సహకార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

"సహకార రంగంలో ప్రపంచంలోనే అతి పెద్ద ధాన్యంనిల్వ ప్రణాళిక" కోసం ఒక అంతర్ మంత్రిత్వ సంఘం (ఐఎమ్ సి) ని ఏర్పాటుచేయడానికి మరియు ఆ సంఘాని కి సాధికారిత ను కల్పించడానికి ఆమోదం తెలిపిన మంత్రిమండలి

Posted On: 31 MAY 2023 3:45PM by PIB Hyderabad

వ్యవసాయం మరియు రైతుల సంక్షేమం మంత్రిత్వ శాఖ యొక్క, వినియోగదారు వ్యవహారాలు, ఆహారం, సార్వజనిక వితరణ మరియు ఫూడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ ల మంత్రిత్వ శాఖ యొక్క వివిధ పథకాల మేళనం ద్వారా "సహకార రంగం లో ప్రపంచం లోకెల్లా అతి పెద్దది గా ఉండేటటువంటి ధాన్యం నిల్వ ప్రణాళిక" రూపకల్పన కోసం ఒక అంతర్ మంత్రిత్వ సంఘం (ఐఎమ్ సి) ని ఏర్పాటు చేయడానికి మరియు ఆ సంఘానికి సాధికారత ను కల్పించడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న ఈ రోజు న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదాన్ని తెలిపింది.



వృత్తిపరమైన పద్ధతి లో ప్రణాళిక కాలపరిమితి మరియు ఏకరీతి అమలు ను నిర్ధారించడానికి సహకార మంత్రిత్వ శాఖ దేశం లోని వివిధ రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల లోని ఎంపిక చేసిన కనీసం 10 జిల్లాల లో పైలట్ ప్రాజెక్టు ను అమలు చేస్తుంది. ఈ పైలట్ ప్రాజెక్టు ఈ పథకం లోని వివిధ ప్రాంతీయ అవసరాల పై ముఖ్యమైనటువంటి సమాచారాన్ని అందిస్తుంది. ఆ సమాచారాన్ని ఈ పథకాన్ని దేశవ్యాప్తం గా అమలు చేయడం లో ఉపయోగించుకోవడం జరుగుతుంది.





  • మంజూరు వ్యయం మరియు నిర్ధారిత లక్ష్యాల పరిధి లో ఎంపిక చేసిన ‘లాభసాటి’ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పిఎసిఎస్) లో వ్యవసాయం సంబంధి ఉద్దేశ్యాల కోసం గోదాము వగైరా నిర్మాణం మాధ్యం ద్వారా 'సహకార రంగం లో ప్రపంచం లోనే అతి పెద్ద ధాన్యం నిల్వ ప్రణాళిక' ను సిద్ధం చేయడం కోసం సంబంధిత మంత్రిత్వ శాఖల పథకాల దిశానిర్దేశాలు/ అమలు పద్ధతుల లో అవసరాలకు తగినట్లు గా సవరణ చేయడం కోసం వ్యవసాయం మరియు రైతు సంక్షేమం శాఖ మంత్రి, వినియోగదారు వ్యవహారాలు, ఆహారం మరియు సార్వజనిక వితరణ శాఖ మంత్రి, ఫూడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ ల మంత్రి మరియు సంబంధిత మంత్రిత్వ శాఖల కార్యదర్శులు సభ్యులు గా సహకార మంత్రి అధ్యక్షత న ఒక అంతర్ మంత్రిత్వ సంఘాన్ని (ఐఎమ్ సి ని) ఏర్పాటు చేయడం జరుగుతుంది.

