రక్షణ మంత్రిత్వ శాఖ
అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఆవిష్కరణలు సాధించి భారతదేశం స్థాయిని 'అనుకరణ' నుంచి ;నాయకత్వ' స్థాయికి పెంచాలి.. సీఐఐ వార్షిక సమావేశంలో పరిశ్రమ వర్గాలకు రక్షణ శాఖ మంత్రి పిలుపు
"ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల నేపథ్యంలో దేశ అభివృద్ధి, భద్రత అంశాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంలో పరిశోధన, అభివృద్ధి కీలకంగా ఉంటాయి" రక్షణ శాఖ మంత్రి
భారతదేశానికి జనాభా ఒక వరం: జనాభా 'సంపద వినియోగించే వనరు" గా కాకుండా 'సంపద సృష్టించే వనరు' గా అభివృద్ధి సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.. రక్షణ శాఖ మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
25 MAY 2023 2:02PM by PIB Hyderabad
అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఆవిష్కరణలు సాధించి భారతదేశం స్థాయిని 'అనుకరణ' నుంచి ;నాయకత్వ' స్థాయికి పంచడానికి పరిశ్రమ రంగం కృషి చేయాలని రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పిలుపు ఇచ్చారు. నూతన ఆవిష్కరణలతో భవిష్యత్తు సవాళ్లు ఎదుర్కోవడానికి దేశాన్ని సిద్ధం చేయాలని ఆయన కోరారు. 2023 మే 25న జరిగిన భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) వార్షిక సమావేశంలో మంత్రి ప్రసంగించారు. ‘భవిష్యత్ అవసరాలు : పోటీతత్వం, సాంకేతికత, స్థిరత్వం మరియు అంతర్జాతీయీకరణ’ అనే ఇతివృత్తంతో సమావేశం జరిగింది.
నేటి యుగంలో భద్రతా సమీకరణాలు అత్యంత వేగంగా మారుతున్నాయి అని తెలిపిన మంత్రి కృత్రిమ మేధస్సు, క్వాంటమ్ కంప్యూటింగ్, జన్యుశాస్త్రం మొదలైన రంగాల్లో సాంకేతిక పురోగతి సాధించడానికి గతంలో కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయని అన్నారు. సాంకేతికత పోటీలో వెనుకబడి ఉండకుండా దేశాభివృద్ధి సాధన కోసం ప్రాధాన్యత రంగాలు మారుతున్నాయని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంలో పరిశోధన,అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా పోటీని ఎదుర్కోవడానికి, దేశాభివృద్ధి సాధించడానికి అవకాశం కలుగుందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానంలో పరిశోధన,అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టక తప్పదని ఆయన స్పష్టం చేశారు.' లక్ష్యాలను నిర్ణయించుకోవాలి. లక్ష్యాన్ని సాధించడానికి నూతన ఆవిష్కరణలు జరగాలి. ప్రపంచ స్థాయిలో చూస్తూ చేసుకుంటున్న పరిష్టితులను దృష్టిలో ఉంచుకుని సవాళ్లు ఎదుర్కొని, లక్షాన్ని సాధించడానికి వినూత్న విధానాల ద్వారా కృషి జరగాలి. వనరులుగా ఉపయోగిస్తున్న వస్తువులను ఉత్పత్తి వనరులుగా అభివృద్ధి చేసే సామర్థ్యం పరిశోధన, అభివృద్ధి రంగాలకు ఉంది." అని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ వివరించారు.
రక్షణ, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, వాణిజ్యం, కమ్యూనికేషన్‌తో సహా వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించడానికి పరిశోధన, అభివృద్ధి అంశాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.దీనివల్ల దేశం స్వావలంబన సాధించి ఇతరులపై ఆధారపడకుండా అగ్రస్థానంలో ఉండటానికి అవకాశం కలుగుతుందన్నారు. “మనల్ని మనం దృఢంగా వుంచుకోవడానికి ఈ రంగాల్లో శక్తి సామర్ధ్యాలు కలిగి ఉండాలి. సాంకేతిక రంగంలో అగ్రగామిగా మారినప్పుడు మాత్రమే ఈ లక్ష్యం నెరవేరుతుంది’’ అని అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞానానికి రెండుప్రధాన అంశాలు ఉన్నాయని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో ఆవిష్కరణలు, నూతన ఉత్పత్తుల ద్వారా ఇతర దేశాలను శాసించే శక్తితో నాయకత్వ దేశంగా గుర్తింపు పొందడం, నాయకుడిని అనుసరించే అనుకరించే వ్యక్తిగా గుర్తింపు పొందడం ఈ రెండు అంశాలు అని మంత్రి వ్యాఖ్యానించారు. సాంకేతిక రంగంలో భారతదేశాన్ని అగ్ర స్థానంలో నిలబెట్టడానికి పరిశ్రమ వర్గాలు కృషి చేయాలని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ కోరారు. వారి అంతర్గత పరిశోధన, అభివృద్ధి రంగాలకు నిధులు పెంచాలని, నూతన సాంకేతిక విధానాలతో ఇంతవరకు ప్రాధాన్యత లభించని రంగాలు/ ఉత్పత్తులు/వస్తువులు సేవలపై దృష్టి సారించాలని ఆయన సూచించారు.
