ద్వారాలు తెరిచారని, ప్రస్తుతం ఇస్రో సుమారు 150 ప్రైవేట్  స్టార్టప్  లతో పని చేస్తున్నదని డాక్టర్  జితేంద్ర సింగ్ చెప్పారు. అంతే  కాదు, 2014 సంవత్సరానికి ముందు భారతదేశ బయో-ఎకానమీ విలువ 1000 కోట్ల డాలర్లుండేది, ఇప్పుడది 8000 కోట్ల డాలర్లకు మారిందని తెలిపారు. గత 8 సంవత్సరాల కాలంలో బయోటెక్  స్టార్టప్  ల సంఖ్య 100 రెట్లు  పెరిగిందంటూ 2014లో 52 ఉన్న స్టార్టప్  లు 2022 నాటికి 5300 అయ్యాయని ఆయన అన్నారు.

ఐటి. కంప్యూటర్, కమ్యూనికేషన్  రంగాలను దాటి ప్రత్యేకించి ఇంతవరకు ఎవరూ దృష్టి  సారించని రంగాలు, ఎంతో సంపన్నమైన వ్యవసాయ రంగం గురించి ఆలోచించాలని వర్థమాన స్టార్టప్  ఎంటర్  ప్రెన్యూర్లలకు డాక్టర్  జితేంద్ర సింగ్ సూచించారు. ప్రత్యేకించి వ్యవసాయ రంగం హరిత విప్లవం అనంతరం అతి పెద్ద టెక్నాలజీ విప్లవం కోసం ఎదురు చూస్తున్నదని ఆయన చెప్పారు. అగ్రి-టెక్   స్టార్టప్  లను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని పిలుపు ఇస్తూ భారత జనాభాలో 54 శాతం ప్రత్యక్షంగా వ్యవసాయంపై ఆధారపడి ఉండడంతో పాటు జిడిపిలో 20 శాతం వాటా అందిస్తున్న కారణంగా భారత ఆర్థిక వ్యవస్థకు కీలక మూలస్తంభాల్లో వ్యవసాయం ఒకటని మంత్రి చెప్పారు. 2014 సంవత్సరానికి ముందు ఆరోమా మిషన్ (సువాసనల ఉద్యమం)  లేదా పర్పుల్ విప్లవం గురించి ఎవరికీ తెలియదని, కాని నేడు లావెండర్  సాగు వ్యవసాయ టెక్ స్టార్టప్  ల పెరుగుదలకు దారి తీసిందని ఆయన అన్నారు. సిఎస్ఐఆర్  సమర్థవంతమైన మద్దతుతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆరోమా మిషన్  రైతుల ఆలోచనా ధోరణిని మార్చిందని, పలు పరిశ్రమల్లో వినియోగించే ఖరీదైన నూనెలు తయారుచేయడానికి అధిక  సంఖ్యలో రైతులు లావెండర్, నిమ్మగడ్డి, గులాబీ, బంతి సాగు చేపడుతున్నారని చెప్పారు. లీటరు రూ.9000 పలికే  ఈ నూనెలు అగర్ బత్తిల తయారీతో  పాటు రూమ్  స్ర్పేలు, కాస్మెటిక్స్, థెరప్యూటిక్స్  లో విరివిగా ఉపయోగిస్తారని మంత్రి చెప్పారు.

ఆరోమా మిషన్ దేశవ్యాప్తంగా ఎన్నో  స్టార్టప్  లు, వ్యవసాయదారులను ఆకర్షిస్తోంది. తొలి దశలో సిఎస్ఐఆర్  46 ఆకాంక్షాపూరిత జిల్లాలను కవర్  చేస్తూ 6,000 హెక్టార్ల భూమిలో సాగుకు సహకరించింది. 44,000 మందికి పైగా ప్రజలకు శిక్షణ ఇచ్చి, రైతులకు ఎన్నో కోట్ల ఆదాయం అందించింది. రెండో దశలో దేశంలో 45,000 మంది నిపుణులైన మానవ వనరులు తయారుచేయడం ద్వారా 75,000 వ్యవసాయ కుటుంబాలకు ప్రయోజనం కలిగించాలని  లక్ష్యంగా నిర్దేశించుకుంది.

