ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఎలక్ట్రానిక్స్ రిపేర్ సర్వీసెస్ అవుట్ సోర్సింగ్ (ఈఆర్ఎస్ఓ) పైలట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ఎంఈఐటివై
భారత్ ను గ్లోబల్ రిపేర్ రాజధానిగా చేయనున్న ఈఆర్ఎస్ఓ
వచ్చే ఐదేళ్లలో అవుట్ సోర్స్ ద్వారా రిపేర్ కి 20 బిలియన్ డాలర్ల రెవెన్యూ అవకాశం
Posted On:
31 MAY 2023 4:42PM by PIB Hyderabad
భారతదేశాన్ని గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ పవర్‌హౌస్‌గా మార్చాలనే ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా, భారతదేశాన్ని ప్రపంచానికి మరమ్మతు రాజధానిగా మార్చడానికి చర్యలు చేపట్టారు. కొన్ని పరివర్తన విధానాలను, ప్రక్రియ మార్పులను ధృవీకరించడానికి ప్రభుత్వం ఈరోజు ఈఆర్ఎస్ఓ పైలట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ఎంఈఐటివై, సీబీఐసి, డీజీఎఫ్టి, ఎంఓఈఎఫ్ అండ్ సీసీ పరిశ్రమ వృద్ధికి నిజమైన నిబద్ధతను ప్రదర్శిస్తూ, భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ఐసీటీ ఉత్పత్తులకు అత్యంత ఆకర్షణీయమైన మరమ్మత్తు గమ్యస్థానంగా మార్చే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈ దిశగా పరివర్తన విధానం, ప్రక్రియ మార్పులను ప్రభావితం చేయడానికి పరిశ్రమతో మిళితం అయి పని చేస్తున్నాయి. రాబోయే 5 సంవత్సరాలలో, ఈఆర్ఎస్ఓ పరిశ్రమ భారతదేశానికి 20 బిలియన్ డాలర్ల వరకు ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంది. మిలియన్ల కొద్దీ ఉద్యోగాలను కూడా సృష్టించవచ్చు.
ఈ ప్రాజెక్ట్ భారతదేశానికి గేమ్‌చేంజర్ కాబోతోంది. ఇప్పటివరకు ఉపయోగించని డొమైన్‌లో భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామిగా మార్చడానికి ప్రభుత్వం మద్దతునిచ్చింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ, రైల్వేలు, కమ్యూనికేషన్ల మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ఆలోచన విధానం, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమర్థ మార్గదర్శకత్వం కారణంగా ప్రక్రియ, విధాన మార్పులు సాధ్యమయ్యాయి.
ఈఆర్ఎస్ఓ కోసం అవసరమైన విధానం, ప్రక్రియ మార్పులు గత కొన్ని నెలలుగా ప్రభుత్వంలోని వివిధ శాఖలు మరమ్మతు పరిశ్రమతో లోతైన చర్చల తర్వాత ప్రవేశపెట్టబడ్డాయి. ప్రారంభించిన పరిమిత పైలట్ ద్వారా వాటి సమర్థత, సామర్థ్యం కోసం ధ్రువీకరణ అవుతుంది. పైలట్ బెంగళూరులో నిర్వహిస్తున్నారు, ఇది మూడు నెలల పాటు అమలులో ఉంటుంది. ఫ్లెక్స్, లెనోవో, సిటిడిఐ, ఆర్-లాజిక్, అఫోరిజర్వ్ అనే ఐదు కంపెనీలు పైలట్ కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చాయి. పైలట్ తర్వాత ఒక వివరణాత్మక అంచనా నిర్వహిస్తారు. అవసరమైన విధంగా ప్రక్రియ, విధానంలో మార్పులు చేస్తారు.
*******
(Release ID: 1928945)
Visitor Counter : 152