సాంకేతిక రంగంలో అగ్రగామి దేశంగా అవతరించడానికి అవసరమైన ముఖ్య అంశాలను రక్షణ శాఖ మంత్రి వివరించారు. తగినంత మూలధనం, పటిష్టమైన మౌలిక సదుపాయాలు కలిగిన పరిశోధన, అభివృద్ధి రంగం,మునుపటి సాంకేతికతలను అవలంబించడం, అర్థం చేసుకోవడం ద్వారా సాంకేతికంగా అభివృద్ధి సాధించడానికి అవకాశం కలిగిస్తాయని మంత్రి అన్నారు. పరిశోధన, అభివృద్ధి రంగాలకు ప్రోత్సాహం అందించి, పరిశ్రమతో కలిసి యువత పనిచేసేలా చూసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు రూపొందించి అమలు చేస్తున్నాదని రక్షణ శాఖ మంత్రి తెలిపారు. దీనిలో భాగంగా బ్యాంకింగ్ విధానం, నియంత్రణ విధానం, నిధులు సమకూర్చడం, కార్మిక విధానాలు, విద్య, ఆరోగ్య రంగాల్లో మార్పులు తేవడం వంటి అనేక చర్యలను ప్రభుత్వం అమలు చేసిందన్నారు.
సాంకేతిక రంగాన్ని 'సామాజిక-ఆర్థిక సాంకేతికత' రంగంగా శ్రీ రాజ్‌నాథ్ సింగ్ వర్ణించారు. దీనివల్ల ఒక్కప్పుడు భారంగా మారిన అధిక జనాభా ఇప్పుడు వరంగా మారిందన్నారు. “భారతదేశం ప్రస్తుతం జనాభా పరంగా ప్రయోజనం పొందే స్థితిలో ఉంది. జనాభానుతగిన విధంగా ఉపయోగించడానికి విధానాలు సిద్ధమయ్యాయి.. సుపరిపాలన ద్వారా సాంఘిక-ఆర్థిక సాంకేతికత పురోభివృద్ధి సాధించి, భారతదేశంలో వ్యాపారం చేయడం, జీవించడం సులభతరం చేసే విధంగా చర్యలు అమలు జరుగుతున్నాయి. విద్య, ఆరోగ్య రంగాలలో సంస్కరణలు అమలు జరిగాయి. దీనివల్ల ప్రజలు విద్యావంతులుగా, ఆరోగ్యవంతులుగా, నైపుణ్యం కలిగిన వారీ గా తీర్చి దిద్దడం లక్ష్యంగా ప్రభుత్వ విధానాలు అమలు జరుగుతున్నాయి .”అని ఆయన అన్నారు.
విద్యావంతులు, ఆరోగ్యవంతమైన మానవ వనరులు ఉత్పాదకతను అనేక రెట్లు పెరిగేలా చేస్తాయని పేర్కొన్న శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్రభుత్వ ప్రయత్నాలు జనాభాను కేవలం 'సంపద వినియోగించే వనరుగా ' కాకుండా 'సంపద సృష్టించే వనరు'గా మారుస్తాయన్న ఆశాభావాన్ని రక్షణ శాఖ మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు
దేశ జనాభాలో యువతను అత్యంత కీలకమైన అంశంగా శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అభివర్ణించారు. దేశంలో అభివృద్ధి చెందుతున్న స్టార్ట్-అప్‌ల సంఖ్య యువ భారత శక్తి సామర్థ్యం,, ఉత్సాహం నిదర్శనం అని పేర్కొన్నారు. “నేడు, దేశంలో దాదాపు లక్ష స్టార్టప్‌లు ఉన్నాయి; వీటిలో 100 కంటే ఎక్కువ యునికార్న్స్ ఉన్నాయి. ఎక్కువ వనరుల అవసరం లేకుండా స్టార్టప్‌లు తమ అభిరుచితో పెద్ద సంస్థలతో పోటీ పడుతున్నాయి. ప్రపంచ దిగ్గజాలతో పోటీ పడేందుకు మన పరిశ్రమలు అదే అభిరుచితో పని చేయాలి’’ అని అన్నారు.
ప్రపంచ దిగ్గజాలు, భారతీయ పరిశ్రమల నేపథ్యంలో 'టెక్నాలజీ ఇన్‌కంబెంట్ ఛాలెంజర్ మోడల్' కీలకంగా ఉంటుందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.ఈ విధానంలో నూతన సాంకేతిక అంశాలను అన్వేషించడానికి పోటీ పడే వారికి ఎక్కువ ప్రోత్సాహం ఉంటుందన్నారు. "ప్రపంచ దిగ్గజ సంస్థలు ఉన్నతమైన సాంకేతికత కారణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉండవచ్చు. కానీ సాపేక్షంగా చిన్నదైన భారత పరిశ్రమ రంగం సాంకేతికతను సవాల్ చేసే స్థాయిలో ఉంది . నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకు పరిశ్రమ వర్గాలకు ప్రభుత్వం మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుంది" అని మంత్రి అన్నారు.
రక్షణ శాఖ పరిశోధన, అభివృద్ధి కార్యదర్శి,రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఓ) చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్, రక్షణ మంత్రిత్వ శాఖ ఇతర సీనియర్ అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 1927400)
సందర్శకుల సూచీ సంఖ్య : : 206