2014 సంవత్సరంలో రూ.25,000 కోట్ల కన్నా తక్కువ ఉన్న వ్యవసాయ బడ్జెట్  నేడు రూ.1.25 లక్షల కోట్లకు చేరిందని ఆయన అన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాల వృద్ధి సామర్థ్యాన్ని వెలికి తీసేందుకు ప్రభుత్వం రూ.1 లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక వసతుల నిధిని ఏర్పాటు చేసిందన్నారు. దేశంలో పంటల  కోత అనంతర మౌలిక వసతులు, సామాజిక వ్యవసాయ ఆస్తులు ఏర్పాటు చేయడానికి 2020-21 నుంచి 2032-33 సంవత్సరాల మధ్య  కాలంలో అందుబాటులో ఉండే ఆర్థిక సహాయం ఇది. అలాగే ఈ ఏడాది బడ్జెట్లో అగ్రి-టెక్  స్టార్టప్  ల కోసం యాక్సిలరేటర్ ఫండ్స్ ఏర్పాటు చేస్తూ ఒక ప్రత్యేక ఏర్పాటు చేశారని, దాని కింద డిజిటల్  మౌలిక వసతులు నిర్మించడంతో పాటు ఫండింగ్ అవకాశాలు కూడా సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. ఇక ఉత్సాహంగా ముందుకు వచ్చి, తమ లక్ష్యాలు  సాధించేందుకు అడుగేయవలసిన బాధ్యత యువ ఎంటర్  ప్రెన్యూర్లదేనని చెప్పారు. 9 సంవత్సరాల క్రితం దేశంలో వ్యవసాయ స్టార్టప్  లు అతి తక్కువ సంఖ్యలో ఉండగా నేడవి 3,000 ఉన్నాయన్నారు. ఈ వ్యవసాయ స్టార్టప్  లకు ప్రారంభ స్థాయి నుంచి వృద్ధి స్థాయి వరకు విభిన్న స్థాయిల్లో మద్దతు ఇస్తున్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు చెందిన స్టార్టప్  లు ప్రెసిషన్  వ్యవసాయం, వ్యవసాయ యాంత్రికీకరణ; వ్యవసాయ లాజిస్టిక్స్ & సరఫరాల వ్యవస్థ, వ్యర్థాల నుంచి విద్యుత్, ఆర్గానిక్  వ్యవసాయం, పశు సంవర్థకం, డెయిరీ & ఫిషరీస్  వంటి విభిన్న విభాగాల్లో ఈ అగ్రి-స్టార్టప్  లు పని చేస్తున్నాయి.

గత 9  సంవత్సరాల కాలంలో శ్రీ మోదీ ప్రభుత్వం ప్రతీ ఒక్క భారతీయుని సాధికారం చేయడానికి పలు  సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించి అమలుపరిచిందని డాక్టర్ జితేంద్ర సింగ్  చెప్పారు. ముద్ర యోజన, స్టాండప్  ఇండియా వంటి పథకాల్లో అలాంటి తిరుగులేని సాధికారతను మనం చూడవచ్చు. ఇవి సమాజంలో నిరాదరణకు గురవుతున్న వర్గాల నుంచి పెద్ద సంఖ్యలో యువ ఎంటర్  ప్రెన్యూర్లను సృష్టిస్టున్నాయి. దేశంలో ఇప్పటివరకు ఇచ్చిన 40 కోట్ల ముద్ర రుణాల్లో సగానికి పైగా ఎస్ సి/ ఎస్ టి/ ఒబిసిలకు అందాయి.