ఈ ప్రణాళిక ను సంబంధిత మంత్రిత్వ శాఖల యొక్క గుర్తింపు గల పథకాల లో భాగం గా అందజేసే వ్యయం ద్వారా అమలుపరచడం జరుగుతుంది. ఈ పథకం లో భాగం గా కన్వర్జెన్స్ కోసం ఈ క్రింది పథకాల ను గుర్తించడమైంది:



(ఎ) వ్యవసాయం మరియు రైతుల సంక్షేమం మంత్రిత్వ శాఖ:

 

  1. ఎగ్రీకల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండు (ఎఐఎఫ్),
  2. ఎగ్రీకల్చరల్ మార్కెటింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్కీము (ఏఎంఐ),
  3. మిశన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్ (ఎమ్ఐడిహెచ్),
  4. వ్యవసాయ యాంత్రీకరణపై సబ్- మిశన్ (ఎస్‌ఎమ్ఎఎమ్)


(బి) ఫూడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ ల మంత్రిత్వ శాఖ:



i. ప్రధాన మంత్రి ఫార్మలైజేశన్ ఆఫ్ మైక్రో ఫూడ్ ప్రాసెసింగ్

ఎంటర్‌ప్రైజెస్ స్కీము (పిఎమ్ఎఫ్ఎమ్ఇ),

ii. ప్రధాన్ మంత్రి కిసాన్ సంపద యోజన (పిఎమ్ కెఎస్‌ వై)



(సి) వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆహారం మరియు సార్వజనిక వితరణ:

 

  1. జాతీయ ఆహార భద్రత చట్టం లో భాగం గా ఆహార ధాన్యాల కేటాయింపు,
  2. కనీస మద్దతు ధర వద్ద సేకరణ కార్యకలాపాలు


ప్రణాళిక ప్రయోజనాలు


ఈ ప్రణాళిక బహుముఖం గా ఉంది ; ఇది పిఎసిఎస్ స్థాయి లో గోడౌన్‌ ల ఏర్పాటు ను సులభతరం చేయడం ద్వారా దేశం లో వ్యవసాయ నిల్వ కు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాల కొరత ను పరిష్కరించడమే కాకుండా పిపఎసిఎస్ అనేక ఇతర కార్యకలాపాల ను చేపట్టేందుకు కూడా వీలు కల్పిస్తుంది. ఆ కార్యకలాపాలు ఏమేమిటి అంటే అవి:

 

· స్టేట్ ఏజెన్సీలు/ ఫూడ్ కార్పొరేశన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ సిఐ) oకోసం సేకరణ కేంద్రాలు గా పని చేయడం;

· చౌక ధర ల దుకాణాలు (ఎఫ్‌ పిఎస్);

· కస్టమ్ హైరింగ్ సెంటర్ స్ ను ఏర్పాటు చేయడం;

· వ్యవసాయ ఉత్పత్తుల కోసం అంచనా వేయడం, క్రమబద్ధీకరించడం, గ్రేడింగ్ యూనిట్లు మొదలైన వాటితో సహా సాధారణ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడం.

ఇవే కాక, స్థానిక స్థాయి లో వికేంద్రీకృత నిల్వ సామర్థ్యాన్ని సృష్టించడం ఆహార ధాన్యం వృథా ను అరికట్టడం తో పాటు గా దేశ ఆహార భద్రత ను పటిష్టం చేస్తుంది కూడా ను.

రైతుల కు వివిధ ఎంపికల ను అందించి తద్ద్వారా ఇది పంటల ను తక్కువ ధర కు విక్రయించడాన్ని నివారిస్తుంది, ఫలితం గా రైతులు వారి ఉత్పత్తుల కు మంచి ధరల ను రాబట్టుకో గలుగుతారు.

ఇది ఆహార ధాన్యాల ను కొనుగోలు కేంద్రాల కు రవాణా చేయడం మరియు నిల్వల ను తిరిగి గిడ్డంగుల నుండి ఎఫ్‌ పిఎస్‌ కి రవాణా చేయడం లో అయ్యే ఖర్చు ను భారీ గా తగ్గిస్తుంది.

‘సంపూర్ణ ప్రభుత్వం’ విధానాన్ని అవలంబించడం ద్వారా, ఈ ప్రణాళిక పిఫఎసిఎస్ ను వాటి వ్యాపార కార్యకలాపాల ను వైవిధ్యీకరించుకోవడానికి వీలు కల్పించి వాటిని బలోపేతం చేస్తుంది. ఫలితం గా సభ్యత్వం కలిగిన రైతు ల ఆదాయాల ను కూడా పెంచుతుంది.

