రక్షణ మంత్రిత్వ శాఖ
మాజీ సైనికోద్యోగులకు ఉపాధిని కల్పించేందుకు అవగాహనాపత్రంపై సంతకం చేసిన మాజీ సైనికోద్యోగుల సంక్షేమ విభాగం
Posted On:
02 JUN 2023 5:58PM by PIB Hyderabad
మాజీ సైనికోద్యోగులకు మరిన్ని ఉద్యోగాలను కల్పించేందుకు కార్పొరేట్ కంపెనీలను, మాజీ సైనికోద్యోగులను ఒక సామాన్య వేదికపైకి తెచ్చే కృషిలో భాగంగా మాజీ సైనికోద్యోగుల సంక్షేమ విభాగం ఆధీనంలోని డైరొక్టరేట్ జనరల్ రీసెటిల్‌మెంట్, రక్షణ మంత్రిత్వ శాఖ, ఎం/ ఎస్ అప్నాటైమ్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎపిఎన్ఎ.సిఒ) నేడు, 02 జూన్ 2023న న్యూఢిల్లీలో అవగాహనాపత్రంపై సంతకాలు చేశాయి. మాజీ సైనికోద్యోగులు పౌర జీవనంలోకి పరివర్తన చెందుతున్న సమయంలో వారికి తోడ్పాటునందించేందుకు ఇది గౌరవనీయమైన వృత్తిని అందించాలన్న లక్ష్యాన్ని ఇది నెరవేరుస్తుంది. దీనికి అదనంగా, నైపుణ్యం కలిగిన మానవవనరులు, స్థానికంగా అందుబాటులో ఉన్న వృత్తిపరమైన అవకాశాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గిస్తుంది.
***
(Release ID: 1929602)
Visitor Counter : 164