పిఎం స్వనిధి స్కీమ్  కింద 34.5 లక్షల మంది వీధి వ్యాపారులు రుణాలు పొందారని, స్టాండప్  ఇండియా పథకం కింద రూ.7351 కోట్లకు పైబడిన రుణాలు ఎస్ సి &  ఎస్ టి లకు పంపిణీ చేశారని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.

యువతకు వ్యవస్థీకృత ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉంచేందుకు శ్రీ మోదీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇవ్వడమే ఈ విజయానికి కారణం అన్న విషయాన్ని ఎంప్లాయీ ప్రావిడెండ్ ఫండ్  పథకం ఖాతాల సంఖ్య పెరగడంలో మనం చూడవచ్చు. భారతదేశాన్ని ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యంగా చేసేందుకు నిరంతర ప్రయత్నాలు జరిగాయి. ఎంఎస్ఎంఇలకు సహాయం అందించడం, దేశీయ ఉత్పత్తిని పెంచడం కోసం ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల  పథకం ప్రవేశపెట్టడం వంటి చర్యలు యువతకు భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు  సృష్టించడానికి దారి తీశాయి. 2017 నుంచి 2023 జనవరి నెలల మధ్య కాలంలో 4.78 కొత్త ఇపిఎఫ్ ఓ చందాదారులు జోడయ్యారు. చివరికి మహమ్మారి తీవ్రత అధికంగా ఉన్న సమయంలో అంటే 2021-22 సంవత్సరంలో కూడా 1.2 కోట్ల కొత్త ఇపిఎప్ ఓ ఖాతాదారులు అదనంగా జోడయ్యారు.

దేశం స్వాతంత్ర్య సాధన 75 సంవత్సరాల అమృత కాలంలో ప్రవేశించిన తరుణంలో అమృత్-పీధిని ప్రోత్సహించడం ద్వారా శ్రీ మోదీ ప్రభుత్వం యువతకు ప్రాధాన్యం ఇస్తున్నదని డాక్టర్ జితేంద్ర సింగ్  చెప్పారు. నూతన విద్యా విధానం (ఎన్ఇపి) 2020 సుమారుగా 30 సంవత్సరాలుగా దేశంలో అమలులో ఉన్న విద్యావిధానాన్ని సమూలంగా ప్రక్షాళన చేసింది. పిఎం కౌశల్ వికాస్  యోజన ప్రారంభమైన నాటి నుంచి 1.37 కోట్ల మంది యువత నైపుణ్య శిక్షణ పొందారు. తద్వారా వాటి ఉపాధి అవకాశాలు ఎంతో మెరుగుపడ్డాయి. స్టాండప్  ఇండియా  పథకం కింద ఎస్ సి & ఎస్ టి లబ్ధిదారులకు రూ.7351  కోట్లకు పైబడి రుణాలు అందించారు. 2017-21 సంవత్సరాల మధ్య కాలంలో 23 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వం 10 లక్షల కేంద్రప్రభుత్వ ఉద్యోగాల కోసం రోజ్  గార్  మేళా పేరిట ప్రారంభించిన నియామకాల డ్రైవ్ ప్రారంభించింది. అగ్నిపథ్  స్కీమ్  ద్వారా యువత సాయుధ దళాల్లో సేవలందించే అవకాశం కూడా పొందుతున్నారు.

‘‘ప్రభుత్వ లక్ష్యం ఉపాధి అవకాశాలు సృష్టించడమే కాదు...యువతను ఉద్యోగార్ధుల స్థాయి నుంచి ఉపాధి సృష్టికర్తలుగా మార్చడం కోసం ఎంటర్  ప్రెన్యూర్ షిప్  ను నిర్మించడం’’ అని మంత్రి చెప్పారు. 

 

****


(రిలీజ్ ఐడి: 1929724) సందర్శకుల సూచీ సంఖ్య : : 144
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Manipuri