 


కాలపరిమితి మరియు అమలు విధానం

 

. మంత్రిమండలి ఆమోదం పొందిన ఒక వారం రోజుల లోపల జాతీయ స్థాయి సమన్వయ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది.

. మంత్రిమండలి ఆమోదం పొందిన 15 రోజుల లోపల అమలు సంబంధి మార్గదర్శకాలు జారీ చేయబడతాయి.

. మంత్రిమండలి ఆమోదం అనంతరం 45 రోజుల లోగా భారత ప్రభుత్వం తో పిఎసిఎస్ సంధానం కోసం ఒక పోర్టల్ ను తీసుకురావడం జరుగుతుంది.

. మంత్రిమండలి ఆమోదం లభించిన తరువాత 45 రోజుల లోపల ప్రతిపాదన అమలు ఆరంభం అవుతుంది.


పూర్వరంగం

"సహకార్-సే-సమృద్ధి" యొక్క దార్శనికత ను సాకారం చేసుకోవడానికి సహకార సంఘాల బలాన్ని పెంచి, వాటిని విజయవంతమైన మరియు శక్తివంతమైన వ్యాపార సంస్థలుగా మార్చడానికి అన్ని ప్రయత్నాలు చేయాలని భారతదేశం ప్రధాన మంత్రి భావిస్తున్నారు. ఈ దృక్పథాన్ని ముందుకు తీసుకుపోయేందుకు సహకార మంత్రిత్వ శాఖ "సహకార రంగం లో ప్రపంచం లోనే అతి పెద్దదైనటువంటి ధాన్యం నిల్వ ప్రణాళిక"ను తీసుకు వచ్చింది. పిఎసిఎస్ స్థాయి లో గిడ్డంగి, కస్టమ్ హైరింగ్ సెంటర్ స్, ప్రాసెసింగ్ యూనిట్ స్ మొదలైన వాటితో సహా వివిధ రకాల వ్యవసాయ-మౌలిక సదుపాయాల ను ఏర్పాటు చేయడం, తద్వారా వాటిని బహుళార్ధసాధక సమాజాలు గా మార్చడం ఈ ప్రణాళికలో ఉంది. పిఎసిఎస్ స్థాయి లో మౌలిక సదుపాయాల కల్పన మరియు ఆధునికీకరణ తగినంత నిల్వ సామర్థ్యాన్ని సృష్టించడం ద్వారా ఆహార ధాన్యం వృధా ను తగ్గిస్తుంది. ఆహార భద్రతను బలోపేతం చేస్తుంది. రైతులు వారి పంటల కు మంచి ధరల ను పొందేలా చేస్తుంది.



దేశం లో 1,00,000 కంటే ఎక్కువ ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీ లు (పిఎసిఎస్) ఉన్నాయి. 13 కోట్ల కంటే ఎక్కువ మంది రైతులు ఉన్నారు. భారతదేశం ఆర్థిక వ్యవస్థ యొక్క వ్యవసాయ మరియు గ్రామీణ ముఖచిత్రాలను మార్చడం లో పిఎసిఎస్ లు పోషిస్తున్నటువంటి ముఖ్య పాత్ర ను దృష్టి లో పెట్టుకొని మరియు వాటి వ్యాప్తి ని చివరి మైలు వరకు తీసుకుపోవడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడమైంది. వికేంద్రీకరించే నిల్వ సదుపాయాన్ని పిఎసిఎస్ స్థాయి లో నెలకొల్పడం తో పాటు వ్యవసాయ సంబంధి మౌలిక సదుపాయాల ను ఏర్పాటు చేయడం జరిగిందా అంటే గనక అది దేశం లో ఆహార భద్రతను బలోపేతం చేయడమే కాకుండా పిఎసిఎస్ లు వాటిని అవి గతిశీల ఆర్థిక సంస్థలు గా మార్పు నకు లోను అయ్యేటట్టు కూడా చేయగలుగుతుంది.

 

***


(Release ID: 1928741) Visitor Counter : 165