పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
పర్యావరణ పరిహార ఛార్జీలు (ఈసి) విధింపు మరియు ప్రాసిక్యూషన్ ప్రారంభించడంపై ఆదేశాలు జారీ చేసిన సిఏక్యూఎం
ప్రస్తుత సంవత్సరం 2023లో (జనవరి - మే) 2,901 ఆకస్మిక తనిఖీలు మరియు క్షేత్రస్థాయి అజ్ఞాత తనిఖీలను నిర్వహించిన ఫ్లయింగ్ స్క్వాడ్‌లు
ఆమోదం పొందని ఇంధనాలను ఉపయోగిస్తున్న 51 పారిశ్రామిక యూనిట్ల మూసివేతకు ఆదేశాలు జారీ..వీటిలో 8 యూనిట్లు బొగ్గును ఉపయోగిస్తున్నాయి
సరైన దిద్దుబాటు చర్యలు మరియు వాయు కాలుష్య నియంత్రణ నిబంధనలను పాటించిన తర్వాత 201 యూనిట్లు/ సంస్థలకు సంబంధించి పునఃప్రారంభ ఆదేశాలు జారీ
Posted On:
01 JUN 2023 5:16PM by PIB Hyderabad
నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సిఆర్)లో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ఎన్‌సిఆర్ మరియు పరిసర ప్రాంతాలలో (సిఏక్యూఎం) కమీషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ ఏర్పాటు చేసిన 40 తనిఖీ బృందాలు/ఫ్లయింగ్ స్క్వాడ్‌లు వాయు కాలుష్య నియంత్రణ చట్టాలకు అనుగుణంగా తనిఖీలు మరియు అమలును ముమ్మరం చేశాయి.
ప్రస్తుత సంవత్సరంలో 2023 (జనవరి - మే) ఫ్లయింగ్ స్క్వాడ్‌లు ఎన్‌సీఆర్‌లోని పారిశ్రామిక యూనిట్లు, నిర్మాణ & కూల్చివేత (సి&డి) సైట్‌లు, డీజిల్ జనరేటర్ సెట్‌లు (డీజిల్ జనరేటర్‌ని ఉపయోగించే వాణిజ్య/ నివాస యూనిట్లు) వాయు కాలుష్య హాట్‌స్పాట్‌లు సహా వివిధ ప్రదేశాలలో 2,901 ఆకస్మిక తనిఖీలు మరియు క్షేత్రస్థాయి అజ్ఞాత తనిఖీలు నిర్వహించాయి.
ఫ్లయింగ్ స్క్వాడ్‌ల నివేదిక ప్రకారం ఎన్‌సీఆర్‌లో నిబంధనలు ఉల్లంఘించిన 147 యూనిట్ల మూసివేతకు ఆదేశాలు జారీ చేయబడ్డాయి. వీటిలో ఢిల్లీలో 5 యూనిట్లు ఉన్నాయి. అలాగే హర్యానాలో 61 (ఎన్‌సిఆర్); ఉత్తరప్రదేశ్ (ఎన్‌సిఆర్)లో 60; మరియు రాజస్థాన్ (ఎన్‌సిఆర్)లో 21 యూనిట్లు ఉన్నాయి. జనవరి - మే, 2023 కాలంలో అనుమతి లేని ఇంధనాలను ఉపయోగించిన నేపథ్యంలో 51 పారిశ్రామిక యూనిట్ల మూసివేతకు ఆదేశాలు జారీ చేయబడ్డాయి. వీటిలో 08 మాత్రమే బొగ్గును ఉపయోగిస్తున్నాయి.
జనవరి - మే, 2023 మధ్య కాలంలో సరైన దిద్దుబాటు చర్యలు మరియు వాయు కాలుష్య నియంత్రణ నిబంధనలను పాటించడం వంటి చర్యల తర్వాత కమిషన్ మూసివేత ఆదేశాలు జారీ చేసిన (గతంలో సహా) 201 యూనిట్లు/ సంస్థలకు సంబంధించి పునఃప్రారంభ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. ఆపరేట్ చేయడానికి సమ్మతి (సిటిఓ) మరియు కాన్సెంట్ టు ఎస్టాబ్లిష్ (సిటిఈ), ఉద్గార నిబంధనలకు కట్టుబడి ఉండటం, ఆమోదించబడిన ఇంధనాల వినియోగం, కాలుష్య నియంత్రణ పరికరాల ఏర్పాటు మొదలైనవి ఉన్నాయి. వీటిలో ఢిల్లీలో 24 సైట్‌లు; హర్యానాలో 75 (ఎన్‌సిఆర్); ఉత్తరప్రదేశ్ (ఎన్‌సిఆర్)లో 81; మరియు రాజస్థాన్ (ఎన్‌సిఆర్)లో 21 ఉన్నాయి.
సిఏక్యూఎం తన చట్టబద్ధమైన ఆదేశాలు మరియు నిబంధనలను కఠినంగా అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. కమీషన్ జారీ చేసిన ఆదేశాలు మరియు వాయు కాలుష్య నియంత్రణ నియమాలు/నిబంధనలను ఉల్లంఘించడం మరియు పాటించకపోవడం పర్యావరణ చట్టాల ప్రకారం పరిష్కరించబడుతుంది. అటువంటి స్థూలంగా ఉల్లంఘించే యూనిట్లను మూసివేయడంతో పాటు, పర్యావరణ పరిహార ఛార్జీలు (ఈసీ) విధించడం మరియు ప్రాసిక్యూషన్ ప్రారంభించడం కోసం కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
సిఏక్యూఎం రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డులు (ఎస్‌పిసిబిలు) మరియు డిబిసిసితో సహా రాష్ట్రం అమలు చేసే ఏజెన్సీలకు కమిషన్ జారీ చేసిన చట్టబద్ధమైన ఆదేశాలను ఖచ్చితంగా పాటించేలా మరియు ఖచ్చితంగా అమలు చేయాలని సూచించింది.
******
(Release ID: 1929300)
Visitor Counter : 200